Breaking News

బట్టల మిషనా? బంగాళదుంపల మిషనా? వైరల్‌ వీడియో

Published on Fri, 04/18/2025 - 13:06

వంట చేయడం కంటే.. ప్రిపరేషన్‌కే ఎక్కువ టైం  పడుతుంది. కూర వండాలంటే..చిక్కుడు  కాయలు, బీన్స్‌ గిల్లడం, దొండకాయలు, బెండకాయలు కట్‌ చేయడం అబ్బో పెద్దపనే కదా. అలాగే బంగాళాదుంపలను తొక్క తీసి శుభ్రం చేయడం  అంటే అదో  పెద్ద పని. కానీ ప్రస్తుతం  వైరల్‌ అవుతున్న  వీడియోలో కనిపించిన మహిళ కేవలం రెండు నిమిషాల్లో వాషింగ్ మెషిన్ సహాయంతో బంగాళాదుంపలు తోలు తీయడం అందర్నీ ఆకర్షించింది.

‘ఆమె వాషింగ్‌ మెషిన్‌ దగ్గరకు వెళ్లింది. ఆ తరువాత ఏం చేస్తుంది?’ అనే ప్రశ్నకు ఎవరైనా ఇచ్చే జవాబు....
‘బట్టలను వాషింగ్‌ మెషిన్‌లో వేస్తుంది’ అయితే సదరు మహిళ మాత్రం బట్టలను కాదు బంగాళదుంపలను వేసింది. మన ఆశ్చర్యాన్ని మరింత పెంచేలా మెషిన్‌ ఆన్‌ చేసింది. ఆ తరువాత ఏమిటి అనే విషయానికి వస్తే..... తొక్క రహిత బంగాళదుంపలు కనిపించాయి! వైరల్‌ అవుతున్న ఈ వీడియోను చూసి ‘భేష్‌’ అని కొందరు కితాబు ఇవ్వగా చాలామంది మాత్రం ‘ఇది సరికాదు’ అని విమర్శించారు. మరికొందరు ‘ఇది ఫేక్‌ వీడియో’ అన్నారు.   

ఎండలను చల్లపుచ్చండి వేసవిలో ఎదురయ్యే సమస్యలలో డీ హైడ్రేషన్‌ ఒకటి. డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా పుచ్చకాయ తింటే మంచిది.

 

 పుచ్చకాయతో లాభాలు

  • నీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయ ఒంట్లోని టాక్సిన్స్‌ను తొలగిస్తుంది
  • నీరసం, నిస్సత్తువ లేకుండా చేస్తుంది. 
  • చెమట రూపంలో కోల్పోయిన నీరు భర్తీ అవుతుంది. 
  • పుచ్చలో అమైనో ఆమ్లం ‘సిట్రులిన్‌’ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది.
  • ఎండలో కమిలిన చర్మానికి పుచ్చ
  • పండు గుజ్జు రాస్తే మంచిది. 
  • ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. 
  • మలబద్ధకం లేకుండా చేస్తుంది.
  • కండరాల నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.  
  • ఎముకలను దృఢంగా ఉంచుతుంది.
  • పుచ్చకాయలో ఎక్కువగా ఉండే ఎ విటమిన్‌ కంటిచూపును మెరుగుపరుస్తుంది.
     

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)