Breaking News

భార్య ప్రెగ్నెన్సీ బ్రేక్: వైరల్ అవుతున్న ఏఐ ప్లాన్!

Published on Sun, 06/07/2026 - 13:49

న్యూఢిల్లీ: భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్నప్పుడు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. కానీ, ఫ్యామిలీ ప్లానింగ్ లేదా ప్రెగ్నెన్సీ కారణంగా భార్య ఉద్యోగానికి ఒకట్రెండేళ్లు బ్రేక్ ఇవ్వాల్సి వస్తే? ఒకేసారి వచ్చే ఆదాయం సగానికి పైగా తగ్గిపోతుంది సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్న ఒక ఉద్యోగి, రూ. 22 లక్షల వార్షిక ఆదాయం ఉన్న తమ కుటుంబానికి సింగిల్ ఇన్‌కమ్‌తో ఎలా ప్లాన్ చేయాలని ‘చాట్ జీపీటీ’ ని ప్రశ్నించాడు. భార్య జీతం రూ. 12 లక్షలు (55శాతం), భర్త జీతం రూ. 10 లక్షలు అయినప్పుడు, ఆ సడన్ ఫైనాన్షియల్ షిఫ్ట్‌ను ఎలా తట్టుకోవాలో ఏఐ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్, ప్రాక్టికల్ ఫైనాన్షియల్ ప్లాన్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

బ్రేక్‌కు ముందే పక్కా ప్లానింగ్: ఫేజ్ 1
భార్య ఉద్యోగానికి విరామం ప్రకటించడానికి 3 నుండి 12 నెలల ముందే కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ అవసరమని చాట్ జీపీటీ స్పష్టం చేసింది. ముందుగా 9 నుండి 12 నెలల కుటుంబ ఖర్చులకు సరిపడా ‘ఎమర్జెన్సీ ఫండ్’ను లిక్విడ్ అకౌంట్లలో సిద్ధం చేసుకోవాలి. పర్సనల్ లోన్లు వంటి అధిక వడ్డీ అప్పులను వెంటనే తీర్చేయాలి. అత్యంత ముఖ్యంగా, మెటర్నిటీ బెనిఫిట్స్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్, పుట్టిన రోజు నుంచే శిశువుకు వర్తించేలా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ ఖర్చుల కోసం సాధారణ డెలివరీకి రూ. 50 వేల నుండి రూ. 1.5 లక్షలు, ప్రీమియం ఆసుపత్రుల కోసం రూ. 2.5 నుండి రూ. 6 లక్షలు, అలాగే ఎమర్జెన్సీ ఎన్‌ఐసీయూ వార్డుల కోసం రూ. 3 నుండి రూ. 5 లక్షల బఫర్ ఫండ్‌ను ముందే దాచాలని ఏఐ సూచించింది.

ఒకే జీతంతో నెట్టుకురావడం: ఫేజ్ 2
కుటుంబ ఆదాయంలో 55శాతం మాయమైనప్పుడు అది కేవలం బడ్జెట్ సమస్య మాత్రమే కాదు, మానసిక ఒత్తిడికి కూడా కారణమవుతుంది. అందుకే హోమ్ బడ్జెట్‌ను సర్వైవల్, బ్యాలెన్స్‌డ్, కంఫర్టబుల్ మోడ్స్‌గా విభజించుకోవాలి. భర్తకు వచ్చే జీతాన్ని ‘తన వ్యక్తిగత ఆదాయం’గా కాకుండా ‘కుటుంబ ఆదాయం’గా భావించినప్పుడే భాగస్వాముల మధ్య అసంతృప్తి రాకుండా ఉంటుందని ఏఐ  కీలక సూచన చేసింది. ఇంట్లో ఉండి పిల్లలను చూసుకునే భార్య శ్రమ నెలకు రూ. 15,000 నుండి రూ. 40,000 విలువైన ఆర్థిక శ్రమతో సమానమని గుర్తించాలి. ఇన్వెస్ట్‌మెంట్ల విషయానికి వస్తే, సిప్‌లను పూర్తిగా ఆపేయకుండా కొంతమేర తగ్గించుకుంటూ ఈక్విటీ కేటాయింపులను స్థిరంగా ఉంచుకోవాలి.

మళ్లీ కెరీర్ రీ-ఎంట్రీ: ఫేజ్ 3
ఉద్యోగానికి బ్రేక్ ఇచ్చే సమయం పెరిగేకొద్దీ కెరీర్ రిస్క్ కూడా పెరుగుతుందని చాట్ జీపీటీ విశ్లేషించింది. 12 నెలల బ్రేక్ ఉంటే రీ-ఎంట్రీ జీతంలో 5 నుండి 15శాతం వరకు ప్రభావం ఉంటుంది. అదే 24 నుండి 36 నెలల బ్రేక్ అయితే నైపుణ్యాల క్షీణత ఎక్కువై, మళ్లీ ఉద్యోగంలో చేరడానికి ఫ్రీలాన్సింగ్, పార్ట్-టైమ్ కన్సల్టింగ్ లేదా రీస్టార్ట్ ప్రోగ్రామ్స్ అవసరమవుతాయి. మూడు ఏళ్ల కెరీర్ బ్రేక్ వల్ల కోల్పోయే ఈపీఎఫ్‌ కాంట్రిబ్యూషన్లు, శాలరీ ఇంక్రిమెంట్లు, కాంపౌండింగ్ నష్టం దాదాపు రూ. 15 నుండి రూ. 25 లక్షల వరకు ఉంటుందని అంచనా వేసింది. ఆధునిక పేరెంటింగ్ కల్చర్ చూపిస్తున్నంతగా పిల్లల పెంపకం ఖరీదైనది కాదని, కానీ సరైన ప్లానింగ్ లేని కెరీర్ బ్రేక్స్ ఆర్థిక భవిష్యత్తును దెబ్బతీస్తాయని ఏఐ తేల్చిచెప్పింది.

ఇది కూడా చదవండి: అమెరికాలో రూ. కోటి ప్యాకేజీ.. మిగిలేదెంత?
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)