Breaking News

నేషనల్ క్రష్ త్రిప్తి డిమ్రీ ఫిట్‌నెస్‌ సీక్రెట్ వెపన్ ఇదే!

Published on Thu, 03/13/2025 - 15:37

అందాల హీరోయిన్‌ త్రిప్తి దిమ్రి(Triptii Dimri) కేవలం  బ్యూటీకే కాదు.  ఫిట్‌నెస్‌కు కూడా చాలా ప్రాముఖ్యతనిస్తుంది.  అద్భుతమైన నటనతో పాటు,  టోన్డ్ ఫిగర్‌తో  ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేస్తుంది. తాజా తన ఫిట్‌నెస్‌  గురించి సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టింది. ఇది ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది.

రణబీర్ కపూర్ సరసన నటించిన  యానిమల్‌ మూవీతో ఆకట్టుకున్న  త్రిప్తి దిమ్రీ తన మంచి ఆహార ప్రియురాలు. అలాగే యోగా, ధ్యానం,జిమ్‌ వర్కౌట్స్‌ను  అంతే శ్రద్ధగా ఆచరిస్తుంది. తాజాగా ఫిట్‌నెస్ ఫార్ములా గురించి ఇన్‌స్టా  స్టోరీలో  వివరించింది. స్వెట్‌ ఫస్ట్‌.. స్వీట్స్‌...‍స్వీట్స్‌ లేటర్‌ (Sweat Now...Sweets Later)అంటూ ఫోటోను షేర్‌ చేసింది. వింక్‌ ఎమోజీతో జిమ్ మిర్రర్ సెల్ఫీని పోస్ట్‌  చేసింది. హోలీ పండుగ సీజన్‌లో అదనపు కేలరీలన్నింటినీ కోల్పోవడానికి ఆమె తన జిమ్ వర్కౌట్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. 

ఇటీవల త్రిప్తి దిమ్రీ నాసిక్‌లోని త్రయంబకేశ్వరాలయాన్ని సందర్శించింది. అక్కడ ప్రత్యేకపూజలు నిర్వహించింది.  దీనికి సంబంధించిన  ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది కూడా. 

ఫిట్‌గా ఉండేందుకు మూడు టిప్స్‌ 

స్క్వాట్ జంప్ : స్క్వాట్ జంప్‌లు లేదా జంపింగ్ స్క్వాట్‌లు. ఇవి ఎక్కువ కేలరీలను బర్న్‌ చేయడంలో  చాలా బాగా ఉపయోగ పడతాయి. జంప్ స్క్వాట్స్ లేదా జంపింగ్ స్క్వాట్స్ అని కూడా అంటారు. ప్రతి ఫిట్‌నెస్ క్లాస్‌లో ఏదో ఒక రకమైన స్క్వాట్ ఉంటుంది.దీని వల్ల కేలరీలు త్వరగా బర్న్ అవుతాయి. ఒకేసారి బహుళ కండరాలనుబలోపేతం చేసేందుకు ఉపయోగ పడుతుంది.   ముఖ్యంగా కాళ్లు, పిరుదులు . కోర్ కండరాలు బలోపేతమవుతాయి. 

బర్పీ:  స్ట్రెంథ్ ట్రైనింగ్‌లో ఒకటిగా చెప్పుకునే బర్పీస్ , ఫుల్ బాడీ వర్కౌట్‌ అని చెప్పొచ్చు. వీని వల్ల మజిల్ స్ట్రెంథ్ పెరుగుతుంది. 
కేలరీలు కరుగుతాయి, చాలా బరువు తగ్గుతారు.బెల్లీ ఫ్యాట్, హిప్, థై ఫ్యాట్ తగ్గి  టోన్డ​్‌ బాడీ వస్తుంది. 

స్కిప్పింగ్: స్కిప్పింగ్ అనేది సరళమైన, ఈజీ ఎక్సర్ సైజులలో ఒకటి. 10 నిమిషాలు లేదా దాదాపు 120 రౌండ్ల  స్కిప్పింగ్‌ వల్ల   650 నుండి 1000 కేలరీలు ఖర్చవుతాయి. కేలరీలు బర్న్ అవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలు టోన్ అవుతాయి. జీవక్రియ పెరుగుతుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఏకాగ్రత మెరుగుపడుతుంది.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)