Breaking News

లాస్ ఏంజెల్స్‌ కార్చిచ్చు : చిక్కుల్లో మాల్యా కొడుకు-కోడలు, అప్‌డేట్‌ ఇదే!

Published on Fri, 01/10/2025 - 16:12

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో చెలరేగిన మంటలు బీభత్సాన్ని సృష్టించాయి.  ఈ దావానలంలో చిక్కుకుని ఇప్పటి వరకూ ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. 30వేల మందికిపైగా నిరాశ్రయులు కావడం ఆందోళన రేపుతోంది.

పాలిసాడ్స్ అగ్నిప్రమాదం మాలిబు, శాంటా మోనికా మధ్య సముద్రతీర ప్రాంతాన్నిదహించివేస్తోంది. సీఎన్‌ఎన్‌ నివేదిక ప్రకారం, మంటలు 17 వేల ఎకరాలకు పైగా వ్యాపించాయి. వీటిని అదుపు చేసే ఆశలు కనిపించడంలేదు.  ఇప్పటివరకు ఇదే అత్యంత వినాశకరమైన అగ్నిప్రమాదంగా భావిస్తున్నారు. ఒకేరోజు మూడు ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగడంపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

ఈ  నేపథ్యంలో హాలీవుడ్ సెలబ్రిటీలు సహా చాలా మంది సంపన్నుల నివాసాలు మంటల్లో చిక్కుకున్నాయి. వీరిలో చాలామంది  తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఇళ్లను వీడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మనీ లాండరింగ్‌ ఆరోపణలతో విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా,అతని భార్య జాస్మిన్ లాస్ ఏంజిల్స్‌లో ఇరుక్కున్న్టటు వార్తలొచ్చాయి.  దీనిపై స్వయంగా సిద్దార్థ స్పందించాడు. ప్రస్తుతానికి తాను, తన భార్య జాస్మిన్,  పెట్స్‌ సురక్షితంగా ఉన్నామని తెలిపాడు.  అంతే కాదు, సహాయం కావాల్సిన వారు, దయ చేసి తమను సంప్రదించాల్సిందిగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కోరాడు. సహాయం అలాగే అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. అటు  జాస్మిన్ కూడా తన వంతుగా, విపత్తులో ప్రభావితమైన వారికి సహాయ సామగ్రి గురించి సమాచారాన్ని కూడా ఇచ్చింది.  (బెంచింగ్‌ డేటింగ్‌ గురించి తెలుసా, ఇలా అయితే డేంజరే!)

విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ , అతని భార్య జాస్మిన్ లండన్‌లో నివసిస్తున్నప్పటికీ, ఈ జంట లాస్ ఏంజిల్స్‌లో వెకేషన్‌లో ఉన్నారు. ఈ సమయంలో పాలిసాడ్స్ అగ్నిప్రమాదం సంభవించింది

మరోవైపు ఈ ప్రమాదంలో ప్రియాంక చోప్రా ,నోరా ఫతేహి  కూడా  ప్రభావితమయ్యారు. ప్రియాంక  పాలిసాడ్స్ అగ్నిప్రమాదానికి సంబంధించిన భయంకరమైన వీడియోను పోస్ట్ చేసింది.అలాగే నోరా ఫతేహి తన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది. "నేను LAలో ఉన్నాను , ఫారెస్ట్‌ మంటలు భయంకరంగా ఉన్నాయి. అసలు ఇలాంటిది ఇంతకుముందు చూడలేదు.  ఐదు నిమిషాల క్రితం తరలింపు ఆర్డర్ వచ్చింది. కాబట్టి నేను త్వరగా నా సామాను అంతా సర్దుకుని ఇక్కడి నుండి ఖాళీ చేస్తున్నాను. నేను విమానాశ్రయం దగ్గరకు వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకుంటా’’ అంటూ వెల్లడించింది.

కాగా విజయ్ మాల్యా , అతని మొదటి భార్య సమీరా త్యాబ్జీ మాల్యా కుమారుడే సిద్ధార్థ. గత ఏడాది జూన్‌లో తన చిరకాల ప్రేయసి జాస్మిన్‌ను  పెళ్లాడాడు. విలాసవంతమైన హెర్ట్‌ఫోర్డ్‌షైర్ ఎస్టేట్‌లో  చాలా కొద్దిమంది హితులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి  ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.  (భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్‌ ఫుడ్‌ ఈ లడ్డూ...అంతేనా!)
 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)