Breaking News

బిందె నిండాలంటే.. జాగారం చేయాల్సిందే!

Published on Thu, 03/20/2025 - 11:59

వేసవి వచ్చిందంటే.. మండించే ఎండలేకాదు. నీటి  ఎద్దడి కూడా భయపెడుతుంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా   తాగు నీరు కోసం ప్రజలు పడే బాధలు, కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల మహిళల  అవస్థలు వర్ణనాతీతం.   బిందెడు నీళ్లకోసం   వారు పడే ఆవేదనకు అద్దం పట్టే కథనం ఇది!

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చుతోంది. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో భూగర్భ జలాలు క్రమేణా అడుగంటిపోతున్నాయి. దీంతో నీటి సమస్య జఠిలమవుతోంది. ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని ఖండాల గ్రామంలో మిషన్‌ భగీరథ ట్యాంక్‌ ఉన్నప్పటికీ ఆ ట్యాంకు ఎప్పుడు నిండుతుందో తెలియక ప్రతియేటా గ్రామ శివారులోని చేదబావి నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. 

అయితే ఎండల తీవ్రతతో ఆ బావి ఎండిపోవడంతో మిషన్‌ భగీరథే దిక్కైంది. అది కూడా మూడునాలుగు రోజులకు ఒకసారి ఆ ట్యాంకు నిండుతుంది. ఒక్కొక్కరికి రెండు బిందెలే వస్తుండటంతో వాటి కోసం గ్రామస్తులు వేకువజామునే బిందెలతో ట్యాంకు వద్దకు చేరుకుని జాగారం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. తాగునీరే అందకపోగా మూగజీవాలకు, ఇతర అవసరాలకు నీరు లభించడం గగనమైంది. దీంతో గ్రామస్తులు పాలకులపై తీవ్రంగా మండిపడుతున్నారు.  

– సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆదిలాబాద్‌

 చదవండి: అలా చేస్తే అత్యాచారం కిందికి రాదు : అలహాబాద్‌ కోర్టు తీర్పుపై దుమారం

Videos

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)