Breaking News

బోధనకు సృజన తోడైతే ఇంత బాగుంటుందా..!

Published on Thu, 06/19/2025 - 11:40

చూస్తుండగానే వేసవి సెలవులు అయిపోయాయి. స్కూళ్లు మొదలయ్యాయి. ఇక పిల్లలు, పెద్దలు హడావిడి మాములుగా ఉండదు. ఇన్నాళ్లు జాలీగా గడిపిన చిన్నారులకు ఇప్పుడు స్కూల్‌కి వెళ్లాంటే ఉంటుంది బాధ..మాములుగా ఉండదు. వాళ్లని యథావిధిగా స్కూల్‌కి వెళ్లేలా చేయలేక పేరెంట్స్‌ తంటాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. సరిగ్గా ఈ సమయంలో  సామాజిక మాధ్యమంలో ఓ టీచర్‌ పిల్లలను ఆకట్టుకునేలా పాఠాలు చెబుతున్న వైరల్‌ వీడియో అందర్నీ తెగ ఆకట్టుకుంది. ఇలా ప్రతి టీచర్‌ పిల్లల్నిఎంజాయ్‌ చేసేలా పాఠాలు చెబితే వాళ్లు స్కూల్‌కి వెళ్లనని మారం చెయ్యరు అంటున్నారు నెటిజన్లంతా. మరీ ఆ వీడియో కథాకమామీషు ఏంటో చూద్దామా..!.

వేసవి సెలవుల తర్వాత స్కూల్స్‌ తెరిచిన రోజు సామాజిక మాధ్యమాల్లో ఒక టీచర్‌ వీడియో వైరల్‌ అయింది. తొలి రోజు తరగతి గదిలో నృత్యం చేస్తూ, పాట పాడుతూ చిన్నారులను హుషారు పరచడం ఆ వీడియో సారాంశం. ఆ టీచర్‌ పేరు వందనరాయ్‌. కర్నాటకలోని కర్కలకు చెందిన వందన పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాఠం చెప్పడంలో దిట్ట. కన్నడ, ఆంగ్ల అక్షరాలను నృత్యం చేస్తూ పిల్లలకు ఆమె నేర్పే తీరు ఆకట్టుకుంటోంది. 

పండ్లు, కూరగాయలను పరిచయం చేస్తూ వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆడుతూ, పాడుతూ చెబుతారు. ప్రత్యేక సందర్భాల్లో పిల్లలకు సందర్భోచితంగా మేకప్‌ వేసి పాటలు నేర్పుతూ ఆటలాడిస్తారు. ఆమె వీడియోలు యూట్యూబ్‌లో వైరల్‌ అయ్యాయి. బోధనకు, సృజనాత్మకత తోడైతే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ వీడియోలు చెప్పకనే చెబుతాయి. 

(చదవండి: రిస్క్‌ ఎంతున్న రెస్క్యూకి రెడీ..!)

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)