Breaking News

177- 95 కిలోలకు!.. బరువు తగ్గడమే శాపమైంది.. చివరికి పాపం ఆమె..!

Published on Mon, 04/07/2025 - 11:49

బరువు తగ్గాలనేది చాలామంది ధ్యేయం అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో అందర్నీ వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక బరువు(ఊబకాయం). అందువల్లే సన్నగా.. స్లిమ్‌గా ఉండాలనే ధోరణి ఎక్కువైంది. కానీ వర్కౌట్‌లు, డైట్‌లతో కష్టపడటం కంటే సులువుగా, త్వరితగతిన తగ్గిపోవడమే నచ్చుతోంది చాలామందికి. అందుకే వారంతా సర్జరీల బాట పడతున్నారు. అయితే ఆధుని వైద్య విధానం ఎంతలా అభివృద్ది చెంది..నిమిషాల్లో శరీరం స్లిమ్‌గా అయిపోయే కొంగొత్త వైద్య విధానాలు వచ్చినప్పటికీ.. అవన్నీ ప్రమాదకరమే అని నిపుణుల పదే పదే హెచ్చరిస్తూన్నారు. కానీ నాజుగ్గా అయిపోవాలన్న ఇంటెన్షన్‌తో వాటన్నింటిని తేలిగ్గా తీసుకుంటున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయన్నది అనవసరం అన్నట్లుగా..బరువు తగ్గే సర్జరీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు చాలామంది. పాపం అలానే చేసి ఓ మహిళ భారీ మూల్యమే చెల్లించుకుంది. తిరిగి మాములు మనిషి కావడానికి ఎంత నరకయాతన అనుభవించిందో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. 

ఏం జరిగిందంటే..యూకేకికి చెందిన 42 ఏళ్ల డేనియల్ పీబుల్స్ అనే మహిళ బరువు తగ్గాలనే ఉద్దేశ్యంతో 2023లో గ్యాస్ట్రిక్ స్లీవ్ అనే శస్త్ర చికిత్స చేయించుకోవాలనుకుంది. అయితే ఆ దేశ జాతీయ ఆరోగ్య సంస్థలు అందుకోసం ఏడేళ్లు నిరీక్షించాలని చెప్పాయి. బాబోయే అన్నేళ్లు వెయిట్‌ చేయడం ఏంటని.. టర్కీ వెళ్లి మరీ బరువు తగ్గించుకునే గ్యాస్ట్రిక్ స్లీవ్ సర్జరీ చేయించుకుంది. నిజానికి ఆమె 177 కిలోల ఊబకాయం సమస్యతో బాధపడుతుంది. ఆమె తన బిడ్డకు పుట్టబోయే చిన్నారితో హాయిగా గడపాలంటే ఇంత భారీ కాయం పనికిరాదని భావించి ఈ శస్త్రచికిత్సకు రెడీ అయ్యింది. 

అనుకున్నట్లుగా ఈ సర్జరీతో ఆమె ఏకంగా 95 కిలోల బరువు గణనీయంగా తగ్గిపోయింది. డేనియల్ ఆనందానికి అవధులే లేకుండా పోయింది. సదరు టర్కీ ఆస్పత్రి యజమాన్యాన్ని కూడా ప్రశంసలతో ముచ్చెత్తింది. అంతా బాగానే ఉందనుకునేలోపే..రోజులు గడుస్తున్న కొద్దీ డేనియల్  ఆరోగ్యం క్షీణించడం ‍ప్రారంభమైంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తడం ప్రారంభమైంది. 

అది చివరకి బెడ్‌మీద నుంచి కాలు దించడానికే భయపడేంత పరిస్థితికి చేరుకుంది. అలా ఒకరోజు మెడ నుంచి కింద శరీరం అంతా చచ్చుబడిపోయి పక్షవాతం బారినపడింది. ఇక ఆమె తిరిగి నడవడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పేశారు. బరువు తగ్గానన్నా.. ఆనందం ఆవిరైపోయి..బతుకే భారంగా మారిందనే.. బాధతో విలవిలలాడింది. అసలు తనకు ఈ సమస్య ఎందుకు వచ్చిందో అని వైద్యులను ప్రశ్నించగా..ఈ బరువు తగ్గే సర్జరీ కారణంగా నరాల పనితీరుకి సంబంధించిన విటమిన్‌ లోపంతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. 

నరాల పనితీరు మెరుగవ్వడం అనేది అంత ఈజీ కాదు..అందువల్ల మళ్లీ తాను యథావిధిగా నడవడం అనేది సాధ్యమా..? అనేది చెప్పడం కష్టమని అన్నారు వైద్యులు. దాంతో ముందు తాను ఈ స్థితి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలే తప్పా..కుంగిపోకూడదని ఫిక్స్‌ అయ్యింది. ముందుగా నిపుణులైన వైద్యుల సమక్షంలో ఇంటెన్సివ్‌ చికిత్స తీసుకుంది. చివరకు ఆమె నరాల పనితీరు మెరుగై తిరిగి నడవగలిగేలా కింద ఉన్న ప్రతి అవయవంలో స్పర్శను తిరిగి పొందింది. చూస్తుండగానే..కొద్దిరోజుల్లోనే పూర్తిగా ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడింది. బరువు తగ్గాలనుకుంటే..అందుకు ఇంత మనోబాధను చెల్లించుకుంటానని కలలో కూడా ఊహించలేదని వాపోయింది డేనియల్‌.

ఈ సర్జరీలు ఇంత ప్రమాదకరమా?
గ్యాస్ట్రిక్ స్లీవ్ శస్త్రచికిత్స: దీనిని స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని కూడా అంటారు. ఇది బరువు తగ్గడానికి చేసే శస్త్రచికిత్స (బారియాట్రిక్ సర్జరీ). ఈ శస్త్రచికిత్సలో కడుపును చిన్న అరటిపండు ఆకారంలోకి కుదించి.. ఆహారం తీసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తారు. ఫలితంగా ఆయా వ్యక్తులు బరువు తగ్గడం జరుగుతుంది. ఇలా ఎప్పుడైతే ఆకలి తగ్గిపోతుందో అప్పుడు పోషకాహార లోపం ఎదురవుతుంది. 

ఇది కాస్తా.. శరీరానికి తగినంతగా విటమిన్లు తీసుకోకపోవడానికి దారితీస్తుంది. ఫలితంగా నరాల పనితీరుకు అవసరమై బీ విటమిన్‌ లోపం ఏర్పడి పలు ఆరోగ్య సమస్యల బారినపడటం జరుగుతుందని చెబుతున్నారు వైద్యులు.

అక్కడైతే ఖర్చు తక్కువ.. 
విదేశాల్లో తక్కువ ధరలో ఊబకాయం శస్త్రచికిత్స చేయించుకోవచ్చని..చాలామంది అక్కడకు వెళ్తున్నారు. ముఖ్యంగా బ్రిటన్‌ లాంటి దేశాల్లో ఇంకా చౌక. అంతేగాదు అక్కడ బ్రిటన్‌ వాసులు కూడా ఈ సర్జరీ చేయించుకుని పలు అనారోగ్య సమస్యల బారిన పడటం లేదా మరణించడం జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 

ప్రతి ఏడాది ఈ శస్త్ర చికిత్స కోసమే సుమారు 5 వేల మందికి పైగా వ్యక్తులు విదేశాలకు వెళ్తున్నారని గణాంకాలు చెబుతున్నాయ్‌. తస్మాత్‌ జాగ్రత్త..!. ఆరోగ్యకరమైన రీతీలోనే బరువు తగ్గి..ఆరోగ్యంగా ఉందాం..!.

(చదవండి: అరే..! మరీ ఇలానా..! గర్ల్‌ఫ్రెండ్‌ కోసం ఎంత పనిచేశాడంటే.?)

 

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)