Breaking News

గడ్డకట్టే చలిలో వేడి వేడి పూరీ, ఛోలే...ఎక్కడ?

Published on Fri, 08/08/2025 - 17:04

అంటార్కిటికా(Antarctica) లోని భారత పరిశోధనా కేంద్రంలో ఉత్తర భారత దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన ఒక ప్రసిద్ధ వంటకాన్ని వడ్డించడం విశేషంగా నిలిచింది. అంటార్కిటికాలోని భారత పరిశోధనా కేంద్రంలో పనిచేస్తున్న ఒక వైద్యుడు, దక్షిణ ధృవం వద్ద తన జీవితం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచు కున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సందడిగామారింది.

అంటార్కిటికాలోని ఘనీభవించిన ప్రకృతి దృశ్యాలే కాదు, ఇంట్లో వడ్డించినట్టుగా  వేడి వేడి పూరీ చోలే కూరను బ్రేక్‌ఫాస్ట్‌గా వడ్డిస్తుందట.

"> డా. రాహుల్‌ జైన్‌ తన ఇన్‌స్టాలో షేర్‌ చేసిన వీడియోలో  మైత్రి సెంటర్‌లో పూరీలు ఛోలే కర్రీని చూపించారు. ఒక వ్యక్తి తాజా పూరీలు తయారు చేస్తున్నట్లు కనిపించింది. "బయటేమో30 డిగ్రీల సెల్సియస్, చల్లగాలులు మరి లోపల వైబ్స్? వేడి వేడి పూరీ, ఛోలే విత్‌ చాయ్‌.. నోస్టాల్జియా. ఘనీభవించిన రోజును రుచికరమైన జ్ఞాపకంగా మార్చినందుకు మా మాస్టర్ చెఫ్‌కు ధన్యవాదాలు.  రుచిని మించింది మంచి ఆహారం..ఈ వెచ్చదనం మన సొంత ఇల్లు లాంటిది"అంటూ రాసుకొచ్చారు.  దీనిపై నెటిజన్లు కూడా ఆనందంగా స్పందించారు.

ఆ మంచు ప్రదేశంలో వేడి వేడి పూరీ ఛోలే సూపర్‌ అని కొందరు, అంటార్కిటికాలోని చోలే పూరి నా ఆత్మను నా శరీరాన్ని విడిచిపెట్టడానికి అనుమతిస్తుంది. మీరు దానితో ఒక కప్పు గరం..గరం.. అద్రక్ చాయ్ తాగారా సార్?" అని మరొకరు,"జీవితంలో ఏదో ఒక సమయంలో అంటార్కిటికాలోఛోలే పూరి తినేలాగా ఏదో ఒకటి చేయాలి" అని ఒక నెటిజన్‌ కామెంట్‌ చేశారు. "ఇది 'విద్యాపరమైన నైపుణ్యం' మాత్రమే భరించగల ధనవంతుల స్థాయి’ అని మరో కామెంట్‌ కూడా వచ్చింది.

భారతదేశం అంటార్కిటికాలో "మైత్రి","భారతి" అనే రెండు పరిశోధనా కేంద్రాలున్నాయి. ఇక్కడ పరిశోధకులు, సిబ్బందికి సాంప్రదాయ భారతీయ వంటకాలు అందిస్తారు. పూరీలోకి కూరగా మసాలా శనగలు (ఛోలే) కూరను  వడ్డిస్తారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)