Breaking News

పార్కింగ్‌ స్థలంలో కంపెనీ : కట్‌ చేస్తే..యూకే ప్రధానికంటే మూడువేల రెట్లు ఎక్కువ జీతం

Published on Wed, 01/08/2025 - 11:25

నెలకు లక్షల్లో సంపాదిస్తేనే ఔరా అనుకుంటాం కదా. కానీ బ్రిటీష్ బిలియనీర్, మహిళా వ్యాపారవేత్త, అత్యధిక వేతనం పొందే మహిళగా నిలిచింది.  2024లో జీతం , డివిడెండ్‌లలో 150 మిలియన్ పౌండ్‌లను ( రూ.1,500 కోట్లకు పైగా)  వేతనం అందుకుంది. అంటే రోజురు నాలుగు కోట్ల వేతనం అన్నమాట.  అదీ 45 శాతం వేతన కోత  తరువాత. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎవరీ డెనిస్‌.. ఆమె కంపెనీ ఏంటి తెలుసుకుందాం ఈ కథనంలో.

57 ఏళ్ల డెనిస్ కోట్స్(denise Coates)కన్న కల  చాలా పెద్దది. అందుకే ఆమె స్థాపించిన ఒక చిన్న కంపెనీ ఇపుడు   ప్రపంచాన్ని ఏలుతోంది.   2000లో   ఒక  మామూలు కారు పార్కింగ్‌ స్థలంలో  "బెట్365" (Bet365)అనే ఆన్‌లైన్ బెట్టింగ్ సంస్థను ప్రారంభించింది. బహుశా అపుడు ఆమె ఊహించి ఉండదు..వేల కోట్ల టర్నోవర్‌తో, 8,500 మంది ఉద్యోగులతో దిగ్గజంగా ఎదిగుతుందని. కట్‌ చేస్తే...ఆమె విజయం అందరినీ ఆశ్చర్యానికి  గురి చేసింది.  డెనిస్ కోట్స్ బ్రిటన్‌లోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా అవతరించారు. సంస్థలో ఆమె మెజారిటీ వాటా50 శాతానికి  పైమాటే.

ది గార్డియన్ నివేదిక ప్రకారం  "బెట్365"  కంపెనీ అంతకుముందు సంవత్సరంలో 3.4 బిలియన్ పౌండ్ల నుండి 3.7 బిలియన్ పౌండ్‌లకు ఆదాయ వృద్ధిని సాధించింది. ఈక్విటీ మార్కెట్ పరిస్థితుల మెరుగుదల మధ్య ఖర్చులను తగ్గింపు, పెట్టుబడి మదింపుల నుండి లాభాన్ని ఆర్జించింది.  గత ఏడేళ్లలో ఆమె సంపద ఏకంగా రూ. 20 వేల కోట్లను దాటిపోగా, గత పదేళ్లలో ఆమె ఆర్జించిన మొత్తం దాదాపు రూ.24 వేల కోట్లు.  

మార్చి 2024తో ముగిసిన  ఏడాది లో సంస్థ  పన్నుకు ముందు 626 మిలియన్ పౌండ్ల లాభాన్ని సాధించింది. ఇది  గత ఏడాదితోపోలిస్తే  60 మిలియన్ పౌండ్ల ప్రీ-టాక్స్ నష్టం నుండి గణనీయమైన  పెరుగుదల.ఆన్‌లైన్ బెట్టింగ్స్‌ ఊపందుకున్న కోవిడ్-19 మహమ్మారి సమయంలో (2020) ఆమె ఆదాయం అత్యధికంగా రూ.4,690 కోట్లుగా నమోదైంది. 

కాగా ప్రపంచంలోని ప్రముఖ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ కంపెనీల్లో ఒకటి నిలిచిన Bet365 వ్యవస్థాపకురాలైన కోటస్‌ 1967, సెప్టెంబరు 26న  ఇంగ్లాండ్‌లోని స్టోక్-ఆన్-ట్రెంట్‌లో జన్మించింది.  షెఫీల్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామెట్రిక్స్ అభ్యసించింది. బెట్టింగ్ షాపులను నిర్వహించు కుటుంబ నేపథ్యంతో ఆమె ఈ కంపెనీని స్థాపించింది. ఆమె సోదరుడు జాన్ కోట్స్ సంస్థకు సంయుక్త సీఈఓగా(CEO), ప్రధాన వాటాదారుగా కొనసాగుతున్నారు.   అంతేకాదు స్టోక్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ స్టేడియానికి బెట్365 పేరు పెట్టారంటేనే  Bet365కంపెనీ ప్రాముఖ్యతను ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

విమర్శలు, వివాదాలు 
అయితే ఇంత ప్రాపులర్‌ అయిన సంస్థకు సంబంధించి మరో కోణం కూడా ఉంది.  పేదప్రజల ఆశను సొమ్ము చేసుకుంటున్న కంపెనీ అంటూ సంస్థపై అనేక విమర్శలు భారీగానే ఉన్నాయి.  ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న లక్షలాది మంది కష్టార్జితాన్ని ఈ సంస్థ కొల్లగొడుతోందని విమర్శకులు మండిపడుతున్నారు.

మరోవైపు 2020లో డెనిస్ తండ్రి పీటర్ కోట్స్(Peter Coates) బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీకి రూ.25 లక్షలు విరాళంగా ఇవ్వడం రాజకీయ దుమారాన్ని రేపింది . అలాగే 2023లో కస్టమర్ల భద్రతా వైఫల్యం,  మనీలాండరింగ్‌ లాంటి ఆరోపణలతో  ఈ సంస్థ రూ.5.82 కోట్ల జరిమానా కూడా  చెల్లించాల్సి వచ్చింది.

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)