Breaking News

చాట్‌జీపీటీ లేకపోతే ప్రాణమే పోయేది..!

Published on Fri, 04/25/2025 - 12:59

చాట్‌జీపీటీ వంటి సాంకేతికతో ఆరోగ్య సలహాలు తీసుకోవద్దుని నొక్కి చెబుతుంటారు నిపుణులు. అవి నేరుగా వైద్యుడిని సంప్రదించినట్లుగా ఉండదు, పైగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి వ్యాధులను నిర్థారించలేదనే హెచ్చరిస్తుంటారు. అయితే ఆ మాటలన్నింటిని కొట్టిపారేసేలా ఓ ఘటన చోటుచేసుకుంది. వైద్యులే గుర్తించలేని ఆరోగ్య సమస్యను గుర్తించి ఓ మహిళ ప్రాణాలను కాపాడింది. అసలు ఆ ఏఐ చాట్‌జీపీటీ లేకపోతే నా ప్రాణాలే ఉండేవి కాదని కన్నీటిపర్యంతమైంది ఆమె. ఇదంతా ఎక్కడ జరిగిందంటే..

అమెరికాలోని నార్త్‌కరోలినా ప్రాంతానికి చెందిన మహిళ ఎన్నేళ్లుగానో తెలియని అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఆ అనారోగ్యం కారణంగా ఆమె బాడీలో ఎన్నో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం, విపరీతమైన కడుపు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంది. దీంతో వైద్యులను సంప్రదించినా లాభం లేకుండాపోయింది. వాళ్లంతా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ అని నిర్థారించారు.

పైగా యాసిడ్ రిఫ్లక్స్ కారణంగా ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. అయినా ఆమెకెందుకో తాను అంతకుమించిన పెద్ద అనారోగ్యంతో బాధపడుతున్న ఫీల్‌ ఉండేది. దీంతో సరదాగా ఏఐ చాట్‌జీపీటీలో తాను ఫేస్‌ చేస్తున్న అనారోగ్య సమస్యలను వివరించింది. చివరగా వైద్యులు ఏమని నిర్థారించారో చాట్‌జీపీటో సంభాషిస్తుండగానే..ఆమె హషిమోటో వ్యాధితో బాధపడి ఉండొచ్చని చెప్పింది చాట్‌జీపీటీ. 

దీంతో ఆమె వెంటనే వైద్యుల్ని సంప్రదించి ఆ దిశగా వైద్య పరీక్షలు చేయించుకుంది. ఆ పరీక్షల్లో ఆమె ప్రాణాంతక కేన్సర్‌ అయినా..హషిమోటో వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. స్క్రీనింగ్‌ పరీక్షల్లో వైద్యులు ఆమె మెడలో రెండు చిన్న గడ్డలను గుర్తించారు. ఆ తర్వాత వాటిని కేన్సర్‌ కణితులుగా నిర్థారించారు. ప్రస్తుతం ఆమె తగిన చికిత్సను పొంది ఆ సమస్య నుంచి బయటపడింది. తాను గనుక చాట్‌జీపీటీనీ సంప్రదించి ఉంకడపోతే..ఇంకా ఆర్థరైటిస్‌ మందులు వాడుతూ..కేన్సర్‌ సమస్యను ముదరబెట్టుకునేదాన్ని అని వాపోయింది. ఇలా మరో ప్రయత్నం చేయకుంటే తన ప్రాణాలే పోయేవి అంటూ తన అనుభవాన్ని వివరించారామె. 

ఏంటీ వ్యాధి అంటే..
హషిమోటో వ్యాధి అనేది థైరాయిడ్ గ్రంధిని ప్రభావితం చేసే స్వయం ప్రతిరక్షక రుగ్మత. ఇది హైపోథైరాయిడిజం (thyroid గ్రంధి తక్కువ పనితీరు)కు కారణమవుతుంది. దీని వల్ల శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల స్థాయిలు తక్కువగా ఉంటాయి.

 ఈ వ్యాధి కారణంగా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంధిని విదేశీ కారకంగా భావించి, దానిపై దాడి చేస్తుంది. ఈ దాడి థైరాయిడ్ గ్రంధిని దెబ్బతీసి, దాని సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. చితకిత్స మాత్రం.. మందులతో ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవాల్సిందే.

గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

(చదవండి: Starch-Free Rice Cooker: డయాబెటిస్, ఊబకాయాన్ని దరిచేరనీయదు..)
 

#

Tags : 1

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)