Breaking News

నడవలేనంత అనారోగ్య సమస్యలతో వినోద్‌ కాంబ్లీ: ఆ వ్యాధే కారణమా..?

Published on Mon, 12/09/2024 - 13:08

ఒకప్పుడు మైదానంలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన స్టార్‌ ఆటగాడు, భారత మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాడు. ఒకప్పుడు  మంచి ఫిటెనెస్‌తో చలాకీగా ఉండే కాంబ్లీ పలు అనారోగ్య సమస్యలతో నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. దిగ్గజ క్రికెట్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్‌తో కలిసి కాంబ్లీ కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమం కారణంగానే కాంబ్లీ పరిస్థితి గురించి ప్రపంచానికి తెలిసింది. అతడి స్థితిని చూసి అభిమానులంతా కాంబ్లీకి ఏమైందంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా కాంబ్లీ తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడటానికి దారితీసిన కారణాలు, అలాగే ఒకప్పుడు ఫిట్‌గా ఉండే వ్యక్తిని డిప్రెషన్‌ ఇంతలా కుంగదీసి అనారోగ్యం పాలు చేస్తుందా అంటే..

వినోద్‌ కాంబ్లీ ఇలా తీవ్రమైన అనారోగ్య స్థితిలో కనిపించటం తొలిసారి కాదు. గతంలో కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అనేక సందర్భాలు ఉన్నాయి.  2013లో ముంబైలో డ్రైవింగ్‌ చేస్తుండగా గుండెపోటుకి గురయ్యాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు కోలుకున్నాడు. ఆయన 2012లో రెండు ధమనులలో అడ్డంకులను తొలగించుకునేందుకు యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. ఆ తర్వాత నుంచి పూర్తిగా కోలుకోలేదని కాంబ్లీ అంతరంగికులు చెబుతున్నారు. 

ఎందుకంటే..
ఒక్కసారి గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స లేదా కొద్దిపాటి వేరే చికిత్సలు తీసుకున్నప్పుడు సమతుల్యమైన జీవనశైలిని పాటించక తప్పదు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. పలు అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. 

డిప్రెషన్‌..
దీనికి తోడు కాంబ్లీ తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు పలు ఇంటర్వూల్లో వెల్లడించారు. సచిన్‌ సచిన్‌ స్థాయికి చేరుకోగల సత్తా ఉన్నా చేజేతులా కెరీర్‌ నాశనం చేసుకున్నట్లు కాంబ్లీ సన్నిహిత వర్గాలు చెబుతుంటారు. కెరీర్ ఫెయిల్యూర్ తదితర కారణాలతో తీవ్ర డిప్రెషన్‌కు వెళ్లాడు. దీంతో వినోద్ కాంబ్లీ మద్యానికి బానిసైనట్లు తెలుస్తుంది.  తాగుడు మానేయాలని చాలాసార్లు ప్రయత్నించాడని, అందుకోసం డీ అడిక్షన్ సెంటర్ నుంచి ట్రీట్‌మెంట్ కూడా తీసుకున్నట్లు సమాచారం.  ఆ తర్వాత కూడా ఆయన మద్యం తాగడం మానలేదని తెలుస్తుంది. ఇక్కడ డిప్రెషన్‌ ఎంతటి ఫిట్‌నెస్‌తో ఉన్న వ్యక్తిని అయినా అమాంతం కుంగదీసీ చేతకాని వాడిలా కూర్చొబెట్టేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. 

అలాగే మద్యం అడిక్షన్‌..
ఇది కూడా మనిషిని పదిమంది ముందు సగౌరవంగా బతకనివ్వకుండా చేసే అతి భయనాక మహమ్మారి. దీని ముందు ఎంతటి మహమహులైనా.. నిలవలేరు. దీనికి బానిసై జీవితాలని నాశనం చేసుకున్న వారెందరో ఉన్నారు. ఇక్కడ కాంబ్లీ పరిస్థితి కూడా ఇదే. ఇక్కడ కాంబ్లీ పూర్తిగా కోలుకుని ఆరోగ్యంతో ఉండాలని దాదాపు 14సార్లు పునరావాస కేంద్రానికి తీసుకువెళ్లినట్లు అతడి స్నేహితుడు అంపైర్ కుటో తెలిపారు. అంటే కాంబ్లీ ఎంతటి పరిస్థితిలో ఉన్నాడో స్పష్టమవుతోంది. 

ఇక్కడ ఏ మనిషి అయినా తనకు తాను బాగుండాలని గట్టిగా అనుకుంటేనే.. ఎవ్వరూ సాయం అందించినా సఫలం అవుతుంది.  సగం ఆరోగ్యం నయమవ్వడానికి ఆయా వ్యక్తుల సంకల్ప బలమే ఆధారం. కాబట్టి ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదురయ్యే ఉద్దాన పతనాలకు ప్రాధాన్యత ఇవ్వొద్దు. దేన్నైనా సమంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను అలవరుచుకోండి. 

"దేన్ని కోల్పోయినా, మనిషి గమ్యం ఆగకూడదనేది గుర్తించుకుండి. కడ వరకు పూర్తి ఆరోగ్యంతో ఒకరి ఆసరా లేకుండా జీవనం సాగించడమే అత్యంత అదృష్టమని భావించండి. ఇలాంటి దృకప్పథం అలవాటు చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యల బారినపడరు". అని చెబుతున్నారు మానసిక నిపుణులు. 

 

 

 

 

Videos

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)