Breaking News

Urine Eye Wash: ప్లీజ్‌ అలా చెయ్యొద్దు..! వైద్యుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Published on Thu, 06/26/2025 - 14:17

ఇటీవల ఇన్‌స్టా రీల్స్‌ పిచ్చి మాములుగా లేదు కొందరికి. అందుకోసం వాళ్లు చేసే పిచ్చి చేష్టలకు అంతుపొంతు లేకుండాపోతోంది. అది సరైనదా? కాదా..? అన్నది అనవసరం. సోషల్‌ మీడియా క్రేజ్‌, ఆ కంటెంట్‌కి ఎన్ని వ్యూస్‌ వచ్చాయ్‌ అన్నదే ధ్యేయం. కానీ వీటిని స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యి ఇబ్బందులు పడుతున్న అభాగ్యులెందరో ఉన్నారు. ప్రస్తుతం తాజాగా అలాంటి వీడియో సోషల్‌ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఆ వీడియోని చూసి వైద్యులే కంగుతిన్నారు. ప్లీజ్‌ అలా చెయ్యకండి అని హెచ్చరిస్తునన్నారు. 

అసలేం జరిగిందంటే..  పూణెకు చెందిన నుపుర్ పిట్టీ అనే మహిళ వైరల్‌ వీడియోలో తనను "మెడిసిన్-ఫ్రీ లైఫ్ కోచ్"గా పరిచయం చేసుకుంటూ "యూరిన్ ఐ వాష్ " గురించి వివరించింది. ఇది మనకు ప్రకృతి ప్రసాదించిన ఔషధం అంటూ..మూత్రం కళ్లను శుభ్రం చేసుకుంటూ కనిపించింది వీడియోలో. మన మూత్రంతో ఇలా కళ్లను వాష్‌ చేసుకుంటే..డ్రైగా మారడం, ఎరుపెక్కడం వంటి కంటి సమస్యలు రావని ఆరోగ్య సలహాలు కూడా ఇచ్చేసింది. 

అయితే ఈ వీడియోపై వైద్య నిపుణులు తీవ్రంగా స్పందించడమే గాక మండిపట్టారు. ప్రజల ఆరోగ్యంతో ఇలా చెలగాటం ఆడటం మంచిద కాదని ఫైర్‌ అయ్యారు. ఇలాంటి ప్రక్రియలు ప్రమాదకరమైనవని, దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. మూత్రంతో ఇలా అస్సలు చేయొద్దని గట్టిగా హెచ్చరించారు కూడా.

ఎందుకు మంచిది కాదంటే..

నిపుణులు అభిప్రాయం ప్రకారం మూత్రాన్ని తాగడం లేదా ఉపయోగించటం అనేది ఆరోగ్యానికి మంచిదని శాస్త్రీయంగా ఎక్కడ నిరూపితం కాలేదు. “యూరిన్ థెరపీ“కి సంబంధించి వైద్యపరమైన ఆధారాలు కూడా లేవు. 

మూత్రంలో చాలా తక్కువ మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు ఉన్నప్పటికీ ఏవిధమైన ఆరోగ్య ‍ప్రయోజనాలను అందివ్వదు. 

అందులో శరీరానికి అవసరం లేని ద్రవం, శరీరంలోని వ్యర్థాలనను తొలగించిన ద్రవమే మూత్రం. మూత్రపిండాలు రక్తప్రవాహం నుంచి అదనపు నీటిని సెల్యులార్ వ్యర్థాలను బయటకు పంపించే ఉత్పత్తి ఇది. దీనిలో 90 శాతం నీరు ఉండగా, మిగిలిన భాగం అమ్మోనియా వంటి ఇతర లవణాలు ఉంటాయి. 

అంతేగాదు మూత్రపిండాల అనే రెండు కండరాల గొట్టలు ద్వారా  మూత్రాశయానికి మూత్రాన్ని పంపుతాయి. మూత్రాశయం నిండినప్పుడు, నరాల చివరలు మెదడుకు బాత్రూమ్‌కి వెళ్లమని సంకేతమిస్తాయి. దాంతో మూత్రనాళం అనే చిన్నగొట్టం సాయంతో విసర్జిస్తాం. అదీగాక ఈ మూత్రనాళం కొన్ని రకాల బ్యాక్టీరియాలకు నిలయం.

అందువల్ల మూత్రం శుభ్రమైనద కాదు. శరీరం వదిలించుకున్న ఈ వ్యర్థ ద్రవం తిరిగి శరీరంలోకి పంపిస్తే..హనికరమైన బ్యాక్టీరియాకు గురై లేనిపోని వ్యాధులు బారినపడే ప్రమాదం తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. 

 

(చదవండి: ఆ తప్పిదాలతో 116 కిలోల బరువు..కానీ 13 నెలల్లో ఏకంగా..)
 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)