Breaking News

షడ్రుచుల ఉగాదికి..ప్రకృతే పరవశించేలా ఈ చేనేత చీరల్లో మెరుద్దాం..!

Published on Fri, 03/28/2025 - 10:29

పచ్చని తోరణాలు.. షడ్రుచుల ఆస్వాదన.. సంప్రదాయ వస్త్రధారణ ఉగాదికి స్వాగతం పలుకుతూ కొత్త ఉత్సాహాన్ని మదికి మోసుకువస్తాయి. చేనేత చీరలు, ఎంబ్రాయిడరీ సొగసులు వాటి రంగుల హంగులు ప్రకృతి పరవశించేలా పండగకు మరింత శోభను తీసుకువస్తాయి. ముఖ్యంగా పసుపు, ఆరెంజ్, ఆకుపచ్చ, ఎరుపు రంగులు పండగ కళను రెట్టింపుగా మన కళ్లకు కడతాయి. 

చేనేత కళ
పండగ నాడు కళను రెట్టింపు చేసే అలంకరణకు ప్రాముఖ్యత ఇస్తుంటారు. అయితే, అందుకు పెద్ద హడావిడి లేకుండా మనవైన చేనేతలలో కాంతిమంతమైన రంగులున్న చీరలను ఎంపిక చేసుకోవచ్చు. వీటిలో కంచిపట్టు చీరల నుంచి కలనేత వరకు అన్నీ పండగను వెలిగించేవే.

సహజమైన రంగులు
ప్రకృతి నేపధ్యంగా ఉగాది జరుపుకుంటారు కాబట్టి పసుపు, ఆకుపచ్చ, నారింజ, ఎరుపు రంగుల కాటన్, తెలుపు, ఎరుపు కాంబినేషన్, పింక్‌ కలర్‌ టస్సర్, సిల్క్‌ చీరలు ప్రత్యేక ఆకర్షణతో ఆకట్టుకుంటాయి. 

డిజైన్లు
చెక్స్, లైన్స్‌తో ఉన్న డిజైన్లు, మెరుపులు లేకుండా థ్రెడ్‌ ఎంబ్రాయిడరీ వర్క్, సహజంగా అనిపించే పెయింటింగ్స్‌ ఈ పండగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 

ఇతర అలంకరణలు..

  • చీరలకు లాంగ్‌ స్లీవ్స్‌ బ్లౌజులు, టెంపుల్‌ జ్యువెలరీ లేదా థ్రెడ్, టెర్రకోట జ్యువెలరీ బాగుంటాయి. 

  • పసుపు, ఎరుపు కాంబినేషన్‌ ప్లెయిన్‌ గాజులు, సహజంగా అనిపించేలా తక్కువ మేకప్‌ ప్రత్యేకతను చూపుతుంది.

  • శిరోజాల అలంకరణలో జడ, కొప్పులు, పువ్వులకు ప్రాధాన్యమిస్తే పండగ ప్రకృతి కళతో ఆకట్టుకుంటుంది. 

(చదవండి: అందంగా ఉండాలంటే..సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి..!)
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)