Breaking News

యోయో హనీ సింగ్ కచేరీలో అనుకోని అతిథి స్టెప్పులు, వీడియో వైరల్‌

Published on Mon, 04/07/2025 - 13:19

రాపర్ , గాయకుడు యో యో హనీ సింగ్  సంగీతాభిమానులకు పరిచయం అవసరంలేదు.అంతర్జాతీయంగా గత  పదిహేనేళ్లుగా పాప్‌ సంగీతాన్ని ఏలుతున్న ఘనత అతగాడి  సొంతం. ఇటీవల హనీ సింగ్‌ భారత పర్యటన సందర్భంగా ఒక విశేషం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

హనీ సింగ్‌ భారత పర్యటనలో భాగంగా కోల్‌కతాలొ (ఏప్రిల్ 4) మ్యూజిక్‌ కన్‌సర్ట్‌ ఏర్పాటైంది. అతని సంగీత ఝరిలో ప్రేక్షకులంతా  ఓలలాడుతున్నారు.  ఈ  కచేరీ సందర్భంగా వేదికపై ఉన్న యో యో హనీ సింగ్‌ను కలవడానికి ఒక వృద్ధుడు దూసుకొచ్చాడు. భారీగా గుమిగూడిన జనాల మధ్యనుంచి ,బారికేడ్‌ను  దూకి మరీ వృద్ధుడి ముందుకొచ్చాడు. నెత్తిన తలపాకాగాతో ఆ పెద్దాయన (సింగ్‌) రావడాన్ని చూసి హనీ సింగ్‌ ఆయను వేదికమీదకు ఆహ్వనించాడు. అంతే.. వేదికమీదకు రాగానే సూపర్‌గా స్టెప్పులేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హనీసింగ్ హిట్ ట్రాక్ డోప్ షోప్‌కు  హుషారుగా నృత్యం చేశాడు. దీంతో అక్కడున్నవారంతా  ఉ‍త్సాహంతో ఊగిపోయారు.

 

హనీ సింగ్‌ స్వయంగా ఈ  చిన్న క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. " మై ఫరెవర్‌ యంగ్‌ ఫ్యాన్స్‌" అంటూ పోస్ట్‌  చేయడం హైలైట్‌ అయింది.

 

జస్‌ప్రీత్‌ పనేసర్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో మొత్తం వీడియోను షేర్‌ చేయడంతో  బారికేడ్‌ను దాటి సింగ్‌ను  కంటెంట్ సృష్టికర్త జస్‌ప్రీత్‌ తండ్రి అని తేలింది. "కోల్‌కతాలో హనీ సింగ్ కచేరీలో నాన్నకు ఒక అద్భుతమైన క్షణం" అంటూ ఈ జస్‌ప్రీత్‌ వీడియోలో చెప్పారు. "నాకు హనీ సింగ్ అంటే చాలా ఇష్టం. పదేళ్ల వయస్సు నుండి అతని పాటలు వింటున్నాను.  నా తండ్రి ఈ రోజు అతనితో వేదికపై  డ్యాన్స్‌ చేశాడు. చెప్పలేనంత ఆనందంగా ఉంది" అంటూ పేర్కొన్నాడు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)