Breaking News

24 ఏళ్లకే కంపెనీ ..28కే రిటైర్మెంట్‌! ఏకంగా రూ. 106 కోట్లు..

Published on Thu, 04/24/2025 - 19:09

ఆరుపదుల వయసుకి రిటైర్మెంట్‌ తీసుకుంటారు. ఇది సహజం. కానీ రెండు పదుల వయసుకే అంటే..జస్ట్‌ 28 ఏళ్లకే రిటైర్‌ అవ్వడం గురించి విన్నారా..!. పైగా పిల్లలను క్రీడాకారులుగా తీర్చిదిద్దే పనిలో గడుపుతున్నాడట. అంతలా చకచక కెరీర్‌లో సెటిల్‌ అయిపోయి..పిల్లలు పెంచే సమయానికే హాయిగా వారితో గడిపేలా ప్లాన్‌  చేసుకున్నాడు ఈ యూఎస్‌ వ్యక్తి. అతడి స్టోరీ వింటే..ఇది కదా పక్కా ప్లానింగ్‌ లైఫ్‌ అంటే అనిపిస్తుంది.

అతడే యూఎస్‌కి చెందిన నథానెల్ ఫారెల్లీ. ఈతరం జెన్‌ జెడ్‌ యువతకి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 29 ఏళ్ల నథానెల్ ఫారెల్లీ 21 ఏళ్లకే రిజిస్టర్డ్‌ నర్సు అయ్యాడు.  సరిగ్గా అప్పుడే కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు అల్లాడుతున్న సమయం. దాన్నే తన అభ్యున్నతికి మార్గంగా మలిచాడు. 

ఆ సమయంలో ఫారెల్లీ రివిటలైజ్ అనే కంపెనీ ప్రారంభించి..దాంతో ఈ హోమ్ ఇన్ఫ్యూషన్ థెరపీ సేవలు అందించాడు. అందులోనూ మహమ్మారి సమయంలో చికిత్స పొందడం రోగులకు చాలా కష్టంగా ఉండేది. అందుకని వారికి తన కంపెనీ సాయంతో ఇంటి వద్దే యాంటీబయాటిక్‌ మందులతో చికిత్స పొందేలా నర్సులను సరఫరా చేసేవాడు. ఆ హోమ్ ఇన్ఫ్యూషన్ థెరపీ వ్యాపారంతో కొద్దికాలంలోనే కోట్లు గడించాడు. 

దాంతో అలా జస్ట్‌ నాలుగేళ్లకే తన వ్యాపారాన్ని $12.5 మిలియన్లకు (రూ. 106 కోట్లు) విక్రయించి బిందాస్‌గా సెటిల్‌ అయిపోయాడు. అంటే..నిండా ముప్పై ఏళ్లు నిండక ముందు పూర్తి ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొందాడు. అలా ఫారెల్లీ 28 ఏళ్లకే రిటైర్మెంట్‌ తీసుకుని.. ఆ వచ్చిన సొమ్ముపై వచ్చే వడ్డీతో చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. 

ప్రస్తుతం ఫారెల్లీ తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఫ్లోరిడాలోని పెన్సకోలాలో నివసిస్తున్నాడు. అంతేగాదు తన పిల్లలకు సాకర్‌ క్రీడలో శిక్షణ ఇవ్వడం,  రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను నిర్వహించడం తదితర పనులు చేస్తున్నాడు. ప్రస్తుతం కుటుంబంతో హాయిగా గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తున్నానని, కానీ భవిష్యత్తులో మరో కంపెనీ పెట్టే అవకాశం ఉందని చెబుతున్నాడు ఫారెల్లీ.  

(చదవండి: యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్‌)

 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)