Breaking News

రూ. 200ల కూపన్‌తో..రూ. 50 లక్షల టయోటా ఫార్చ్యూన్‌ కారు!

Published on Wed, 10/28/2026 - 17:58

ఒక్కోసారి అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఆ కుటుంబం ఎన్నాళ్ల నుంచో కారు కొనుక్కోవాలనుకుంటే..లక్కీ డ్రా రూపంలో బహుమతిగా కారే ఇంటికి వచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది. 

ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌ బుర్హాన్‌పూర్‌కుకు చెందిన ఆరేళ్ల మేదాన్ష్ రైక్వార్ అనే బాలుడు ఒక గర్భా కార్యక్రమంలో అమ్మమ్మ కొనిచ్చిన రూ. 200 లక్కీ డ్రా కూపన్‌ ద్వారా ఏకంగా రూ. 50 లక్షలు విలువ చేసే టయోటా ఫార్చ్యూనర్‌ కారుని గెలుచుకున్నాడు. గత రెండేళ్లుగా ఆ చిన్నారి కుటుంబం కారు కొనాలని చూస్తోంది. ఇంతలో అమ్మమ్మ ఆ చిన్నారి పేరు మీద కొనిచ్చిన లక్కీ డ్రా కూపన్‌ కారణంగా ఆశ్చర్యకరమైన రీతీలో కల నెరవేరిపోయింది. 

అసలు తమ బిడ్డ మేదాన్ష్‌ కారు గెలుచుకున్నాడా..! అని  అతడి కుటంబం మొత్త సంతోషంతో మునిగితేలుతోంది. ఆ చిన్నారి అభపురిలోని 'శ్రీ సర్కార్ ధామ్'లో నిర్వహించిన లక్కీ డ్రాలో ఈ బహుమతిని గెలుచుకున్నాడు. అతడి అమ్మమ్మ కిరణ్‌ రైక్వార్‌ సుమారు ఏడాది క్రితం ఈ కూపన్‌ని కొనుగోలు చేసి, దాన్ని మేదాన్ష్‌ పేరుతో నమోదు చేసిందామె. ఈ విషయం తెలిసి బంధువులు, స్థానికులు తరలి వచ్చి ఆ చిన్నారి మేదాన్ష్‌కు ఘనస్వాగతం పలికారు. 

అంతేగాదు గెలుచుకున్న ఫార్చ్యూనర్‌ కారుని పెద్దఎత్తున ఊరేగింపుగా తీసుకొచ్చారు. అందుకు సంబధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా కేవలం రూ. 200ల పెట్టుబడితో రూ. 50 లక్షలు విలువ చేసే కారు గెలుచుకోవడం మాములు విషయం కాదు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.  

ఇదీ చదవండి: అరుదైన వ్యాధి, నాల్గో ఏడాదికి మించి బతికే ఛాన్సేలేదన్నారు! కట్‌చేస్తే..
 

#

Tags : 1

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)