Breaking News

ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్..2024లో జర్నీలకే రూ. 50 లక్షలు : నెటిజనులు షాక్‌

Published on Tue, 01/07/2025 - 14:04

ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ శరణ్య అయ్యర్‌ పోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌. తాజాగా '2024లో నేను ఎంత ఖర్చు చేశాను'  అనే క్యాప్షన్‌తో  ఒక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.  తన డబ్బులో ఎక్కువ భాగం ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణించడానికి ఖర్చు చేసినట్లు వెల్లడించింది. ఒక్క ఏడాదిలోనే తన   ప్రయాణాలకు రూ. 50 లక్షలు ఖర్చుపెట్టినట్టు తెలిపింది. అంతేకాదు రూ. 22 లక్షలతో  హ్యందాయ్‌ కారు కొనుక్కొంది. దీంతో నోరెళ్ల బెట్టడం ఫాలోయర్ల వంతైంది. అంత డబ్బు ఎక్కడినుంచి నెటిజన్లు వచ్చిందంటూ ప్రశ్నలు కురిపించారు.  ఇన్‌స్టాగ్రామ్‌లో శరణ్య అయ్యర్ పోస్ట్  వైరల్ అయ్యింది. 1.3 మిలియన్లకుపైగా వ్యూస్‌ వచ్చాయి. అసలింతకీ  స్టోరీ ఏంటంటే..

ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ శరణ్య అయ్యర్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో   5లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తరచూ ట్రావెల్‌ వీడియోను పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఒక  రీల్‌ను షేర్‌ చేసింది.ఇందులో  ఒక్క ప్రయాణానికే రూ. 50 లక్షలు.ఖర్చు చేసినట్లు వెల్లడించింది.  గత ఏడాదిలో ఆరుకుపైగా దేశాలను  చుట్టివచ్చిందట. ఇందులో భాగంగా విమాన ఖర్చులకే రూ. 5 లక్షలు వెచ్చించినట్టు చెప్పుకొచ్చింది. మిగిలిన మొత్తంలో ఎక్కువ భాగం వసతి మిగతా ఖర్చులున్నట్టు తెలిపింది. దీంతోపాటు కొత్త హ్యుందాయ్ కారును కూడా కొనుగోలు చేసినట్లు శరణ్య వెల్లడించింది. గత ఏడాది కష్టతరంగా గడిచినప్పటికీ, ఎంతో సంతోషాన్ని, భరోసాన్నిచ్చిందని చెప్పుకొచ్చింది. 2025లో ఇంత ఖర్చుపెట్టను.. కాస్త పొదుపు చేస్తానని కూడా తెలిపింది. 

ఇదీ చదవండి: ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్..2024లో జర్నీలకే రూ. 50 లక్షలు : నెటిజనులు షాక్‌

శరణ్య అయ్యర్ ఖర్చులు
శరణ్య అయ్యర్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన వీడియో ప్రకారం, లావోస్ , థాయిలాండ్  ట్రిప్‌కోసం, 1 లక్ష, రూ. మదీరాకు 1.5 లక్షలు, రూ. తన తల్లిదండ్రులతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనకు  రూ.8 లక్షలు, రూ. గ్రీన్‌ల్యాండ్‌లో 3 లక్షలు, మూడుసార్లు ఐస్‌లాండ్‌ పర్యటన ఖర్చు రూ2.5 లక్షలు అయింది.  అలాగే యూరప్‌ ట్రిప్‌ రూ. 60,000  ఖర్చు. అయితే క్యాసినోలో 40 వేలు గెలిచినట్లు  పేర్కొంది.అంతేకాదు  ఇంకా ఇన్సూరెన్స్ కవర్ చేయని వైద్య ఖర్చులపై 5 లక్షల రూపాయలు ఖర్చుపెట్టిందట.   ఈ మొత్తం ఖర్చులో ఫుడ్‌ రోజువారీ ఖర్చులు , షాపింగ్ ఖర్చులను తన జాబితాలో చేర్చలేదంటూ లెక్కలు చెప్పింది.

 నెటిజన్లు  ఏమన్నారంటే
" ఇంత ఖర్చును భరించారు.. అదృష్టవంతులు.. ఇంతకీ మీ ఆదాయ వనరు ఏమిటి?  అని  ఒకరు. ఈ రీల్ తర్వాత  పాపం మిగిలిన ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్లు  బాధపడతారంటూ ఫన్నీగా  కమెంట్‌ చేశారు.  ఇంత తక్కువ బడ్జెట్‌తో ఐస్‌ల్యాండ్‌ని మూడుసార్లు ఎలా అబ్బా అని   మరొకరు ప్రశ్నించగా,  స్పాన్సర్లు లభించారంటూ సమాధానం చెప్పింది శరణ్య. 

 

Videos

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)