Breaking News

టైంకి ఇంటికి చేరుకోకపోతే ఆమె నన్ను..! వైరల్‌గా పైలట్‌ అనౌన్స్‌మెంట్‌

Published on Wed, 04/16/2025 - 15:56

విమానంలో వెళ్లేటప్పుడూ..ప్రయాణికులు సేఫ్టీ కోసం పైలట్‌లు, అక్కడ సిబ్బంది మనకు కొన్ని సూచనలిస్తుంటారు. అలాగే జర్నీ పూర్తి అవుతుందనగా.. సేఫ్‌ ల్యాండింగ్‌ కోసం ప్రకటనలు చేస్తుంటారు. అయితే అలానే ఇక్కడొక పైలట్‌ కూడా ఒక ప్రకటన వెల్లడించాడు. అయితే అది ఎంత ఫన్నీగా ఉందంటే..జర్నీ బడలిక అంత ఉఫ్‌మని ఎగిరిపోయినంత ఆహ్లాదంగా ఉంది. ఇంతకీ అతడేం అనౌన్స్‌మెంట్‌ ఇచ్చాడంటే..

ఇదంతా డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానంలో చోటుచేసుకుంది. సురక్షితమైన ల్యాండింగ్‌ కోసం ప్రయాణికులకు భరోసా ఇచ్చేలా అనౌన్స్‌మెంట్‌ చేస్తుంటారు పైలట్‌లు. అది సర్వసాధారణం. అయితే ఇక్కడ ఈ పైలట్‌ ఇచ్చిన అనౌన్స్‌మెంట్‌ అత్యంత విభిన్నంగా నవ్వు తెప్పించేలా ఉంది. 

సదరు పైలట్‌ మాట్లాడుతూ.."నాకు పెళ్లై 33 సంవత్సరాలు. భార్య, నలుగురు పిల్లలు, రెండు కుక్కలు, ఎనిమిది కోళ్లు ఉన్నాయి. నాబార్య ఈ చలిలో వాటిని చూసుకుంటూ అలిసిపోతుంది. అందువల్ల కచ్చితంగా శుక్రవారం సాయంత్రం కల్లా నేను ఇంటికి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఆ కోళ్లను చూసుకోవాల్సింది నేనే కాబట్టి. 

అదీగాక నేను గనుక ఇంటికి సమయానికి చేరుకోకపోతే ఆమె నన్ను చంపేస్తుంది అందువల్ల మనం కచ్చితంగా సేఫ్‌గా ల్యాండ్‌ అవుతామని హామీ ఇస్తున్నా..! అని అనౌన్స్‌మెంట్‌ ఇచ్చాడు. ఆ ప్రకటన విన్న ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యి..ఏం అనౌన్స్‌మెంట్‌ అంటూ అందరి ముఖాల్లో ఒక్కసారిగా నవ్వులు మెరిశాయి. జర్నీ చేసిన అలసట కూడా ఎగిరిపోయి ఉత్సాహంతో ఉన్నారంతా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. నెటిజన్లు కూడా ఏం చెప్పాడబ్బా..! అంటూ పైలట్‌ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. 

 

(చదవండి:  Sachin Tendulkar: ఇంత స్వచ్ఛంగా ఉంటే ఫిల్టర్లు ఎందుకు? సచిన్‌ మనుసుదోచిన గ్రామం..)
 

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)