Breaking News

‘బాహుబలి ఫ్యామిలీ’ నెట్టింట వైరల్‌, ఎవరీ గేమ్‌ ఛేంజర్‌!

Published on Thu, 12/26/2024 - 17:56

ఒక భార్య, ఓ నలుగురో , ఐదుగురో  కొడుకులు, కుమార్తెలు,20-30 మంది మనవలు మనవరాళ్లతో అలరారే కుటుంబాన్ని పెద్ద కుటుంబం అంటూ ఉంటాం.  మరి  12 మంది భార్యలు, 102 మంది పిల్లలు , 578 మంది మనవళ్లు ఉన్న ఫ్యామిలీని  ఏమని పిలవాలి? 12 మంది భార్యలా? 102 మంది సంతానమా అని నోరెళ్ల బెట్టకండి.   నిత్యం ఆకలి , కరువుతో సతమతమయ్యే ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఉగాండాలో ఉందీ బాహుబలి ఫ్యామిలీ.

తూర్పు ఉగాండాలోని ముకిజాకు చెందిన 70 ఏళ్ల ముసా హసహ్య కసేరా (MusaHasahyaKasera) ఈ జెయింట్‌ ఫ్యామిలీకి మూల పురుషుడు. ఈయనకు సంబంధించిన వీడియో ఒకటి  నెట్టింట తెగ సందడి చేస్తోంది. 'దిఇండోట్రెక్కర్' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్  అయిన ఈ వీడియోకు ఒక్క రోజులోనే 8.6 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

1972లో 17  ఏళ్ల వయస్సులో వివాహం చేసుకోవడంతో అతని పెళ్లిళ్ల పరంపర మొదలైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 మందిని వివాహం చేసుకున్నాడు. వీరికి 102 మంది పిల్లలు పుట్టారు. అంటే  ఒక్కో భార్యకు దాదాపు తొమ్మిది మంది.  అంతేనా మరో   578 మంది వారసులకు తాత  కూడా.  దశాబ్దాలుగా, అతని కుటుంబం అలా విస్తరిస్తూ పోయింది. అతని పిల్లలు ఇప్పుడు 10 - 50 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నారు. అతని భార్యలలో చిన్న ఆమెకు  35 ఏళ్ల వయస్సు.  ఇపుడు ఈ సంతానం  కడుపు నింపేందుకు నానా పాట్లు పడటమే కాదు, మనవలు,మనవరాళ్ల పేర్లు గుర్తు పెట్టుకోవడం కూడా కష్టంగా ఉందట ముసాకు. అందుకే ఒక  రిజిస్టర్‌ను మెయింటైన్‌ చేస్తున్నారు.

అతనికున్న ఆస్తల్లా శిథిలావస్థలో ఇల్లు. రెండు ఎకరాల భూమి. దీంతో ఇల్లు గడవక చాలా కష్టపడుతున్నామని వాపోయింది  మూడో భార్య జబీనా. పిల్లలు, మనుమలు చేతికి వచ్చిన పని చేస్తారు. మరికొందరు కుటుంబం కోసం నీళ్లు  కట్టెలు తీసుకురావడానికి వారి రోజులు గడుపుతారు. వీరందరూ  కడుపు నిండా భోంచేయండం కూడా గగనమే. 

మరోవైపు అతని ఆరోగ్యం క్షీణించడం, ఇంత పెద్ద ఇంటిని నిర్వహించడం కష్టంగా ఉండటంతో, అతని ఇద్దరు భార్యలు వెళ్లిపోయారు. టీచర్‌గా పనిచేస్తున్న అతని కుమారుడు షాబాన్ మాజినో(30) కుటుంబ నిర్వహణలో సహాయం చేస్తాడు.

దీంతో  నెటిజన్లు  ఛలోక్తులతో సందడి చేస్తున్నారు. 'ప్రపంచంలో ఎక్కువ మంది పిల్లలను ఉత్పత్తి చేసిన వ్యక్తి'  ఒకరు, “ఇస్కో పరివార్ క్యోం బోల్తే హో ...? జిల్లా ఘోషిత్ క్యోం నహీ దేతే.” (వీళ్లని  కుటుంబమని అంటారేంటి...జిల్లాగా ప్రకటించాలి) అంటూ వ్యాఖ్యానించారు. బాహుబలి ఫ్యామిలీ, తాతగారు గేమ్‌ ఛేంజర్‌ అంటున్నారు.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)