Breaking News

అక్కడ నది హఠాత్తుగా నెత్తుటి రంగులో ప్రవహిస్తోంది!

Published on Fri, 12/29/2023 - 17:32

ఎక్కడైన నదిలో నీళ్లు తెల్లగానే ఉంటాయి. కానీ ఇక్కడ నదిలో నీళ్లు మాత్రం ఎర్రటి నెత్తురులా మారిపోయాయి. చెప్పాలంటే రక్తంలా ప్రవహిస్తున్నాయి నీళ్‌లు. ఇలా ఎందుకు జరిగిందో అని  స్థానికలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన దక్షిణ రష్యాలో చోటు చేసుకుంది. ఇలా జరగడానకి కారణం ఏంటన్నది అక్కడి అధికారులకు అంతు చిక్కని మిస్టరీలా ఉంది. 

వివరాల్లోకెళ్తే..దక్షిణ రష్యాలోని కెమెరోవోలోని ఇస్కిటిమ్కా నది  సడెన్‌గా ఎరుపు రంగులో ప్రవహిస్తోంది. ఒకప్పుడూ చక్కగా ప్రవహించే నది ఇలా రక్తపు నదిలా ఎలా మారిందనేది తెలియక స్థానికులు ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడూ ఈ ఘటనే సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా ఈ ఘటన నీటి కాలుష్యం గురించి తక్షణమే తీసుకోవాల్సిన చర్యల ఆవశక్యతను తెలియజేసింది. అంతేగాదు బాతులు వంటి చిన్న జంతువులు ఏవీ ఆ నీటిలోకి వెళ్లేందుకు ఇష్టపడలేదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

ఈ ఘటనపై పర్యావరణ అధికారులు సైతం భయాందోళనలు వ్యక్తం చేశారు. కాలుష్యం కారణంగానే ఇలా జరిగిందేమో! అని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అయితే ఆ నగర డిప్యూటీ గవర్నర్‌ ఆండ్రీ పనోవ్‌ డ్రైనేజీ లీక్‌ కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే అక్కడ నది ఇలా సడెన్‌గా రంగు మారడానికి కచ్చితమై కారణం ఏంటన్నది రసాయన పరీక్ష ద్వారా తెలియాల్సి ఉంది. కాగా, ఇలాంటి ఘటనే సరిగ్గా జూన్‌ 2020లో ఉత్తర సైబీరియాలో నోరిల్స్క్‌ సమీపంలోని పవర్‌ స్టేషన్‌లో డీజిల్‌ రిజర్వాయర్‌ కూలిపోవడంతో ఇలాంటి ఘటన జరిగింది.

దీని కారణంగా అనేక ఆర్కిటిక్‌ నదులన్నీ ఎర్రగా మారి ఇలాంటి దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన కారణంగా దాదాపు 15 వేల టన్నుల ఇంధనం నదిలోకి పోగా, ఆరు వేల టన్నులు మట్టిలోకి ఇంకిపోయింది. ఆ టైంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ అత్యవసర పరిస్థితిని కూడాప్రకటించారు. మళ్లీ ఇదే తరహాలో రష్యాలోని మరో నగరంలో చోటు చేసుకోవడం గమనార్హం. ఇలాంటి ఘటనలు పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడం, జలవనరులను కాలుష్య కోరల నుంచి కాపాడు కోవాల్సిన ప్రాముఖ్యతలను గూర్చి నొక్కి చెబుతున్నాయని అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. మానవ తప్పిదాలు, పారిశ్రామిక కార్యకలాపాలు పర్యావరణానికి ఎలా నష్టం కలిగిస్తున్నాయో ఇప్పటికైనా గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందేనని, లేదంటే మానవళికి ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. 

(చదవండి: తినే గమ్‌(గోండ్‌) గురించి తెలుసా? బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు..)

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)