Breaking News

బ్రకోలి ఆరోగ్యానికి మంచిదని కొనేస్తున్నారా..?

Published on Fri, 02/07/2025 - 16:10

ప్రస్తుంతం అందరూ ఆరోగ్య స్ప్రుహతో బ్రకోలిని ఇష్టంగా తినడం మొదలు పెట్టారు. అస్సలు కాలీఫ్లవర్‌ వైపుకి చూడనివాళ్లు సైతం బ్రకోలి ప్రయోజనాలు తెలిసి మిస్‌ చేయకుండా కొంటున్నారు. అయితే ఆరోగ్యానికి మంచివని కొనేముందు తాజాగా ఉందా లేదా అనేది గమనించాలి. ఏమరపాటుతో కొంటే మాత్రం ఆరోగ్యదాయకమైనవి కూడా అత్యంత ప్రమాదకరమైనవిగా మారిపోతాయి. ఇలాంటివి కొనేటప్పడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన​ అధికారులు. ఎందుకంటే..?..

యూఎస్‌లోని సుమారు 20 రాష్ట్రాల్లోని ప్రజలు కొన్ని దుకాణాల నుంచి ప్యాక్‌ చేసి ఉన్న బ్రకోలి(Broccoli)ని కొనుగోలు చేశారు. వెంటనే యూఎస్‌ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (US Food and Drug Administration (FDA)) అప్రమత్తమై తినొద్దని హెచ్చరించింది. వాటిని వెనక్కి ఇచ్చేయండి లేదా ఉపయోగిచకండి అని విజ్ఞప్తి చేసింది. ఎందుకంటే ఎఫ్‌డీఏ అధికారులు ఓ దుకాణంలో యాదృచ్ఛికంగా బ్రకోలిని టెస్ట్‌ చేయగా దానిలో ప్రాణాంతక లిస్టెరియా మోనోసైటోజీన్ బ్యాక్టీరియాలు(Listeria monocytogenes) ఉన్నట్లు గుర్తించారు. 

దీంతో డిసెంబర్‌ 2024  తొలివారంలో ఎవరైతే ఈ బ్రకోలిని కొన్నారో వారు.. డిసెంబర్‌ 10 కల్లా ఉపయోగిస్తే పర్లేదని అలాకాని పక్షంలో తక్షణమే వినియోగించటం మానేయాలని సూచించింది. ఎందుకంటే ప్యాకింగ్‌ చేసినప్పుడు నిల్వ తక్కువ ఉండే ఆహార పదార్ధాల్లో ఆటోమేటిగ్గా ఇలాంటి బ్యాక్టీరియా ఫామ్‌ అవుతుందట. 

అందువల్ల దయచేసి ఇలాంటి కూరగాయాలను ప్యాకింగ్‌ కవర్‌పై ఉండే డేట్‌ ఆధారంగా కొనడం, ఉపయోగించడం వంటివి చేయండి అని చెబుతున్నారు. ఇలాంటి కలుషితమైన బ్రకోలి తింటే ఆరోగ్యవంతుడైన వ్యక్తులలో అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వికారం, కడుపు నొప్పి, విరేచనాలు వంటి స్వల్పకాలిక లక్షణాలు సంభవిస్తాయని చెబుతున్నారు. అదే గర్భిణీ స్త్రీలలో గర్భస్రావాలు, నెలలు నిండకుండానే ప్రసవించడం వంటివి జరుగుతాయని చెబుతున్నారు. 

ఏంటీ లిస్టెరియా మోనోసైటోజీన్‌లు:
లిస్టెరియా మోనోసైటోజెన్స్ అనేది వ్యాధికారక బాక్టీరియం. ఇది మానవులకు జంతువులకు సోకుతుంది. అనేక ఇతర బాక్టీరియాలా కాకుండా లిస్టెరియా రిఫ్రిజిరేటెడ్ పరిసరాలలో వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఆహర ఉత్పత్తి నిల్వలో ఈబ్యాక్టీరియా ఉత్ఫన్నమవుతుంది. అందువల్ల కొన్ని ఆహార పదార్థాలు అంటే.. మహా అయితే ఐదు రోజులకి మించి నిల్వ చేయలేని కూరగాయల్లో ఇది ఫామ్‌ అవుతుంది. 

తాజా కూరగాయాలు ఆరోగ్యానికి మంచివి. అది కూడా రైతులు కోసుకొచ్చిన.. రెండు మూడు రోజులకి మించి నిల్వ లేనివి అయితేనే మంచివనే విషయం గ్రహించాలి. నిజానికి బ్రకోలి సూపర్‌ ఫుడ్‌. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని ఇస్తుంది. కానీ అన్నింటికంటే ఇది ఫ్రెష్‌గా ఉందా లేదా అనేది నిర్థారించి తీసుకోవడం మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 

(చదవండి: చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలతో రైతుగా మారాడు..! కట్‌చేస్తే..)

 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)