Breaking News

వర్క్-లైఫ్ బ్యాలెన్స్: సాధ్యమేనా? లేక అపోహనా?

Published on Sun, 02/08/2026 - 07:00

"ఆఫీసులో ఉన్నప్పుడు ఇంటి పనులు గుర్తుకొస్తాయి.. ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీసు ఫైళ్లు కళ్లముందు కదులుతాయి." ఇదీ ఈ తరం ఉద్యోగి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. చాలామందికి 'వర్క్-లైఫ్ బ్యాలెన్స్' అనేది కేవలం పుస్తకాల్లో కనిపించే పదంలా, లేదా కార్పొరేట్ కంపెనీలు గోడల మీద తగిలించే పోస్టర్‌లా మాత్రమే మిగిలిపోయింది. అసలు ఈ బ్యాలెన్స్ సాధ్యమేనా? లేక అదో అందని ద్రాక్షా?

బ్యాలెన్స్ అంటే 50-50 కాదు!
చాలామంది 'బ్యాలెన్స్' అంటే 24 గంటలను సమానంగా ఆఫీసుకి, ఇంటికి పంచడం అనుకుంటారు. కానీ సైకాలజీ ప్రకారం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అంటే సమయాన్ని పంచడం కాదు..'ప్రెజెన్స్' (ఉనికిని)పంచడం. అంటే ఆఫీసులో ఉన్నప్పుడు 100శాతంఅక్కడే ఉండటం, ఇంటికి వచ్చాక ఆఫీసు ఆలోచనల నుంచి 100శాతంబయటపడటం. అది లేనప్పుడే అసలైన ఒత్తిడి మొదలవుతుంది.

నా దగ్గరికి వచ్చిన ఒక సాఫ్ట్‌వేర్ మేనేజర్ కిరణ్ (పేరు మార్చాను) అనుభవమే దీనికి నిదర్శనం. కిరణ్రోజూ 12 గంటలు పని చేస్తాడు. "నా భార్యాపిల్లల కోసమే కదా ఇంత కష్టపడుతున్నాను" అంటాడు. కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కూడా అతని చేతిలో ఫోన్, మెదడులో ప్రాజెక్ట్ డెడ్ లైన్లు ఉంటాయి. పిల్లలు ఏదైనా అడిగితే చిరాకు పడతాడు. ఫలితంగా, అతను భౌతికంగా ఇంట్లోనే ఉన్నా, మానసికంగా ఎప్పుడో ఆఫీసుకి వెళ్ళిపోయాడు. ఇక్కడ సమస్య 'సమయం' కాదు.. 'మెంటల్ స్విచ్ ఆఫ్' చేయలేకపోవడం.

బ్యాలెన్స్ ఎందుకు దెబ్బతింటోంది?
•    డిజిటల్ కనెక్షన్:వాట్సాప్ గ్రూపులు, ఈమెయిల్ నోటిఫికేషన్లు ఆఫీసుని మన బెడ్‌రూమ్ దాకా తీసుకొచ్చాయి.
•    గిల్ట్ (అపరాధ భావం): "నేను ఆన్ లైన్ లో లేకపోతే పని ఆగిపోతుందేమో" లేదా "నా బాస్ ఏమనుకుంటారో" అన్న భయం.
•    ‘నో’చెప్పలేకపోవడం:మన శక్తికి మించిన బాధ్యతలను మొహమాటానికి ఒప్పుకోవడం.

'బ్యాలెన్స్' సాధించడానికి 5 ప్రాక్టికల్ టిప్స్
1.    Mental Gateway:ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే దారిని ఒక వంతెనలా వాడుకోండి. ఆ ప్రయాణంలో సంగీతం వినడమో, లేదా ఆ రోజు జరిగిన పనుల గురించి ఆలోచనలను అక్కడే క్లోజ్ చేయడమో చేయండి. ఇంటి తలుపు తీసే ముందే ఆఫీసు టెన్షన్లను బయటే వదిలేయండి.
2.    Tech-Free Zone:రాత్రి భోజనం చేసేటప్పుడు లేదా పిల్లలతో ఆడుకునేటప్పుడు ఫోన్ ని పక్క గదిలో ఉంచండి. నోటిఫికేషన్ల శబ్దం మీ ప్రశాంతతను దోచుకోకుండా చూసుకోండి.
3.    Quality Vs Quantity:మీరు కుటుంబంతో ఎన్ని గంటలు ఉన్నారన్నది కాదు.. ఉన్న ఆ కాసేపు ఎంత quality time గడిపారన్నదే ముఖ్యం. రెండు గంటలు ఫోన్ పక్కన పెట్టుకుని కూర్చోవడం కంటే, ఫోన్ చూడకుండా 20 నిమిషాలు మీ భాగస్వామితో, పిల్లలతో మాట్లాడటం ఎంతో మేలు.
4.    Boundaries:పని వేళలు ముగిశాక, అత్యవసరమైతే తప్ప కాల్స్/మెయిల్స్ కి అటెండ్ అవ్వకూడదనే నియమాన్ని మీ బాస్ కి, కొలీగ్స్ కి సున్నితంగా చెప్పండి. మీ ప్రైవేట్ టైమ్ ని మీరు గౌరవిస్తేనే, ఇతరులు గౌరవిస్తారు.
5.    Self-Care:ఖాళీ గ్లాసుతో ఇతరుల దాహం తీర్చలేం. మీకు ఇష్టమైన హాబీని పాటించడం లేదా వ్యాయామం చేయడం వల్ల మీ 'ఎనర్జీ లెవల్స్' పెరుగుతాయి. అప్పుడు మీరు ఆఫీసులోనూ, ఇంట్లోనూ యాక్టివ్ గా ఉండగలరు.

మీ కోసం ఒక సెల్ఫ్-చెక్
గత వారం రోజుల్లో, మీరు ఏకాగ్రతతో మీ కుటుంబ సభ్యుల కళ్లలోకి చూస్తూ కనీసం 10 నిమిషాలు మాట్లాడారా? లేకపోతే, మీరు బ్యాలెన్స్ తప్పుతున్నారని అర్థం.

గుర్తుంచుకోండి.. మీరు ఉద్యోగం మానేస్తే మీ సీటును భర్తీ చేయడానికి కంపెనీకి వారం రోజులు పట్టదు. కానీ మీ కుటుంబంలో మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. కెరీర్ లో ఎదగండి.. కానీ ఆ క్రమంలో మీ జీవితాన్ని కోల్పోకండి. అవసరమనిపిస్తే సైకాలజిస్ట్ లేదా కెరీర్ కోచ్ సహాయం తీసుకోండి.

సైకాలజిస్ట్ విశేష్
కెరీర్&మైండ్‌సెట్ కోచ్
8019 000067
www.psyvisesh.com

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)