Breaking News

ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ : దేవుడా..ప్యాక్‌ చూసి షాక్‌!

Published on Wed, 11/27/2024 - 15:53

ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసినపుడు ఒకటికి బదులు ఒకటి రావడం, లేదంటే ఆహారంలో పురుగులు, సిగరెట్‌ పీకలు రావడం లాంటి ఘటనలు గతంలో చాలా చూశాం. తాజాగా అమెరికాలోని  ఒక మహిళకు  మరో వింత అనుభవం ఎదురైంది. తను ఆర్డర్‌ చేసిన ప్యాకేజీ ఓపెన్‌ చేసి, చూసి షాకయ్యింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. స్టోరీ ఏంటంటే..!

న్యూజెర్సీలో డ్రైవర్‌గా పని చేసే ఒక మహిళ ఉబెర్‌ ఈట్స్‌నుంచి బురిటో(షావర్మా) లాంటిది ఆర్డర్‌ చేసింది.   ఉబెర్ ఈట్స్ డెలివరీ అందుకొని ఓపెన్‌ చేసి, తిందామని ఏంతో ఆతృతగా  ఫాయిల్‌ రేపర్‌  విప్పి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అందులో బురిటోకు బదులుగా గంజాయి ప్యాక్‌ చేసి ఉంది.  ఘటన వాషింగ్టన్ టౌన్‌షిప్, క్యామ్‌డెన్ కౌంటీలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ విషయంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే తన డెలివరీ ప్యాకేజీలో బురిటోకు బుదులుగా ఏదో తేడా వాసన వచ్చినట్టుగా  అనిపించిందని బాధితురాలు  తెలిపిందని  వాషింగ్టన్ టౌన్‌షిప్ పోలీస్ చీఫ్ పాట్రిక్ గుర్సిక్ ఒక ప్రకటనలో తెలిపారు. అది ఒక ఔన్స్ గంజాయి  అని తేలిందని ఆయన వెల్లడించారు. డ్రగ్స్, ఆల్కహాల్ లేదా మందులను రవాణాపై నిషేధం ఉన్న నేపథ్యంలో  ఉబెర్‌ ఈట్స్‌లో ప్యాకేజీ డెలివరీ ఫీచర్‌ను ఎవరైనా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించి ఉంటారని అనుమానిస్తున్నారు.

ఉబెర్‌ ఈట్స్‌ స్పందన
దీనిపై ఉబెర్‌ ఈట్స్‌ కూడా స్పందించింది. ఈ ఘటన తీవ్రంగా కలపర్చేదేనని ఉబెర్‌ ప్రతినిధి వ్యాఖ్యానించారు. స్థానిక అధికారులను వెంటనే అప్రమత్తం చేసినందుకు ఆమెను అభినందించారు. ఇలాంటి అనుమానాస్పద డెలివరీలపై వెంటనే  రిపోర్ట్‌ చేయాలని ఇతర డ్రైవర్లను  కూడా కోరారు.

ఇదీ చదవండి : వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్‌ స్టోరీ, ఆదాయం ఎంతో తెలుసా?


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)