Breaking News

‘ఉచిమిజు’..మండు వేసవిలో కూడా చల్లదనాన్ని ఆస్వాదించొచ్చు..!

Published on Wed, 04/16/2025 - 09:19

జపనీయులు సాంకేతికంగా ఎంత ముందు ఉన్నా సంప్రదాయ పద్ధతులకు మాత్రం వీడ్కోలు చెప్పలేదు. అందులో ఒకటి... ఉచిమిజు. ‘ఉచి’ అంటే కొట్టడం లేదా తాకడం. ‘మిజు’ అంటే నీరు. ‘ఉచిమిజు’ అంటే నీటితో భూమిని తాకడం.

వేడి వేసవి నెలల్లో ‘ఉచిమిజు’ అనేది సాధారణ దృశ్యం. వీధులు, బహిరంగ ప్రదేశాలలో నీటిని చల్లుతారు. ‘ఉచిమిజు’తో నీటి బాష్పీభవనం ద్వారా చుట్టుపక్కల వాతావరణాన్ని చల్లబరుస్తారు. ఈ పద్ధతి గ్రీన్‌హౌజ్‌ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుంది.

గ్లోబల్‌ వార్మింగ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ‘ఉచిమిజు’ను ప్రోత్సహించడానికి ప్రభుత్వంతో పాటు పర్యావరణ సంస్థలు నడుం బిగించాయి. వేసవిలో సామూహిక ఉచిమిజు కార్యక్రమాలు నిర్వహిస్తారు.

యుకాటా, జీన్బీ అనేవి జపనీస్‌ వేసవి దుస్తులు. కంఫర్ట్, వెంటిలేషన్‌ వీటి ప్రత్యేకత. కాటన్‌తో తయారు చేసే ఈ సంప్రదాయ దుస్తులు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఉపయోగపడతాయి.

సంప్రదాయ సుడేర్‌ స్క్రీన్‌లు శతాబ్దాలుగా జపనీస్‌ గృహాలలో అంతర్భాగం అయ్యాయి. వెదురు పలకలు, నాచులతో కలిపి అల్లిన స్క్రీన్‌లు ఇవి. వేసవి నెలల్లో తీవ్రమైన వేడి ప్రభావం ఇంటి లోపలి భాగాలపై పడకుండా సుడేర్‌ స్క్రీన్‌లు ఉపయోగిస్తారు. ఇవి వేడి నుంచి ఉపశమనం ఇవ్వడమే కాదు కళాకృతులుగా కూడా ఆకట్టుకుంటాయి. 

(చదవండి: హాట్సాప్‌ అన్నపూర్ణ ..! రియల్‌ ‘లేడి సింగం’)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)