Breaking News

Guru Purnima 2025 ఉపాసన తొమ్మిది వారాల సాయిబాబా వ్రతం

Published on Tue, 07/08/2025 - 13:27

ప్రముఖ వ్యాపారవేత్త, హీరో రామ్‌చరణ్‌ భార్య ఉపాసన ఆధ్యాత్మికత, ఆనందం కోసం వ్రతాన్ని ఆచరిస్తునట్టు ప్రకటించారు.  ఈ గురు పూర్ణిమకు తాను తొమ్మిది వారాల సాయిబాబా వ్రతాన్ని ప్రారంభిస్తున్నానని అభిమానులతో పంచుకున్నారు. తద్వారా దేవునితో అనుబంధంతో పాటు అభిమానులతో కూడా కనెక్ట్ అవ్వడానికి ఇదొక మార్గమంటూ ఆమె పోస్ట్‌ చేశారు. 

చిన్నప్పటినుంచీ దైవంమీద ఎంతో భక్తి. మా తల్లిదండ్రులు పిలిస్తే పలికే దైవం శిర్డీ సాయినాధుడిని భక్తితో కొలవడం చూశాను. తన భర్త రామ్‌చరణ్‌కు అయ్యప్ప ఎలాగో తనకు సాయిబాబా అలా అని తెలిపింది. సాయిబాబా వ్రత కల్పం చదవడం మొదలు పెట్టగానే తనలో పాజిటివ్‌ వైబ్‌, తన చుట్టూ  ఉన్నవారిలో కూడా సానుకూల దృక్పథం అలడుతుందని చెప్పుకొచ్చారు. ది. దీనికి సంబంధించి ఒక వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేసారు. ఆ ఆధ్యాత్మిక ప్రయాణంలో తనతో కలిసి రావాలని ఆహ్వానించారు.

సాయిబాబా తొమ్మిదివారాల వ్రతం అంటే
కోరిక కొర్కెలు నెరవేరేందుకు కులమతాలకు అతీతంగా, స్త్రీ పురుష భేదము లేకుండా  సాయి బాబా భక్తులు తొమ్మిది వారాల పాటు ఆచరిస్తారు. పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ప్రతి గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. సాయి భగవానుని ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతమును ప్రారంభించాలి.  ఉదయం, సాయంత్రి నిష్టతో సాయినాధుడిని పూజించాలి.  9 గురువారములు సాయి మందిరానికి వెళ్ళి ప్రార్థించాలి. వత్రం పూర్తైనా తరువాత కొంతమంది షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించు కుంటారు.  బీదలకు అన్నదానం  చేస్తారు.  5  లేదా 11 మందికి శ్రీసాయి వ్రత పుస్తకాలను ఉచితంగా  ఇవ్వడం ఆనవాయితీ. (జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది)

అత్యంత భక్తితో, నిష్టతో ఆచరిస్తే ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, ఆర్థిక బాధలుండవని నమ్ముతారు. అలాగే వృత్తి వ్యాపారాలలో పురోగతి, విజయం లభిస్తాయని, ఐశ్వర్యం, కుటుంబ శాంతి, విద్య, ఉద్యోగం, వివాహం ఇలా సకల మనోభీష్టాలు నెరవేరుతాయని చెబుతారు.
 

Videos

తల్లిని దూషిస్తే ఎవరూ ఊరుకోరు.. ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప..

గుదిబండగా మారిన నాలుగు కుంకీ ఏనుగులు

మా ఈ పరిస్థితికి హైడ్రానే కారణం

మా మామను ఆపుతారా? పెద్దారెడ్డి కోడలు మాస్ వార్నింగ్

CAG Report: ఏపీ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం.. బాబు పాలనపై కాగ్ నివేదిక

ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

సీఎంను చంపేసిన Facebook

కూటమి ప్రభుత్వంలో వైద్యానికి నిర్లక్ష్య రోగం!

హత్య కేసును తమిళనాడులోనే విచారించాలి.. ఏపీలో న్యాయం జరగదు

జగన్ 2.0.. ఎలా ఉండబోతుందంటే రోజా మాటల్లో...

Photos

+5

ట్రైలర్ లాంచ్ ఈవెంటో మెరిసిన నటి డింపుల్ హయాతీ (ఫొటోలు)

+5

విజయవాడ : సారె తెచ్చి..మనసారా కొలిచి..కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

జడివానకు హైదరాబాద్‌ అతలాకుతలం.. ట్రాఫిక్‌ జామ్‌తో చుక్కలు చూసిన వాహనదారులు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన..చెరువుల్లా మారిన రోడ్లు (ఫొటోలు)

+5

‘నా సీతా సీమంతం’ శ్రీమతి సీమంతంపై బిగ్‌బాస్‌ ఫేం పోస్ట్‌ (ఫొటోలు)

+5

‘నేను నా శివయ్య’ అంటున్న ఈ భక్తురాల్ని చూశారా?

+5

చందమామలా.. చీర సింగారించుకుని క్యూట్‌గా తెలుగు బ్యూటీ!

+5

ఆంధ్రా సరిహద్దులో.. ఉరకలేస్తున్న జలపాతాలు(చిత్రాలు)

+5

కుమారుడితో తొలిసారి తిరుమలలో హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)

+5

'పరదా' సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)