Breaking News

ఏకంగా 27 నిమిషాల పాటు గుండె ఆగిపోయింది! ఆల్‌మోస్ట్‌ డెడ్‌ కానీ..

Published on Fri, 10/27/2023 - 16:29

మృత్యువు ఒడిలోకి వెళ్లి కూడా బతికి వస్తే వాట్‌ ఏ మిరాకిల్‌ అనుకుంటాం. మన కళ్లను మనమే నమ్మలేని కఠిన నిజం గందరగోళానికి గురి చేసేలా మన కళ్లముందు మెదిలాడుతుంది.  ఆ క్షణం మన ఆనందానికి అవధులుండవు. అలాంటి ఓ అ‍ద్భుత ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. 

యూఎస్‌లోని టీనా అనే ఓ మహిళ కార్డియాక్‌ అరెస్టుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాదాపు 27 నిమిషాల పాటు గుండె ఆగిపోయింది. ఓ వైపు శరీరం నీలం రంగులోకి మారిపోతుంది కూడా. ఇంతలో ఆమె భర్త ఆమెను బతికించేలా చేస్తున్న సీపీఆర్‌ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అంబులైన్స్‌ని పిలిపించి ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించే యత్నం చేశాడు. అంతేగాదు ఆస్పత్రికి వెళ్లే మార్గంలో సైతం ఆమెను బతికించేలా ఆక్సిజజన్‌ అందించి గుండె పనిచేశాల చేసే ప్రథమ చికిత్సల్లో వేటికి ఆమె స్పందించలేదు. చివరికి ఆస్పత్రిలో వైద్యుల సైతం ఆమె చనిపోయిందని డిసైడ్‌ అయ్యారు.

ఆల్‌మోస్ట్‌ ఓ శవం మాదిరి నిర్జీవంగా పడి ఉంది టీనా. దీంతో వైద్యులు చివరి ప్రయత్నంగా డీఫిబ్రిలేటర్‌తో షాక్ ఇద్దాం అని డిసైడ్‌ అయ్యి ఇస్తే..ఏదో నిద్రలో మెల్కోన్నట్లు కళ్లు తెరించింది. ఆ హఠాత్పరిణామానికి వైద్యులు సైతం సభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అసలు చలనం లేకుండా శవంలా పడి ఉంది. స్పదించదని తెలిసే జస్ట్‌ అలా కరెంట్‌ షాక్‌ ఇచ్చామని చెబుతున్నారు వైద్యులు. ఐతే కళ్లు తెరిచి చూసింది గానీ ఏం మాట్లాడలేకపోయింది. ఈ తంతంగమంతా చూస్తున్న ఆమె సభ్యులు కూడా విస్తుపోయారు. నిజంగా ఆమె  బతికిందా దెయ్యమా? అన్నంత టెన్షన్‌గా చూశారు ఆమెను.

ఆమె ఏం మాట్లాడలేదని వైద్యుల కుటుంబంసభ్యులకు చెప్పడంతో అంతా సైలెంట్‌గా ఉన్నారు. ఆమెకు ఒక పుస్తకం, పెన్ను ఇచ్చి నీకు ఏం జరిగిందో లేక గుర్తున్నది అందులో రాయమని సూచించారు. చనిపోయి బతికావని తెలుసా అని వైద్యులు అడగగా..ఔను! ఒక్కసారిగా చలనం లేకుండా పడి ఉన్నట్లు అనిపించిందని ఎంత ప్రయత్రించినా మేల్కొలేకపోతున్నట్లు తెలిసిందని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. నిజానికి ఇలా జరిగినప్పుడు ఆక్సిజన్‌ బ్రెయిన్‌కి అందక మెదడులో బ్లీడింగ్‌ అయ్యి చనిపోవడం జరుగుతుంది. అందువల్ల బతకదని తేల్చి చెప్పాం అన్నారు. ఆమె బతికినా బ్రెయిన్‌కి సంబంధించిన కాంప్లికేషన్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న ఉద్దేశ్యంతో పరీక్షలు చేసినా వాటి తాలుకా గాయాలు ఏం కనిపించకపోవడం వైద్యులను మరింత ఆశ్చర్యపరిచింది. దీంతో ఆమెను మరో నాలుగు రోజులు పూర్తి అబ్జర్వేషన్‌లో ఉంచి డిశ్చార్జ్‌ చేశారు వైద్యులు.

(చదవండి: ఆక్టోపస్ రెసిపీ తిని వ్యక్తి మృతి!)

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)