Breaking News

‘మేరోరపి సారతరా భక్తిః : నిజమైన భక్తి

Published on Thu, 07/17/2025 - 12:24

‘మేరోరపి సారతరా భక్తిః.’ అంటే భక్తి మేరు పర్వతం కంటే కూడా మిక్కిలి శక్తి కలదీ, ఉన్నతమైనదీ అని అర్థం. సర్వము భగవద్విలసితంగా భావించి, ఆ భావనతో ఆత్మార్పణ చేసుకొనే పరిశుద్ధ స్థితి భక్తికి పరాకాష్ఠ. ఇదే నిజమైన భక్తి! గురుభక్తి కూడా  ఇంతే! గురువునే దైవ భావంతో ఆరాధిస్తూ, ఆయన ఆజ్ఞాపాలన చేస్తూ జీవితాన్ని కైంకర్యం చేసుకోవటం నిర్దుష్టమైన భక్తికి సరిహద్దు. 

భగవదనుభూతికి అనేక మార్గాలు న్నాయి. కానీ అందరికీ అందుబాటులో అనుసరణీయమైన మార్గం మాత్రం భక్తి మార్గమే. విభిన్న రుచులు గల మానవుల మనస్సుకు నచ్చిన విధంగా స్వీకరించదగిన విధానాలు భక్తిమార్గంలో ఉన్నాయి. అవే నవవిధ భక్తి మార్గాలు: ‘శ్రవణం కీర్తనం విష్ణోఃస్మరణం పాదసేవనం అర్చనంవందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనమ్‌’ అని శ్రవణ కీర్తనాదులు చెప్పబడినాయి. ఆ యా భక్తుల రుచులను అనుసరించి ఈ నవవిధాలు అనుసరింపబడతాయి. భక్తి అనేది శ్రవణంతో ప్రారంభమై బలపడుతూ, చివరిదైన ఆత్మనివేదనంతో పరిపూర్ణం అవుతుంది. అత్మనివేదనం గల భక్తులకూ భగవంతునికీ భేదమే కనబడదు. ఈ విషయంలో గోపికల భక్తి ఉదాహరణగా తీసుకోవచ్చు. 

ఇదీ చదవండి: భారతీయులకు గుడ్‌ న్యూస్‌.. రూ.7500కే వీసా : ఎవరికి? ఎలా? ఎక్కడ?

‘ఓ అర్జునా! నా సేవ కోసమే గోపికలు తమ శరీరాన్ని రక్షించు కొంటున్నారు. అందువల్లనే నిగూఢమైన నా ప్రేమకు వారు పాత్రు లయ్యారు’ అని కృష్ణ పరమాత్మ అర్జునునితో అంటాడు.  అలాగే దాన ధర్మాలు చేసినా... భక్తి భావంతో ప్రతిగ్రహీతను విష్ణువుగా భావించి దానమిస్తే దానికి విలువ ఉంటుంది. ఒక రోజు ఓ రాజసభలో ఉన్న సాధువుతో ‘నేను తల్చుకుంటే మిమ్మల్ని గొప్ప సంపన్నుణ్ణి చేయగలను’ అన్నాడు రాజు. సాధువు ఆ మాటకే మాత్రం పొంగిపోకుండా: ‘రాజా! దయవుంచి ఒక కాటా తెప్పించండి. అందులో ఒక వైపు నాకీయదలచిన సంపద ఉంచండి’ అని అన్నాడు. దానికి రాజు సరే అని వెంటనే ఆ యేర్పాటు చేశాడు. నగలు, నాణాలు, బంగారం, వజ్రాలు వంటి వెన్నో ఒక వైపు ఉంచాడు. అప్పుడు సాధువు చిరునవ్వుతో ఒక చిన్న ఆకును తెచ్చి ఆ రెండవ తక్కెటలో వేశాడు. అంతే కాటాలో వేసిన రాజుగారి సంపదకంతా ఈ ఆకు సమానంగా తూగింది. కాస్త మొగ్గు కూడా ఉంది. రాజుకు గర్వ భంగం అయింది. నిజమైన భక్తునికి ప్రతి జీవిలోనూ అంతర్యామిగా భగవంతుడే కనబడతాడు. నిజమైన భక్తుల్లో చివరికి ఆత్మజ్ఞానం సుసంపన్నమైన వాళ్లు మోక్షా ర్హులవుతారు అని స్వామీజీ అనుక్షణం ప్రబోధిస్తుంటారు.
జయ గురు దత్త!

-శ్రీ గణపతిసచ్చిదానందస్వామి 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)