Breaking News

అక్కడ మన కొబ్బరి చిప్ప చాలా కాస్ట్లీ గురూ!

Published on Mon, 08/26/2024 - 16:55

పనికి రాని కొబ్బరి చిప్పలతో సహా అనేక ఇతర వస్తువులతో బోలెడన్ని పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేయడం చూస్తూనే ఉంటాం. కానీ వాడి పారేసిన కొబ్బరి చిప్పలు ప్రముఖ వ్యాపార కేంద్రాల్లో భారీ ధర పలుకుతున్న వైనం నెట్టింట సందడి చేస్తోంది.  దీని రేటు తెలిస్తే  ఔరా అనాల్సిందే.   దీని అర చిప్ప ధర రూ. 23 పలుకుతోంది. దీంతో పారేసే కొబ్బరి చిప్పలకు ఇంత డిమాండ్ ఉందా అని కొందరు, కొన్నినమ్మేయాలి డ్యూడ్‌..అదే వ్యాపార సూత్రం అంటున్నారుమరికొందరు నెటిజన్లు

సాధారణంగా దక్షిణాదిన కొబ్బరి కాయలను పూజల్లోనూ, వంటల్లోనూ వాడతాం. అనేక రకాల వంటకాల్లో కొబ్బరిని విరివిగా వాడతారు. లేత కొబ్బరి నీళ్లను ఆరోగ్యం కోసం తాగుతాం. కానీ చిప్పలతో కూడా వ్యాపారం చేయవచ్చు అనేది లేటెస్ట్‌ ట్రెండ్‌. ఇవి  గొప్ప సరుకు.. వ్యర్థాలను వినియోగంలోకి తీసుకురావడం చాలా అవసరం. కొబ్బరి చిప్పద్వారా శ్రేష్టమైన బొగ్గు లభిస్తుంది. కాబట్టి మిడిల్ ఈస్ట్‌లో బార్బెక్యూలు, అనేక ఇతర ఉపయోగాల కోసం వాడుకుంటారట. 

కొబ్బరి చిప్ప ద్వారా తయారైన బొగ్గులో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ , చిన్న మొత్తంలో ఇతర మూలకాలుంటాయి. అలాగే కొబ్బరి చిప్ప బొగ్గులో పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం మొదలైన ఖనిజ మూలకాలు లభిస్తాయని పరిశోధనల ద్వారా తెలుస్తోంది.  కొబ్బరి చిప్ప బొగ్గు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే ఒక ముఖ్యమైన పారిశ్రామిగా వనరుగా మారింది. 2023 నాటికి దీని ప్రపంచ మార్కెట్ పరిమాణం సుమారు 315 మిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇది 2024- 2032 నాటికి వార్షిక వృద్ధి రేటు (CAGR) 8 శాతంగా ఉంటుందని  అంచనా 
           
           

 

కాగా ప్లాస్టిక్‌ను నిర్మూలించాలన్న లక్ష్యంలో భాగంగా కొబ్బరి చిప్పలతో అనేక రకాల వంట సామాన్లు కూడా తయారు చేస్తారు. ఇదికూడా పెద్ద వ్యాపారమే. అలాగే గతంలో ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో వీటి విక్రయాలు జరిగిన సంగతి తెలిసిందే.

 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)