Breaking News

గంట ఆగిన గుండె... మళ్లీ కొట్టుకుంది!

Published on Fri, 03/01/2024 - 14:03

ఆ వ్యక్తి గుండె కొట్టుకోవడం అపేసింది.. ఇంకేముంది చనిపోయాడని అనుకున్నారందరూ. ఎలక్ట్రిక్‌ షాకిస్తే (డిఫిబ్రిలేషన్‌) గుండె మళ్లీ కొట్టుకుంటుందేమో అని ఆశించారు. వైద్యుల సాయంతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 17 షాకులిచ్చారు. అయినా... ఫలితం లేకపోయింది. ఇక లాభం లేదనుకున్న వైద్యులు.. అంతా అయిపోయిందని బంధువులకు చెప్పాలని అనుకుంటున్న సమయంలో జరిగిందో అద్భుతం! పదిహేడు వరుస షాకులకూ స్పందించని ఆ గుండె మళ్లీ లబ్‌ డబ్‌ అనడం ప్రారంభించింది! ఏమా అద్భుతం.. ఎక్కడ జరిగింది? కారణాలేమిటో తెలిశాయా? ఇవేనా మీ అనుమానాలు. తీర్చుకోవాలంటే చదివేయండి మరి!!!

గత ఏడాది జూన్‌లో యూకేలో జరిగిందీ ఘటన. ముప్ఫై ఒక్క ఏళ్ల పిన్న వయసులో బెన్‌ విల్సన్‌ రెండుసార్లు కార్డియాక్‌ అరెస్ట్‌ అంటే గుండె పనిచేయకుండా ఉండే పరిస్థితిని అనుభవించాడు. మొదటిసారి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు వైద్యులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. వరుసగా 11 షాకులిచ్చారు. ఇందుకు దాదాపు 40 నిమిషాల సమయం పట్టింది. హమ్మయ్యా బతికిపోయాడులే అనుకునేంతలోపే... విల్సన్‌కు రెండోసారి కార్డియాక్‌ అరెస్ట్‌ అయ్యింది. వైద్యులు మళ్లీ డీఫిబ్రిలేటర్‌తో షాకులివ్వడం మొదలుపెట్టారు. పదంటే పది నిమిషాల్లో ఏకంగా ఆరు షాకులిచ్చారు. అప్పటిగానీ విల్సన్‌ గుండె సాధారణ స్థితికి రాలేదు.!!

అంతేనా.. విల్సన్‌కు బాగైందా? అంటే అక్కడే ఇంకో ట్విస్టు ఉంది. పదిహేడు షాకులు తిన్న గుండె బాగా బలహీనంగా ఉండింది. పైగా గుండె పనిచేస్తోంది కానీ... మెదడుకు రక్తప్రసరణ జరగడం లేదు. పోనీ చికిత్స చేద్దామా అంటే తట్టుకునేంత శక్తి గుండెకు ఉందో లేదో తెలియని పరిస్థితి. ఈ దశలో వైద్యులు ఇంకో కీలక నిర్ణయం తీసుకున్నారు. విల్సన్‌ను కోమాలోనే ఉంచేద్దామని తీర్మానించారు. కోమాలోనే మెదడుకు ఆక్సిజన్‌ సక్రమంగా అందేలా చేశారు. ఇలా ఐదు వారాలపాటు చికిత్స అందించిన తరువాత కానీ విల్సన్‌ మామూలు మనిషి కాలేకపోయాడు. 

ఆ తర్వాత నెమ్మమదిగా నడవడం, మాట్లాడే సామర్థ్యాన్ని తిరిగి పొందాడు. ప్రస్తుతం అతను  కొద్దిపాటి జ్ఞాపకశక్తి సమస్యలను తప్పించి చాలావరకు అతని ఆరోగ్యం మెరుగుపడింది. ఈ మేరకు అతడి భార్య రెబెక్కా హోమ్స్‌ మాట్లాడుతూ .. ఆ సమయంలో తాను విల్సన్‌ పక్కనే ఉండిపోయానని,  "డ్రీమ్ ఎ లిటిల్ డ్రీమ్ ఆఫ్ మి" అనే మా పాటను పాడుతూ ఉన్నానని నాటి విషాదకర ఘటనను గుర్తు చేసుకుంది. తన దిండుపై తాను ఉపయోగించే స్ప్రేని కొట్టి..అతడు తన కోసం కొన్న టెడ్డీని అతడి పక్కనే ఉంచి వెనక్కి వచ్చేయి విల్సన్‌ అంటూ అతడివైపే చూస్తూ ఉండిపోయానని చెప్పుకొచ్చింది. తన ప్రేమే అతడిని ఈ విపత్కర పరిస్థితి నుంచి ప్రాణాలతో బయటపడేలా చేపిందని ఆనందంగా చెబుతోంది. అతను తనను ఎంతగానో ప్రేమించేవాడిని, ఈ కష్టకాలంలో అతడి పక్కనే ఉండి ఆ ప్రేమనంత తాను తిరిగి అతడికి అందించానని ఉద్వేగంగా చెప్పింది రెబెక్కా. ఏదీఏమైన ఈ ఘటన మెడికల్‌ మిరాకిల్ అని చెప్పొచ్చు. 

(చదవండి: ప్రపంచంలో అత్యధికంగా ఇష్టపడే మాంసం ఏదో తెలుసా! భారత్‌లో ఏది ఇష్టపడతారంటే..)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)