Breaking News

ఓవర్‌నైట్‌ సక్సెస్‌ కానేకాదు.. ఇది మా పన్నెండేళ్ల కష్టం!

Published on Thu, 08/20/2026 - 13:59

కోటి రూపాయల వేతనం అందుకునే మంచి ఉద్యోగాన్ని కాలదన్నుకోవడం అంటే అలాంటి ఇలాంటి సాహసం కాదు. సొంతంగా వ్యాపారం చేయాలనే ధ్యేయంతో అంత పెద్ద నిర్ణయం తీసుకోవడమే కాకుండా సక్సెస్‌ అయ్యి యువతకు ప్రేరణగా నిలిచింది ఈ 28 ఏళ్ల వివియన్‌ వాంగ్‌. మరి అంత డేరింగ్‌ నిర్ణయం తీసుకుని ఈ వనిత వ్యాపారంలో ఎలా నిలదొక్కుకుందో తెలుసుకుందామా..!

తండ్రి అనారోగ్యంతో కీలక నిర్ణయం..
చిన్నప్పటి నుంచే తండ్రి బేకరీలో పనులు చేస్తూ పెరిగిన వివియన్‌కు సొంతంగా వ్యాపారం చేయాలనే కోరిక ఉండేది. అయితే తండ్రికి క్యాన్సర్‌ నిర్ధారణ కావడంతో ఇక వ్యాపారాన్ని వాయిదా వేయకూడదని నిర్ణయించుకుంది. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి సోదరుడితో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించింది.

బియ్యంతో తయారు చేసిన మెత్తటి పిండిలో ఐస్‌క్రీమ్‌ను నింపి మోచి ఐస్‌క్రీమ్‌ బంతులను తయారు చేశారు. తొలి ఐదేళ్ల పాటు రెస్టారెంట్లు, సినిమా థియేటర్లకు విక్రయించారు. వచ్చిన లాభాలను తిరిగి వ్యాపారంలోనే పెట్టుబడిగా పెట్టారు.

అన్నీ పర్ఫెక్ట్‌ అయ్యే ఇబ్బందులను ఎదుర్కోవాల్సిందే..
వ్యాపారం ప్రారంభించిన రోజుల్లో ఖర్చులు తగ్గించుకునేందుకు ఎన్నో వ్యక్తిగత సౌకర్యాలను వదులుకుంది. కంపెనీ ఖాతాలను ఆదివారాల్లో స్వయంగా నిర్వహించడంతో పాటు ఐటీ, యంత్రాలు, ఉత్పత్తి అభివృద్ధి, సిబ్బంది నిర్వహణ వంటి ఎన్నో విషయాలను స్వయంగా నేర్చుకుంది వివియన్‌ వాంగ్‌.

  • వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ప్రతిదీ పరిపూర్ణంగా సిద్ధమయ్యే వరకు ఎదురుచూడకూడదు. 80 శాతం ఉత్పత్తి సిద్ధమైన వెంటనే మార్కెట్‌లోకి తీసుకెళ్లి.. వినియోగదారుల స్పందన ఆధారంగా మిగిలిన 20 శాతాన్ని మెరుగుపరచాలి.

  • ప్రతి అవకాశానికీ ‘అవును’ అని చెప్పకూడదు. బ్రాండ్‌ విలువలు, లక్ష్యాలు స్పష్టంగా ఉంటే ఏ ట్రెండ్‌ను అనుసరించాలో, దేనికి దూరంగా ఉండాలో నిర్ణయించుకోవచ్చు అనే అంశాలు సక్సెస్‌కి ఎంతో కీలకం.

  • నిపుణులు ఇచ్చే సలహాలను కూడా గుడ్డిగా పాటించకూడదు. ఒక వ్యాపారానికి సరిపోయే సలహా.. మరో వ్యాపారానికి సరిపోకపోవచ్చని, పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

    సోదరుడితో కలిసి పనిచేయడం తమకు బలంగా మారినా, ఇద్దరి మధ్య ఎన్నో వాదనలు జరిగేవని, ఒకరు రిస్క్‌ తీసుకోవాలని భావిస్తే.. మరొకరు జాగ్రత్తగా ఆలోచించేవారని వివియన్‌ తన అనుభవాన్ని పంచుకుంటోంది. ఈ భిన్నమైన అభిప్రాయాలే చివరకు మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడ్డాయని చెబుతుందామె.

టిక్‌టాక్‌లో వైరల్‌.. కానీ 12 ఏళ్ల కష్టం!
కరోనా సమయంలో ‘లిటిల్‌ మూన్స్‌’ టిక్‌టాక్‌లో వైరల్‌ కావడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. దీంతో చాలామంది అది రాత్రికి రాత్రే సాధించిన విజయమని భావించారు. కానీ వాస్తవానికి ఆ విజయానికి ముందు సంస్థ 12 ఏళ్ల పాటు ఎన్నో కష్టాలు పడింది. ఉత్పత్తి, సిబ్బంది శిక్షణ, ఎగుమతులు, పెద్ద రిటైలర్లకు సరఫరా వంటి అంశాల్లో ఏళ్ల పాటు అనుభవం సంపాదించింది. ఆ పునాది బలంగా ఉండటమే వైరల్‌ అయిన సమయంలో పెరిగిన డిమాండ్‌ను ఎదుర్కోవడానికి ఉపయోగపడింది.

‘ఓవర్‌నైట్‌ సక్సెస్‌ అనేది 12 ఏళ్ల కష్టానికి కనిపించే ఒక్క క్షణం మాత్రమే’ అనేది వివియన్‌ చెప్పే ముఖ్యమైన పాఠం. సొంత వ్యాపారం చేయాలనుకునేవారు సరైన సమయం కోసం ఎదురుచూడకుండా చిన్నగా ప్రారంభించి.. చేస్తూ నేర్చుకుంటూ ముందుకు సాగాలని ఆమె సూచిస్తోంది.

Videos

ఏపీ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి

Watch Live: హైదరాబాద్ లో జగన్ జనసంద్రం

భారత సైన్యం దెబ్బ.. మంచు కొండల్లో చైనాకు దిమ్మతిరిగే షాక్!

ఇది సార్ మా బ్రాండ్.. రాకాలో హాలీవుడ్ నటుడు..?

ఐయామ్ Gen-Z అంటూ ఆర్మీ పై రెచ్చిపోయిన యువతీ

బాబు కొత్త కుట్రలు.. YS అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు

టీడీపీ కార్యకర్త కీచకత్వం.. 8 ఏళ్ల బాలికకు వేధింపులు

TDP నేతకు బిగ్ షాక్

బాబు ఇంట్లో డైనింగ్ టేబుళ్లు పగిలిపోతాయి... నువ్వు ఎవడివి నాపై CBI వేయడానికి..!

YS అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు..

Photos

+5

‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్‌...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా?

+5

నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు)

+5

‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : హైటెక్స్‌లో హిమ్‌టెక్స్‌ ప్రదర్శన (ఫొటోలు)

+5

స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు)

+5

చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు)

+5

చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు)

+5

విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్‌లో విపరీతమైన రద్దీ (ఫొటోలు)

+5

నటి మాళవిక శర్మ గ్లామర్ ఫోటోలు వైరల్

+5

'అమీర్ లోగ్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)