Breaking News

ఏఐని చూసి జెన్‌జీలు ఎందుకు భయపడుతున్నారు?

Published on Fri, 09/04/2026 - 10:11

కాలం వేగం పుంజుకుంటోంది. టెక్నాలజీ శరవేగంగా దూసుకెళుతోంది. గడచిన వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ‘టెక్‌’ మార్పులపై ఓ లుక్‌ వేద్దామా?

1.ఏఐతో సైబర్‌ దాడులు!
ఏఐ ఆధారిత సైబర్‌ దాడులు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని టెక్‌ సంస్థలు హెచ్చరించాయి. ఓపెన్‌ ఏఐ, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్‌ సహా 100కుపైగా సంస్థలు ఈ ముప్పును ఎదుర్కొనేందుకు సైబర్‌ రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చాయి.

2. హ్యాక్‌ చేసింది!
ఓపెన్‌ ఏఐ నిర్వహించిన సైబర్‌ సెక్యూరిటీ పరీక్షలో ఏఐ ఏజెంట్లు శాండ్‌బాక్స్‌ నుంచి బయటపడి ఇంటర్నెట్‌లోకి వెళ్లి, మరో ఏఐ ఏజెంట్‌తో కమ్యూనికేట్‌ చేస్తూ హగ్గింగ్‌ ఫేస్‌ సంస్థ ΄్లాట్‌ఫామ్‌ను హ్యాక్‌ చేశాయి. ఏఐకి సైబర్‌ నైపుణ్యాలు వేగంగా పెరుగుతున్నాయని చెప్పడానికి  ఇదొక హెచ్చరికగా భావించవచ్చు..

3. 399కే ‘బాతు’ రోబోట్‌!
హగ్గింగ్‌ ఫేస్‌ సంస్థ ‘మైక్రోడక్‌’ పేరుతో ఓ చిన్న ఓపె¯Œ సోర్స్‌ రోబోను విడుదల చేసింది. కేవలం 25 సెంటీమీటర్ల ఎత్తు, సుమారు 800 గ్రాముల బరువున్న ఈ రోబోను యూజర్లు తమకు కావాల్సిన పనులు నేర్పించుకునేలా రూ΄÷ందించారు. దీని ధర 399 డాలర్లు.

4. మాట్లాడే ఆడియో సిస్టమ్‌!
సోనోస్‌ సంస్థ కొత్త హెడ్‌ఫో¯Œ ్స, సౌండ్‌బార్‌తో ΄ాటు ‘సోనోస్‌ 27’ అనే కొత్త ఆడియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ప్రకటించింది. ఇందులో ఏఐ అసిస్టెంట్లు, చాట్‌ జీపీటీ ఆధారిత మ్యూజిక్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఉండటంతో ఆడియో గ్యాడ్జెట్లు కూడా ఏఐ వైపు వేగంగా మారుతున్నాయి.

5. ఇన్‌స్టా షాక్‌!
ఏఐతో తయారైన వ్యక్తులను నిజమైన మనుషులుగా చూపించే అకౌంట్లపై ఇన్‌స్టాగ్రామ్‌ కఠినంగా వ్యవహరించనుంది. ఏఐ జనరేటెడ్‌ ్ర΄÷ఫైల్‌ అని వెల్లడించకుండా కంటెంట్‌ పెట్టే అకౌంట్ల రీచ్‌ను తగ్గించనున్నట్లు ప్రకటించింది. సోషల్‌ మీడియాలో ఏఐ కంటెంట్‌పై ΄ారదర్శకత పెంచడమే దీని ఉద్దేశం.

6. మీ మాటల్లో ఐదు భారతీయ భాషలు
మెటా సంస్థ ‘మ్యూస్‌ వాయిస్‌ ట్రాన్స్‌క్రైబ్‌’ పేరుతో కొత్త రియల్‌టైమ్‌ స్పీచ్‌–టు–టెక్ట్స్‌ ఏఐ  మోడల్‌ను ప్రకటించింది. ఇది తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ వంటి భారతీయ భాషలతో సహా 70కుపైగా భాషలపై శిక్షణ ΄÷ందింది. ఒకే సంభాషణలో భాషలు మారినా అర్థం చేసుకోవడం దీని ప్రత్యేకత.

7. భారత్‌కు సొంత ఏఐ స్టాక్‌!
బెంగళూరుకు చెందిన ‘జ్ఞాని అర్థ’ భారతీయ సంస్థలు, ప్రభుత్వ సంస్థల కోసం సోవరిన్‌ ఏఐ స్టాక్‌ను ప్రకటించింది. భారతీయ భాషలు, లిపులకు అనుగుణంగా రూ΄÷ందించిన టెక్నాలజీతో ఏఐ వినియోగ ఖర్చులను తగ్గించడమే 
లక్ష్యంగా పెట్టుకుంది.

8. ఏఐ అంటే జెన్‌జీలకే భయం!
గ్లాస్‌ డోర్‌ ఫ్లాట్‌ ఫాం అధ్యయనం ప్రకారం ఇతర వయసుల ఉద్యోగులతో పోలిస్తే జెన్‌ జీలు ఏఐ టూల్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నప్పటికీ, ఏఐ వల్ల ఉద్యోగాలపై ప్రభావం పడుతుందనే ఆందోళన కూడా వారిలోనే ఎక్కువగా ఉందట. అంటే ఏఐని ఎక్కువగా వాడుతున్న వారే భవిష్యత్తుపై ఎక్కువగా బెంగపెట్టుకున్నారన్నమాట.

ఇవి కూడా చదవండి: వరదలో కొట్టుకుపోయే పరిస్థితి.. దుపట్టాతో రక్షించిన వధువు!

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)