Breaking News

ఓర్నీ ఇదేంటిది..! అత్తారింటికి నవవధువే డ్రైవ్‌ చేసుకుంటూ..

Published on Thu, 12/11/2025 - 15:27

పెళ్లిలో జరిగే ప్రతి తంతు అపురూపమైన క్షణం. ఆ వివాహ ఘట్టం అంత తేలిగ్గా మర్చిపోలేని మధురానుభూతులు. బహుశా ఆ ఉద్దేశ్యంతోనే ఆ వధువు ఇలా చేసిందో ఏమో గానీ వరుడుకి నోట మాట లేకుండా చేసింది. అప్పుడే తనకు నచ్చినట్లుగానే అంతా చేయాల్సిందేనా అన్నట్లుగా నవ్వుతూ కళ్లప్పగించి చూశాడు. 

అసలేం జరిగిందంటే..ఈ వింత ఘటన లూధియానాలోని థార్‌లో చోటుచేసుకుంది. పెళ్లి తంతు అయిపోయింది. ఆ తర్వాత అప్పగింతలు వేళ వధువుని తీసుకొచ్చి తల్లిదండ్రులు కారు వెనకాల కూర్చొబెట్టి సాగనంపుతారు కామన్‌. పైగా వరుడు పెళ్లికొడుకు కాబట్టి అతన కూడా కారు డ్రైవ్‌ చేయడు. ఇది వివాహంలో సర్వసాధారణం. 

కానీ ఈమె మాత్రం తన అత్తారింటికి భర్తతో కలిసి తనే స్వయంగా కారు నడిపుతూ వెళ్లాలనకుందట. ఆ విషయం ముందే కాబోయే వరుడుకి చెప్పడంతో అతను కూడా సమ్మతించాడు. అంతేకాదు అక్కడ పెళ్లి మండపం వద్ద ఉన్న బంధువులు, సన్నిహితులు విస్తుపోయేలా నవవధువుని పెళ్లికొడుకే ఎత్తుకుని ఎస్‌యూవీ కారు వద్దకు తీసుకురాగ, ఆమె డ్రైవర్‌ సీటులో దర్జాగా కూర్చొంది. 

ప్యాసింజర్‌ సీటులో వరుడు కూర్చొని మనం ఇంటికి సురక్షితంగా చేరుకోవాలి అని ఆమెకు నవ్వుతూ చెబుతున్నాడు. అంతేగాదు వరుడు దేవుడా మమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకువెళ్లు అని ప్రార్థించాడు కూడా. అందుకు సంబంధించిన ఫన్నీ వీడియో నెట్టింట వైరల్‌గా అవుతోంది. 

 

(చదవండి: 50 ఏళ్ల సహోద్యోగి అలా ప్రవర్తిస్తే ఏం చేయాలి..!)

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)