Breaking News

మా కల ఇన్నాళ్లకు తీరింది : అమెరికా దంపతులపై నెటిజన్ల ప్రశంసలు

Published on Sun, 04/20/2025 - 14:49

ఆడపిల్లలంటే మన సమాజంలో చిన్నచూపు.  ఇక అరుదైన  వైకల్యంతో పుట్టిన చిన్నారి పరిస్థితి గురించి చెప్పాల్సిన పనిలేదు. అందుకే పుట్టిన వెంటనే తల్లిదండ్రులు  అనాథాశ్రమంలో వదిలివేశారు. కానీ భారతదేశంలో నివసిస్తున్న అమెరికాకు చెందిన దంపతులు పెద్ద మనసు చేసుకున్నారు. రెండేళ్లుగా అనాథాశ్రమంలో ఉంటున్న చిన్నారి నిషాని  ఇంటికి తెచ్చుకున్నారు. ఎంతో ప్రేమగా  ఒక బిడ్డకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఒక అందమైన పోస్ట్‌ద్వారా ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకు న్నారు.  ప్రస్తుతం ఈ కథ నెటిజనులను బాగా  ఆకట్టుకుంటోంది.  

 భారతదేశంలో నివసిస్తున్న ఒక అమెరికన్ జంట క్రిస్టెన్, టిమ్ ఫిషర్  శ్రీమతి ఫిషెర్‌. ఈ దంపతులకు ఇప్పటికే ముగ్గురు కుమార్తెలున్నారు. నాలుగో కుమార్తెగా   రెండేళ్ల నిషాను దత్తత తీసుకున్నారు.  నిషాను పరిచయం  చేస్తూ ఒక వీడియోలో ఆనందకరమైన క్షణాన్ని పంచుకున్నారు.  2023 అక్టోబర్‌లో దత్తత ప్రక్రియను ప్రారంభించి, 2024  సెప్టెంబర్‌లో  నిషా తమకు నచ్చిందని,   2025 ఏప్రిల్‌ నాటికి దత్తతను పూర్తి చేశామంటూ ఈ వీడియోలో వివరించారు.  ఇది నిజంగా బిగ్‌ న్యూస్‌.. ఇన్నాళ్లూ ఈ రహస్యాన్ని దాచిపెట్టాం. ఈ రోజుకోసం ఎంతగానో కలలు కన్నాం.  మజీవితంలో ఈ ప్రత్యేకమైన అమ్మాయి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్లకు  మా కల ఫలించిందంటూ ఫిషర్‌ రాసుకొచ్చారు. 

 

 అనేక కారణాల వల్ల  స్పెషల్‌ నీడ్స్‌ బేబీని  దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాము. ప్రధానంగా బేలేట్రల్‌ లోయర్ లింబ్‌ వైకల్యం (‌bilateral lower limb deformities) బిడ్డకు కొత్త జీవితాన్ని ఇవ్వాలను కున్నాము.  పాపాయి చిరునవ్వు,  ఆనందం,    సంతోషంతో ఎంతో అందంగా ఉంటుంది.  ఇంత కాలం ఆమె నిర్లక్ష్యానికి గురైనా, ఆమె ఈ ప్రపంచానికి చాలా అవసరం అంటూ రాశారు. 

ఫిషర్స్ దత్తత ప్రకటన చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులను ఆకర్షించింది. ప్రత్యేక అవసరాలున్న ఆడబిడ్డ నిషాను దత్తత తీసుకోవడానికి ఈ జంట తీసుకున్న నిస్వార్థ నిర్ణయాన్ని  చాలా మంది ప్రశంసించారు.  "మాటల్లో వర్ణించలేం. ఆమెకు శాశ్వత ఇల్లు ఇచ్చినందుకు మీ కుటుంబానికి చాలా ఆశీర్వాదాలు! నిజంగా  మీరు చాలా అభినందనీయులు!" అన్నారొకరు. ‘‘అద్భుతం , మీమాది అపారమైన గౌరవం ఏర్పింది అభినందనలు!" అని మరో నెటిజన్‌ వ్యాఖ్యానించారు. 

కాగా  2021లో భారతదేశానికి మకాం మార్చారు క్రిస్టెన్‌, ఫిషెర్‌ దంపతులు. వారి అనుభవాలను పంచు కోవడం ద్వారా  సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌ అయ్యారు. ఇపుడు  ముగ్గురు అమ్మాయిలున్న ఈ దంపతులు భారతీయ అమ్మాయిని అదీ స్పెషల్లీ నీడ్‌ బేబీని దత్తత తీసుకోవడం విశేషంగా నిలిచింది. 

ఇదీ చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)