58 ఏళ్ల నాటి తాతగారి బెంజ్‌కారు..! ఇప్పటికీ..

Published on Mon, 07/21/2025 - 12:17

ఓల్డ్ ఈజ్‌ గోల్డ్‌ అన్న నానుడి జగమెరిగిన సత్యం. ఎప్పటికీ పాతకాలం నాటి డిజైన్‌లు, నాటి వస్తువులు అపురూపమే. ఎంతటి ఆధునిక సాంకేతిక హంగులతో వచ్చినా..ఏళ్ల నాటి వస్తువులే అదరహో అన్న రేంజ్‌లో ఉంటాయి. వాటి పనితీరు కూడా వాహ్‌ అని మెచ్చుకునేలా ఉంటుంది. అలాంటి పాతకాలం నాటి మెర్సిడెస్‌ బెంజ్‌ కారుకి సంబంధించిన వీడియో నెట్టింట పెను దుమారం రేపుతోంది. దాని రూపురేఖలు, పనితీరు చూసి ఫిదా అవ్వాల్సిందే. అంతలా చెక్‌ చెదరకుండా ఉంది ఆ బెంజ్‌ కారు.

ఇషాన్ బల్లాల్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ 58 ఏళ్ల క్రితం నాటి ఓల్డ్‌ బెంజ్‌ కారు వీడియోని నెట్టింట షేర్‌ చేశారు. ఆ కారు 1967 నాటిది. తన తాతగారు ఉపయోగించేవారని చెప్పుకొచ్చాడు వీడియోలో. ఆయన ఆ కారు డ్రైవింగ్‌ సీటులో కూర్చొని కబుర్లు చెబుతూ తనను టూర్లకు తీసుకువెళ్లేవారని నాటి స్మృతులను గుర్తు చేసుకున్నాడు. 

మంగళూరు నుంచి చెన్నే వెళ్తూ ఆయన నాకు చెప్పే పలు కథలు ఆ బెంజ్‌ కారుని చూడగానే గుర్తుకొస్తాయని చెబుతున్నాడు ఇషాన్‌. తాను డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందినా కూడా డ్రైవర్‌ పర్యవేక్షణ లేకండా ఆ బెంజ్‌ కారుని  నడపలేదని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే కాస్త తప్పుగా నడిపినా..ఆ కారు పాడవ్వుతుందన్న ఉద్దేశ్యంతో తాను పూర్తిస్థాయిలో నడపగలిగిన అనుభవం వచ్చాక నడిపానని అన్నాడు. 

తన దివంగత తాతాగారి కారుని తాను ఎలా భద్రంగా చూసుకున్నాడో వివరించాడు. అందువల్లే ఆ 58 ఏళ్ల నాటి బెంజ్‌ కారు ఇప్పటికీ మంచి కండిషన్‌లో పనిచేస్తుందని చెబుతున్నాడు ఇషాన్‌. నెటిజన్లు కూడా ఆ వీడియోని చూసి...మీ తాత గారు ఆ కారుని ఎంత అపురూపంగా చూసుకున్నారో స్పష్టమవుతుంది. బహుశా ఆ తీరే వంశపారంపర్యంగా మీకు వచ్చిందేమో. తాతాగారు ఎంత మంచి వారసత్వాన్ని మీకందించారంటూ ఇషాన్‌పై పొగడ్తల జల్లు కురిపించారు. 

(చదవండి: జస్ట్ పెంపుడు కుక్కల సంరక్షణతో.. నెలకు ఏకంగా రూ. 4 లక్షలు పైనే..)

 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)