Breaking News

ముగియనున్న మూడు నెలల మూఢం

Published on Wed, 02/04/2026 - 11:08

శ్రీకాకుళం కల్చరల్‌/శ్రీకాకుళం: మూడు నెలల విరామం తర్వాత మంచి ముహూర్తాలు రావడంతో మళ్లీ వివాహాల సందడి మొదలైంది. గత ఏడాది నవంబరు 26 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 13 వరకు మూఢాలు కావడంతో చాలామంది వివాహాది శుభకార్యాలకు దూరంగా ఉన్నారు. మాఘ మాసం వివాహాలకు మంచిదైనప్పటికీ మూఢం కారణంగా ఫిబ్రవరి 18 వరకు సరైన ముహుర్తాలు లేకుండాపోయాయి. ఎట్టకేలకు ఫిబ్రవరి 19 నుంచి ఫాల్గుణ మాసం మొదలు కావడంతో వివాహాలకు సిద్ధమవుతున్నారు. 

అంతటా బిజీబిజీ.. 
ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది అపురూప ఘట్టం. వివాహ మధురానుభూతులను జీవితాంతం గుర్తుగా దాచుకోవాలనుకుంటారు. పెళ్లి ముహూర్తాలు మొదలుకావడంతో వివాహ సంబంధిత వ్యాపారాలైన భాజాభజంత్రీలు, డెకరేషన్‌ నిర్వాహకులు, కర్పూర దండల షాపులు, లైటింగ్, మైక్‌సెట్‌ నిర్వాహకులు, వస్త్ర వ్యాపారులు, బంగారం షాపుల వద్ద హడావిడి బాగా పెరిగింది. పెళ్లి మండపాలకు డిమాండు బాగానే ఉంది. ఇక, ముహుర్తాల కోసం జాతకాలు తీసుకొచ్చే వారితో జ్యోతిషాలయాల కిటకిటలాడుతున్నాయి. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా సుమారు 2వేల వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశాలు  ఉన్నాయి.   

భోజనాల్లో తగ్గేదేలే..  
వివాహ వేడుకల్లో భోజనాలదీ కీలక ఘట్టమే. దీనికోసం జిల్లాలో అనేక కేటరింగ్‌ సరీ్వసులు సిద్ధంగా ఉన్నాయి. వడ్డించే ఐటెమ్స్‌ బట్టి ధరలు ఉన్నాయి. ప్లేట్‌ రూ.150 నుంచి రూ.1000 వరకు ధరలు పలుకుతున్నాయి. కొందరు దూరప్రాంతాలైన విశాఖ, విజయవాడ, రాజమండ్రిల నుంచి సైతం కేటరింగ్‌ సర్వీసులను రప్పిస్తున్నారు.  

19 నుంచి శుభముహూర్తాలు 
గత ఏడాది నవంబరు నెలాఖరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 18 వరకు మూఢాలు ఉండడంతో మంచి ముహూర్తాలు లేవు. ఫిబ్రవరి 19 నుంచి శుభముహుర్తాలు మొదలు కానున్నాయి. చాలా మంది వివాహాలకు సన్నద్ధమవుతున్నారు.  
– తెన్నేటి విక్రమశర్మ, పంచాంగకర్త

 మంచి ముహూర్తాలివే.. 
ఫిబ్రవరితో పాటు మార్చి, ఏప్రిల్, మే, జూన్, ఆగస్టు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఎక్కువగా పెళ్లిళ్లు జరగనుట్లు పంచాంగకర్తలు చెపుతున్నారు. 

ఫిబ్రవరి:  19, 20, 21, 24, 25, 26  మార్చి : 4, 5, 6, 7, 8, 11, 12, 13, 14, 20, 21, 25, 29  ఏప్రిల్‌:  1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 21, 25, 26, 28, 29, 30  

మే: 1, 3, 5, 6, 7, 8, 9, 10, 12, 13 

జూన్‌: 19, 20, 21, 24, 25, 26, 27, 28, జూలై:  1, 2, 3, 4, 5, 8, 9 ఆగస్టు:  16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30, 

సెపె్టంబరు : 1, 3, 4, 5 , అక్టోబరు : 11, 14, 29, 30 

నవంబరు:  5, 11, 12, 13, 14, 15, 18, 19, 20, 21, 22, 24, 25, 26 ,డిసెంబరు : 2, 3, 4, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 22, 23, 27, 29, 30, 31

అభిరుచికి తగ్గట్టు.. 
కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా పెల్లి మండపాన్ని అలంకరిస్తుంటారు. కొందరు ప్లాస్టిక్‌ పూలతో సరిపెట్టుకోగా, మరికొంత మంది నిజమైన పూలతో మండపం సిద్ధం చేయమంటారు. వారి కోసం బెంగళూరు వంటి దూర ప్రాంతాల నుంచి సైతం పూలు, ఇతర సామగ్రి తెస్తుంటాం.    
– గోపి, క్లాత్‌ డెకరేషన్, శ్రీకాకుళం  

ముహూర్తాలు మళ్లీ మొదలు
ఏడాదిలో ఎన్ని పెళ్లి ముహుర్తాలు ఉంటే అంత ఆదాయం. ఈ ఏడాది మూడునెలలు మూఢాల వల్ల వివాహాది శుభకార్యాలు చాలా వరకు వాయిదాపడ్డాయి. మళ్లీ ముహుర్తాలు మొదలు కావడంతో వివాహాలు జరుపుకునేందుకు మా వద్దకు వస్తున్నారు.  
– పి.నర్సింహమూర్తి, పురోహితులు   

Videos

పట్టాభిపురం చేరుకున్న YS జగన్

చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు

గుంటూరుకు చేరుకున్న YS జగన్ కాన్వాయ్

Chiranjeevi : క్యాన్సర్ మహమ్మారిని తేలిగ్గా తీసుకోకండి..

స్పిరిట్ లో అర్జున్ రెడ్డి.. వంగ మాస్టర్ ప్లాన్..!

జగన్ అభిమానులను ఆపేదెవడు.... చేతులెత్తేసిన పోలీసులు..

జగన్ రాకతో దద్దరిల్లిన గుంటూరు

ఏమి జనం సామీ..! గుంటూరులో జన సునామి

ఇసుకేస్తే రాలనంత జనం. ఈ వీడియో చూస్తే చంద్రబాబు ఏమైపోతాడో

YSRCP Leaders : లోకేష్‌కు మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

జగన్‌ రాకతో దద్దరిల్లిన గుంటూరు (చిత్రాలు)

+5

అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. మరిన్ని కొత్త (ఫొటోలు)

+5

ఫుడ్ అంటే ఎంత ఇష్టమో.. ఆషికా క్రేవింగ్స్ (ఫొటోలు)

+5

పశ్చిమ గోదావరిలో ఎంతో ఫేమస్ ఈ ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

నెట్‌ఫ్లిక్స్ గ్రాండ్ ఈవెంట్.. సగం బాలీవుడ్ ఇక్కడే ఉందిగా (ఫొటోలు)

+5

జ్యోతిర్లింగాల యాత్ర మొదలుపెట్టిన హీరోయిన్ (ఫొటోలు)

+5

క్యూట్ జోడీ.. జనవరి ఎంజాయ్ చేశారిలా (ఫొటోలు)

+5

అనసూయ డైలీ రొటీన్ ఇదే.. పోస్ట్ వైరల్ (ఫొటోలు)

+5

హీరోయిన్ జెనీలియా పెళ్లి జ్ఞాపకాలు (ఫొటోలు)