Breaking News

'స్లీప్‌మాక్సింగ్‌': నిద్రను కూడా కొనుక్కునే దుస్థితా..?

Published on Wed, 09/25/2024 - 15:51

ప్రస్తుత జీవన విధానంలో ఎంతమంది నిద్రలేమితో బాధపడుతున్నారో తెలిసిందే. ఒక్క క్షణం రెప్పవాలితే బాగుండును అన్నంతగా ఉంది పరిస్థితి. అందుకోసం మెడిసిన్స్‌ అని ఏవేవో చిట్కాలని పాటించేస్తున్నారు కూడా. కేవలం చక్కటి జీవనశైలితో శరీర ధర్మం దానంతట అదిగా సర్దుబాటు అయ్యేలా చేసుకోవాల్సిందేనని నిపుణులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం దీన్ని కూడా క్యాష్‌ చేసుకునేలా కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు చూస్తుండటం బాధకరం. ఏకంగా సాంకేతికతో కూడిన సాధనాలు, ప్రత్యేక పరుపులు వీటితో మంచి నిద్ర గ్యారంటీ అంటూ ప్రజలను ఊదరగొట్టేస్తున్నాయి కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు. మరోవైపు ప్రజలు నిద్ర వస్తే చాలు అన్నట్లు వాటిని కొనితెచ్చేసుకోవాలనే ఆరాటంలో ఉన్నారు. అలా వచ్చిందే ఈ "స్లీప్‌మాక్సింగ్‌" వెల్నెస్ ట్రెండ్‌..!. అసలు ఏంటిది.? దీని వల్ల నిజంగా మంచి నిద్ర పడుతుందా..?

నిద్ర కోసం సాగించిన అన్వేషణ కాస్త "స్లీప్‌మాక్సింగ్‌"కి దారితీసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. నిద్రలేమితో బాధపడేవారంతా సోషల్‌మీడియాలో గ్రూప్‌గా మారి ఒకరి అనుభవానలు ఒకరూ షేర్‌ చేసుకుంటున్నప్పుడూ వచ్చిందే ఈ "స్లీప్‌ మాక్సింగ్‌". ఒక ఔత్సాహిక సోషల్‌ మీడియా వినియోగదారు చెప్పడంతో ఇది రకరకాల చర్చలకు తెరలేపింది. 

'స్లీప్‌మాక్సింగ్‌' అంటే..
నిద్ర కోసం ఉపయోగించే ఒక విధమైన సాధనాలు లేదా ఉత్పత్తులుగా చెప్పొచ్చు. ఇయర్‌ప్లగ్‌లు, నాసికా డైలేటర్‌లు, మెగ్నీషియం ఫుట్ స్ప్రే, మౌత్ టేప్, చిన్ స్ట్రాప్స్ ట్రాకర్‌లతో మంచి నిద్రను పొందేలా మార్గం సుగమం చేసుకునే విధానమే స్లీప్‌మాక్సింగ్‌. దీని గురించి సోషల్‌ మీడియా వినియోగదారు డెరెక్‌ ఆంటోసిక్‌ చెప్పుకొచ్చారు. తన 20 ఏళ్ల జీవితంలోని అనారోగ్యకరమైన అలవాట్లు నిద్రలేమికి దారితీశాయని, దాన్ని అధిగమించేందుకు సాగిన అన్వేషణలో ఈ స్లీప్‌మాక్సింగ్‌ తనకు ఉపయోగపడిందంటూ వివరించాడు. 

ఈ సాధానాలతో మంచి నిద్రపట్టిందా లేదా అని ట్రాకర్‌తో చెక్‌ చేసుకునేవాడినని చెబుతున్నాడు అంతేగాదు ఆ సాధానాలు తనకు గాఢనిద్రను అందించాయని చెప్పాడు. దీన్ని క్యాష్‌ చేసుకునేలా కొన్ని కంపెనీలు స్మార్ట్ స్లీప్ సొల్యూషన్‌ అంటూ సాంకేతికతో కూడిన సాధనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ హెడ్‌బ్యాండ్‌ వంటవి గాఢనిద్రను ప్రేరేపించేలా నిశబ్ద వాతావరణాన్ని సృష్టించేందుకు మెదడు తరంగాలను ఉపయోగిస్తుందట. అలాగే మెదడు మెలుకువగా ఉండేలా చేసే కార్యకలాపాలను లక్ష్యంగా రూపొందిచామని ఊదరగొడుతున్నాయి కంపెనీలు. 

అంతేగాదు మంచినిద్రను తెచ్చిపెట్టే పరుపులు కూడా వచ్చేశాయి. అలాగే ఉష్ణోగ్రతను సర్దుబాటు చేసే సాధనాలు, గురక తగ్గించే పరికరాలు వంటి వాటితో నిద్రను ప్రజలు కొనుక్కునే దుస్థితికి తీసుకొచ్చేయటం బాధకరం. అయితే నెటిజన్లు మాత్రం ఇవన్నీ మంచి నిద్రను అందించే సాధానలే అయిన..అవేమి సహజమైన నిద్రను అందివ్వలేవని తేల్చి చెబుతున్నారు. చక్కటి శారీరక శ్రమ, మంచి ఆహారపు అలవాట్లతోనే దాన్ని పొందగలమని నమ్మకంగా చెబుతుండటం విశేషం. ఆ గాడ్జెట్స్‌పై ఆధారపడితే క్రమేణ నాణ్యమైన నిద్రను కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేస్తూ..పోస్టులు పెట్టారు. 

(చదవండి: 'సూసైడ్ పాడ్': జస్ట్‌ బటన్‌ నొక్కితే చాలు.!)
 

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)