Breaking News

వాతాపి గణపతి.. ఈ పేరు ఇలా వచ్చింది!

Published on Wed, 08/27/2025 - 10:21

‘వాతాపి గణపతిం భజే...’ అన్న కర్ణాటక సంగీత కీర్తనను విని ఉండనివారూ, ఎరగని వారూ ఆస్తిక సమాజంలో అరుదు. వాతాపి ఒక ఊరు. దీన్నే ‘బాదామి’ అని కూడా అంటారు. ప్రస్తుతం ఇది కర్ణాటక రాష్ట్రంలో ఒక చిన్న తాలూకా కేంద్రం. కానీ ఒకప్పుడు ఈ బాదామి, పశ్చిమ చాళుక్య రాజుల రాజధానిగా, కళలకు కాణాచిగా ఉండేది. క్రీ.శ. 642లో జరిగిన ‘బాదామి యుద్ధం’లో పల్లవ రాజులు, బాదామి చాళుక్యుల మీద విజయం సాధించారు. పరంజ్యోతి అనే పల్లవ సేనాధిపతి, తమ ఘన విజయానికి జ్ఞాపికగా కాబోలు, వాతాపి నుండి ఒక గణపతి విగ్రహాన్ని తమిళనాటకు తీసుకెళ్ళి, తన స్వస్థలమైన తిరుచెంగట్టన్‌ గూడిలో ఉన్న శివాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠ చేయించాడు. అది ఈనాటికీ ‘వాతాపి గణపతి’గా పూజలందుకొంటున్నది. వాతాపి రాక్షసుడిని వధించిన తరవాత అగస్త్య మహర్షి పూజించిన గణపతి, వాతాపి గణపతిగా ప్రసిద్ధుడయ్యాడని ఒక ఐతిహ్యం.

కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల (1775–1835) స్వగ్రామం తిరువారూరు. అది తిరుచెంగట్టన్‌ గూడి గ్రామానికి చాలా దగ్గర. వినాయకుడి మీద మొత్తం పదహారు కీర్తనలను రచించిన దీక్షితుల వారు, వాతాపి గణపతిని స్తుతిస్తూ చెప్పిన హంసధ్వని రాగకృతి, గణపతి తత్త్వాన్ని సమగ్రంగా ఆవిష్కరించే మణిపూస. ఇది వాతాపి గణపతికీ, దీక్షితుల వారికీ, హంసధ్వని రాగానికీ అఖండమైన ప్రఖ్యాతిని ఆర్జించిపెట్టింది. ఇన్నేళ్ళలో, ఇంతమంది ఇన్నిసార్లు పాడి, వినిపించిన కృతి, కర్ణాటక సంగీత ‘కచేరీ’ల చరిత్రలో మరొకటి లేదు.

ఇదీ చదవండి: Vinayaka Chavithi: వినాయక చవితి పూజ ప్రాముఖ్యత,అష్టోత్తర శతనామావళి

వారణాస్యుడైన గణపతిని వరప్రదాతగా, భూతాది సంసేవితుడిగా, భూత భౌతిక ప్రపంచ భర్తగా, వీతరాగుడిగా, విశ్వకారణుడిగా, విఘ్నవారణుడిగా ఈ కృతి నుతి చేస్తుంది. శ్రీ చక్ర త్రికోణ గతుడిగా, మూలాధార క్షేత్ర స్థితుడిగా, ఓంకార రూపమైన వక్రతుండ ధారిగా అభివర్ణిస్తుంది. వీనుల విందుగా వినాయకుడిని కొనియాడే ఈ కీర్తనను వినటానికీ, పాడుకోవటానికీ, మననం చేసుకోవటానికీ వినాయక చతుర్థి అనువైన సుదినం!

ఇదీ చదవండి: గణపతి బప్పా 'మోరియా' వెనుక కథలేంటో తెలుసా?
– ఎం. మారుతి శాస్త్రి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)