Breaking News

భక్తులకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రసాదం మాత్రమే : కర్ణాటక నిర్ణయంపై వివాదం

Published on Fri, 09/06/2024 - 15:25

కర్ణాటక ప్రభుత్వం  భక్తులకు నాణ్యమైన 'ప్రసాదం' అందించాలని  లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. గణేష్  మండపాల వద్ద   'ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ-ధృవీకరించిన   ప్రసాదాలను మాత్రమే పంపిణీ చేయాలని ఆదేశించింది.  ఈ మేరకు ఆగస్టు 31న ఆదేశాలు జారీ చేసింది. దీంతో సరికొత్త  దుమారం రేగింది. కర్నాటక ప్రభుత్వ నిర్ణయం హిందూ వ్యతిరేక నిర్ణయమని బీజేపీ అభివర్ణించింది. అయితే, గణేష్ చతుర్థి పండుగ సీజన్‌లో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. 

గణేష​ ఉత్సవ నిర్వాహకులకు జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సర్టిఫికేట్ పొందిన వారిని మాత్రమే గణేష్‌ పందిళ్లలో ప్రసాదం తయారు చేయడానికి అనుమతిస్తారు. పందిళ్లలోఅందించే ప్రసాదానికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ధృవీకరణ తప్పనిసరి అని బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP)కి రాసిన లేఖలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది. అంతేకాదు అనుమతి లేకుండా ప్రసాదం పంపిణీ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ హెచ్చరించింది.

 అనుమతులు తప్పనిసరి
బెంగళూరులోని గణేశ మంటప నిర్వాహకులు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ధృవీకరణతో పాటు, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు పోలీసు, నగర పాలక సంస్థ, విద్యుత్‌ లాంటి స్థానిక అధికారుల అనుమతులను పొందాలి. నిర్వాహకులు పాండల్స్ కోసం కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన నిర్దిష్ట పర్యావరణ నిబంధనలను కూడా పాటించాలి. తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు, అగ్నిమాపక యంత్రాలు, అత్యవసర భద్రతా చర్యల్లో భాగంగా వేదిక వద్ద అత్యవసర సంప్రదింపు నంబర్‌లను ప్రదర్శించాలి.

మరోవైపుగణేష్ చతుర్థి ఉత్సవాలకు అనుమతిస్తూ కర్నాటక హైకోర్టు, అధికారుల నిర్ణయాన్ని సమర్థించడంతో బుధవారం హుబ్బళ్లి-ధార్వాడ్‌లోని ఈద్గా మైదాన్‌లో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)