Breaking News

కళ్లు చెదిరే కాంతుల వేడుక..!

Published on Sun, 05/18/2025 - 10:30

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరాల అందాలను చూడటం కోసం ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఎగబడుతుంటారు. పారమాట నది ఒడ్డునున్న సిడ్నీ అందాలు చూడటానికి సుమనోహరంగా ఉంటాయి. అయితే, సిడ్నీ అందాలను మరింత ప్రత్యేకంగా చూడాలంటే, వివిడ్‌ సిడ్నీ ఫెస్టివల్‌కి వెళ్లాల్సిందే! ఈ వేడుకలు మే 23 నుంచి ప్రారంభమై జూన్‌ 14 వరకు దాదాపు మూడు వారాల పాటు కొనసాగుతాయి. 

ఇక్కడ కనిపించే ప్రతి కట్టడం, చీకటిపడితే విద్యుత్‌ వెలుగులతో మిరుమిట్లు గొలుపుతాయి. సిడ్నీ ఒపెరా హౌస్, హార్బర్‌ బ్రిడ్జ్‌ వంటి ప్రదేశాలు అద్భుతమైన కాంతి ప్రదర్శనలతో కళ్లుచెదిరే కళాఖండాలుగా మారుతాయి. అంతేకాదు, నగరమంతా ఏర్పాటు చేసే విద్యుద్దీపాలంకరణ మంత్రముగ్ధుల్ని చేస్తుంది.

ఈ వేడుక కేవలం కాంతులకే పరిమితం కాదు. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత కళాకారులు, సంగీత విద్వాంసుల ప్రదర్శనలుంటాయి. వినూత్న ఆలోచనలు పంచుకునే చర్చలు, చవులూరించే ఆహార వేదికలు కూడా ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కొన్నిసార్లు ప్రత్యేకంగా నీటిపై విజువల్‌ ఎఫెక్ట్‌లు కూడా ఉంటాయి. 

హార్బర్‌లో ప్రయాణించే పడవలు కూడా లైట్లతో అలంకరించడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ వేడుకకు స్థానికులతో పాటు దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు పెద్దసంఖ్యలో సిడ్నీకి విచ్చేస్తుంటారు. ఈ వేడుకకు 2023లో రికార్డు స్థాయిలో 32.8 లక్షలమంది హాజరయ్యారు. దాంతో ఈ ఏడాది కూడా అదే స్థాయి అంచనాలున్నాయి. 

(చదవండి: డ్రాగన్స్‌ సృష్టించిన అద్భుతం!)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)