వర్షాకాలంలో తులసి మొక్కను ఇలా పెంచడమే మంచిది..

Published on Tue, 08/11/2026 - 09:46

తులసి మొక్కకు వర్షాకాలం అనుకూలమైన సమయం. వాతావరణంలో తేమ, చల్లదనం ఉండటంతోపాటు మొక్క వేగంగా కొత్త ఆకులు, కొమ్మలు వేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే, అధిక వర్షం, నీరు నిలిచిపోవడం, సూర్యరశ్మి తగ్గడంతో తులసి మొక్క బలహీనపడుతుంది. అయితే, ఇంట్లో తులసి మొక్కను పచ్చగా, ఆరోగ్యంగా, దట్టంగా పెంచుకోవాలంటే ఈ సీజన్‌లో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

సూచనలు.. జాగ్రత్తలు..

  • తులసి మొక్కను దట్టంగా పెంచడానికి పైభాగంలో పెరుగుతున్న చివరి కొనలను అప్పుడప్పుడు చేతితో స్వల్పంగా తెంచేయాలి. దీంతో కిందివైపు కొత్త కొమ్మలు రావడం ప్రారంభిస్తాయి. మొక్క ఒకే కాడలా పైకి పెరగకుండా గుబురుగా మారుతుంది.

  • తులసి చెట్టు పువ్వులు కాసినప్పుడు వాటిని కూడా ఎప్పటికప్పుడు తొలగించవచ్చు. ఇలా చేయడంతో కొత్త ఆకులు, కొమ్మల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అయితే విత్తనాలకై కొన్ని పువ్వులను తెంచకుండా ఉంచితే చాలు.

  • వర్షాకాలంలో ఈ చెట్టుకి నీరు ఎక్కువగా అందడం పెద్ద సమస్యగా మారవచ్చు. దీంతో కుండీలో నీరు నిలిచి చెట్టువేర్లకు సరైన ఆక్సిజన్‌ ఆందక చెట్టు కాడ నల్లగా మారుతుంది. మట్టి తడిగా ఉన్నట్లయితే మళ్లీ నీరు పోయాల్సిన అవసరం ఏమాత్రం లేదు.

  • నీరు పోసే ముందు మట్టిని వేలితో తాకి చూడాలి. పై పొర పొడిగా అనిపిస్తేనే నీరు అందించాలి. అలాగే పోసిన నీరు నెమ్మదిగా బయటకు వెళ్లేందుకు కుండీ అడుగున చిన్న చిన్న రంధ్రాలు తప్పనిసరిగా ఉండాలి. నీరు ఎక్కువసేపు నిలిచిపోతే తులసి వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.

  • తులసి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి తగినంత వెలుతురు అవసరం. అలాగే ప్రతిరోజూ కొన్ని గంటలు(4-6) సూర్యరశ్మి తగిలేలా చూడాలి. అయితే వర్షాకాలంలో ఆకాశం నల్లని మబ్బులతో కూడుకుని ఉండటంతో.. సూర్యకిరణాలు నేరుగా అందకపోవచ్చు. వాటికి బదులుగా మొక్కకు వీలైనంత ఎక్కువ సహజ వెలుతురు అందే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. దీంతో ఆకుల రంగు బాగుండటంతోపాటు కొత్త కొమ్మలు, మొక్క పెరుగుదల కూడా మెరుగ్గా ఉంటుంది.

  • తులసికి కేవలం ఎరువు వేయడమే కాకుండా.. కుండీలోని మట్టి ఎక్కువ నీరును పిల్చేదిగా ఉండకూడదు. అయితే, ఆ మట్టిలో తక్కువగా ఇసుక, కుళ్లిన సేంద్రియ ఎరువును కలపవచ్చు. దీంతో మట్టి మరీ బరువుగా మారకుండా ఉండటంతో వేర్లకు గాలి బాగా అందుతుంది.

  • తులసి మొక్క పెరుగుతున్నప్పుడు పోషకాలు కూడా అవసరం. అప్పుడప్పుడు కొద్దిమొత్తంలో వర్మీకంపోస్(Vermicompost) లేదా బాగా కుళ్లిన సేంద్రియ ఎరువును మట్టిలో కలపవచ్చు. ఎరువును ఎక్కువగా వేయడంతో ప్రయోజనం కంటే నష్టమే అధికంగా ఉంటుంది. దాంతో మొక్కకు తగిన మోతాదులో ఎరువును వేయడమే మంచిది.

  • వర్షాకాలంలో తేమ పెరగడంతో తులసి ఆకులు, కాండంపై చిన్న చిన్న పురుగులు లేదా ఫంగస్‌ సమస్యలు తరచూ వస్తూంటాయి. అందుకు వారానికి ఒకటి, రెండుసార్లు ఆకులు, కాండాన్ని పరిశీలించాలి. ఆకులపై పురుగులు కనిపిస్తే వేప నూనె ఆధారిత స్ప్రే వంటి సహజ నియంత్రణ పద్ధతులను ఉపయోగించవచ్చు.

  • తులసికి పూలగుత్తులు రావడం సహజమే. అయితే మొక్కను మరింత దట్టంగా, ఆకులతో నిండుగా పెంచుకోవాలనుకుంటే.. ఎక్కువగా ఉన్న పాత పుష్ప గుత్తులను ఎప్పటికప్పుడు తొలగించడం ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఎండిపోయిన, దెబ్బతిని పసుపు రంగులోకి మారిన ఆకులను కూడా తొలగిస్తూ ఉండాలి.

వర్షాకాలంలో తులసి సంరక్షణ అంటే.. కేవలం నీరు, ఎరువు ఇవ్వడమేకాదు, సరైన వెలుతురు, పరిమిత నీరు, మంచి నాణ్యతగల మట్టి(ఎర్రమట్టి), ఎప్పటికప్పుడు పించింగ్‌, సమతుల్యమైన పోషణ వంటి కీలకమైన జాగ్రత్తలతో మొక్క మరింత ఆరోగ్యంగా, దట్టంగా పెరిగే అవకాశం ఉంటుంది.

భారతీయ కుటుంబాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. పూజా స్థలంలో, ఇంటి ఆవరణలో పెంచుకునే తులసిని ప్రేమగా సంరక్షించడం ప్రతీ కుటుంబంలో ఒక మంచి సంప్రదాయం. అయితే, వర్షాకాలంలో మాత్రం ఎక్కువ శ్రద్ధ పేరుతో ఎక్కువ నీరు పోయకుండా ఉండటమే మరో ముఖ్యమైన జాగ్రత్త.

Videos

భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు

చిరు NEXT మూవీ టైటిల్ లీక్.. వద్దు వద్దు అంటున్న ఆపుకోలేక నోరు జారిన చిరంజీవి

ఆ సీఐ చుట్టూ కూటమి రాజకీయం..!

LB నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

కేకును కోస్తే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించారు.. మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపేస్తే మాత్రం వారిని

నేడు MLA, MLCలతో వైఎస్ జగన్ కీలక సమావేశం

నా కాలు విరిగినా.. నా ప్రాణం పోతాదన్నా జగనన్న కోసం ఎలాంటి కష్టానైనా...

EVM ట్యాపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబే చెప్పాలి..! ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్

నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు

Photos

+5

హైదరాబాద్‌లో మొదలైన వినాయక చవితి 2026 సందడి (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌...(ఫొటోలు)

+5

‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)

+5

హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)

+5

ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)

+5

ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)

+5

యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)

+5

‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)