Breaking News

Vishu 2025 విషు అంటే ఏంటి? విషుకణి గురించి తెలుసా?

Published on Mon, 04/14/2025 - 15:57

మలయాళీలు సంవత్సరాదిని విషుగా వ్యవహరిస్తారు. కేరళ, కర్ణాటకలోని తుళునాడు ప్రాంతం, పుదుచ్చేరిలోని మాహే జిల్లా, తమిళనాడులోని అనేక జిల్లాల్లో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న  మలయాళీ లు జరుపుకునే  ఉగాది పండుగ  విషు. విషును మలయాళ నెల మేడం మొదటి రోజున జరుపుకుంటారు, ఇది సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్‌లో ఏప్రిల్ 14 లేదా 15న వస్తుంది. అధికారిక మలయాళ క్యాలెండర్ (కొల్లం ఎరా) చింగం నెలతో ప్రారంభమైనప్పటికీ, ఇది కేరళలో సాంప్రదాయ నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది.

సూర్యుడు మేడం రాశి (మేష రాశి)లోకి  మారడాన్ని విషు సూచిస్తుంది. సంస్కృతంలో విషు అంటే సమానం, అంటే పగలు మరియు రాత్రి సమాన సంఖ్యలో ఉండే రోజు లేదా విషువత్తు అని అర్థం. ఇది విష్ణువుకు అంకితమైన కాలమని, భావిస్తారు, అందుకే  విష్ణువు ,శ్రీకృష్ణుడిని పూజిస్తారు.ఈ పండుగకు విష్ణు దేవాలయాలన్నీ భక్తులతో కళకళలాడుతాయి. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్బంగా భక్తులకు 'విషు కంజి' లేదా గంజిని  ప్రసాదంగా అందిస్తారు. ఇందులో పాపడ్, ఊరగాయ, యాలుక, పచ్చి అరటి,బూడిద గుమ్మడికాయతో చేసిన 'అస్త్రం' అనేది ఉంటుంది. ఇంకా విషు ప్రసాదాల్లో  'కైనీట్టం' ముఖ్యం.

విషు అంటే పునరుద్ధరణ, ఆశకు చిహ్నం కూడా. పండుగ ముందురోజు రాత్రి ఇంట్లోని మహిళల్లో పెద్దవయస్కురాలు పచ్చి బియ్యం, కొత్తబట్టలు, బంగారు-పసుపు వన్నెలో ఉండే దోసకాయలు, అరటిపళ్లు, తమలపాకులు, అద్దం వీటన్నిటినీ ‘విషుకణి’ అనే ప్రత్యేక పాత్రలో ఉంచి దైవపూజ నిర్వహిస్తుంది. మర్నాడు ఆమె ముందుగాలేచి వయసుల వారీగా ఇంట్లో అందరినీ నిద్రలేపి, వారి కళ్లు మూసి  విష్ణువు ఫోటోలు పువ్వులు, పండ్లు , కూరగాయలు, బట్టలు, బంగారు నాణేలు, దీపంతో నిండిన పాత్ర దగ్గరకు తీసుకొచ్చి అప్పుడు కళ్లు తెరవమంటుంది. ఉదయాన్నే లేవగానే మంగళకరమైన విషుకణిని చూస్తే అంతా శుభమే జరుగుతుందని వారి నమ్మకం. ఈ విష్ణుకణిని  శ్రేయస్సు , అదృష్టానికి ప్రతీకగా విశ్వసిస్తారు.

సాద్య ప్రత్యేకతే వేరే
విషు కైనెట్టం : పెద్దలు చిన్న కుటుంబ సభ్యులకు సౌభాగ్యం, సౌభాగ్యం కోసం ఆశీర్వచనాలుగా డబ్బు ఇస్తారు.

విషు  సాద్య : సాద్య అంటే అవియల్, తోరన్, రసం, పాయసం వంటి 20–30 వంటకాలను వడ్డించే గొప్ప శాఖాహార విందు. అరటి ఆకులపై  వీటిని వడ్డించే శాఖాహార విందే  ఈ పండుగ ప్రత్యేకత. ఇందులో మాంబళ పులిసేరి (మామిడి కూర) వంటి వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి.

బాణాసంచా: బాణసంచా కాల్చడం ఒక ప్రసిద్ధ సంప్రదాయం, ఇది వేడుకలకు ఆనందాన్ని మరియు ఉత్సాహాన్ని జోడిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉట్టికొట్టే సంప్రదాయం కూడా ఉంది. 

సంప్రదాయ వస్త్రధారణ: ప్రజలు కొత్త దుస్తులు ధరించి ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. మళయాళీల చీరకట్టు, పువ్వులకు వారిచ్చే ప్రాధాన్యత  చాలా గొప్పగా ఉంటుంది. 

ప్రేమానుబంధం:  తెలుగువారు ఉగాదిని ఎలా జరుపుకుంటారో అలాగే మళయాళీలు విషును బంధుమిత్ర సపరివార సమేతంగా జరుపుకుంటారు.చిన్నవారికి కానుకలిచ్చి సంబరపడతారు.

సాంస్కృతిక వైవిధ్యం: పంజాబ్ లో బైసాఖి, తమిళనాడులో పుత్తాండు వంటి పండుగలను ఒకే సమయంలో జరుపుకుంటారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)