Breaking News

వీగన్‌..వీగన్‌.. : ముద్దముద్దకీ ఆరోగ్యం, ఉల్లాసంగా, ఉత్సాహంగా!

Published on Sat, 05/03/2025 - 10:44

‘ఒక వ్యక్తి మొక్కల ఆధారిత ఆహారాన్ని (plant-based food) ఎంచుకుంటే రోజుకు 1,100 గ్యాలన్ల నీటిని ఆదా చేసినట్టే. పది కేజీల కార్బన్‌ ఉద్గారాలను తగ్గించి భూమికి మేలు చేసినట్టే. ఒక జంతువు జీవితాన్ని కాపాడిన వారవుతారు. మీ భోజన ఎంపిక మీ ఆరోగ్యం గురించే కాదు, భూమిపైన జంతుజాలం నివసించడానికి, ఆరోగ్యకరమైన భూమి కోసం కూడా’ అంటున్నారు వీగన్‌ ప్రేమికులు. 

‘ఉత్సాహంగా తినండి. ఉత్సాహంగా జీవించండి. ఉత్సాహంగా ఉండండి! పోషకాలతో ఉండండి, దయతో ఉండండి, ఆకుపచ్చగా ఉండండి!’ అనేది వీగన్‌ ప్రేమికుల మాట.

మన ఆహారాల్లో శాకాహారం, మాంసాహారం గురించి తెలుసు. కొన్నాళ్లుగా వినిపిస్తున్నది వీగన్‌  (Vegan) ఆహారం. జంతు సంబంధిత ఆహారాలకు దూరంగా ఉంటూ మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎంచుకోవడం. వీటిలో.. పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, గింజలు మొదలైనవి ఉంటాయి. 
 

‘వీగన్‌ డైట్‌ ఎంపికలో సవాళ్లెన్నో ఉంటాయి. ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్‌ బి12 పోషకాల కోసం ఆహార ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు.. ఉడికించిన శనగలను తీసుకుంటే ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్‌.. వంటి ΄ోషకాలు లభిస్తాయి. శనగలను ఉడకబెట్టి, కూర లేదా సలార్‌ రూపంలో తయారుచేసి తీసుకోవచ్చు. సోయాబీన్స్‌లో మాంసాహారంతో సమానంగా  ప్రొటీన్లు లభిస్తాయి. ఇందులోని ఐరన్, జింక్, క్యాల్షియం, విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్స్‌.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గించి బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు మహిళల్లో మెనోపాజ్‌ లక్షణాలను తగ్గిస్తాయి. వేరుశనగలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు,ఫైబర్‌ లభిస్తాయి. బరువును కంట్రోల్‌లో ఉంచడానికి సహకరిస్తాయి. 

ఇదీ చదవండి: నా డ్రీమ్స్‌.. కరియర్‌ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నా

క్వినోవాలో  ప్రొటీన్‌ సమృద్ధిగా లభిస్తుంది. మాంగనీస్,   పొటాషియం, ఫాస్పరస్, విటమిన్‌ బి6 వంటి ΄ోషకాలు మెండుగా ఉంటాయి. చిక్కుడు జాతికి చెందిన రాజ్మా, బ్లాక్‌ బీన్స్‌ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. విటమిన్‌ బి, ఫైబర్,  ప్రొటీన్లు లభించే ఈ చిక్కుళ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బాదంపప్పు, పిస్తా, అక్రోట్‌ వంటి నట్స్‌ రోజూ కొన్ని తీసుకుంటే గుండెకు మేలు చేస్తాయి. నట్స్‌లో క్యాలరీలు ఎక్కువ కాబట్టి మితంగా తీసుకోవాలి. ఇలా మొక్కల ఆధారిత గింజలు, మొలకెత్తిన విత్తనాలను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. రుచికరంగా, ఆరోగ్యకరంగా జీవనశైలిని మార్చుకోవచ్చు.’
– శారద, ప్లాంట్‌ప్రెన్యూర్, సిమీస్‌ వరల్డ్, హైదరాబాద్‌

చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్‌!

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)