ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు చంపేశాడు
Breaking News
ప్రకృతి, హిమాలయాల అనుభవం కోసం ఆ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..!
Published on Mon, 04/06/2026 - 17:13
ఫస్ట్ టైమ్ యూరోప్‌కి వెళ్లాలని ప్లాన్ చేసే వారికి టిబిలిసి ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఫ్లైట్ దిగిన వెంటనే సిటీ వైబ్ చాలా కామ్‌గా, రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఎక్కడా ఎక్కువ రష్ లేకుండా స్మూత్‌గా అడ్జస్ట్ అయ్యే ప్లేస్‌లా ఫీలవుతారు.
సిటీలో వాక్ చేస్తుంటే పురాతన భవనాలు, రంగురంగుల బాల్కనీలు, కోబుల్ స్టోన్ వీధులు కలిసి ఒక సాఫ్ట్ విజువల్ క్రియేట్ చేస్తాయి. మార్నింగ్ లైట్‌లో స్ట్రీట్స్ స్లోగా వేక్ అవ్వడం చూస్తే, ఈ ప్లేస్‌తో కనెక్షన్ నాచురల్‌గా బిల్డ్ అవుతుంది.
సందర్శనీయ స్థలాలు
పాత టిబిలిసిలో చిన్న చిన్న ఇరుకైన సందుల్లో నడుస్తూ ఉంటే గతంలోకి వెళ్లినట్టుగా అనిపిస్తుంది. నరికలా కోటకి వెళ్లినప్పుడు సిటీ వ్యూ వైడ్‌గా కనిపిస్తుంది. బ్రిడ్జ్ ఆఫ్ పీస్ రాత్రి సమయంలో ప్రశాంతంగా వెలుగుతూ ఉంటుంది. అబానోతుబాని ప్రాంతంలో ట్రెడిషనల్ టిబిలిసి సంస్కృతి ఆనవాళ్లు కనిపిస్తాయి.
ఏం తినాలి?
ఇక్కడ ఫుడ్ సింపుల్‌గా కనిపించినా చాలా శాటిస్ఫయింగ్‌గా ఉంటుంది. ఖాచాపూరిలో కరిగిన చీజ్, సాఫ్ట్ బ్రెడ్‌తో కలిసి కంఫర్ట్ ఫుడ్‌లా ఉంటుంది. అలాగే ఖింకలి అనే డంప్లింగ్స్ చాలా జ్యూసీగా ఉంటాయి. వీటిని తినే విధానం కూడా ఒక ప్రత్యేక అనుభవంగా మిగులుతుంది.
ఎప్పుడు వెళ్లాలి?
స్ప్రింగ్ (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) సమయంలో వాతావరణం చాలా ఫ్రెష్ ఫీల్‌ను ఇస్తుంది. ఆటమ్‌లో సిటీ రంగులు చాలా సాఫ్ట్‌గా, అందంగా మారుతాయి.
హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ కొన్ని సీజనల్‌గా అందుబాటులో ఉంటాయి.
లేదంటే దుబాయ్ లేదా దోహా నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ సులభంగా లభిస్తాయి.
ప్రయాణ సమయం సుమారు 7 నుంచి 10 గంటలు.
టిబిలిసిలో గడిపే టైమ్ ఫాస్ట్‌గా వెళ్లి΄ోతుందిం కానీ మెమోరీస్ మాత్రం స్లోగా మనసులో నిలిచి΄ోతాయి. సింపుల్ ట్రిప్‌ప్లాన్ చేసినా, ఈ నగరం అనుభవం మాత్రం నేచురల్‌గా స్పెషల్‌గా మిగిలి΄ోతుంది.
హిమాలయాల్లో రహస్య జీవనం
హిమాలయ పర్వతాల మధ్య ఒక గుహలో మలచిన పుగ్తాల్ మొనాస్టరీని చూస్తే ఇలాంటి నిర్మాణం సాధ్యమేనా అనిపిస్తుంది. ఇక్కడ జీవితం చాలా ప్రశాంతంగా, సింపుల్‌గా గడుస్తుంది. అందుకే మనశ్శాంతి కోసం చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రాంతానికి చేరుకోవడం అనేది ఒక ప్రయాణం మాత్రమే కాదు. అది ఒక అద్భుతమైన అనుభవం కూడా.
కాలం కొత్త రంగులు
ఈ మోనాస్టరీలో బౌద్ధ సన్యాసుల దినచర్య చాలా సింపుల్‌గా ఉంటుంది. ప్రతి ఉదయం ప్రార్థనల శబ్దం పర్వతాల మధ్య ఒక ఎకోలా మార్మోగుతుంది. చుట్టూ గోధుమ రంగులో మెరిసే పర్వతాలు, కింద నిశ్శబ్దంగా సాగే నది... ఈ కాంబినేషన్‌లో కాసేపు గడిపినా.. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇక్కడ కాలం ఆగిపోయినట్టు జీవితం కొత్త రంగులను అద్దుకున్నట్టుగా అనిపిస్తుంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌గా సాగుతున్న జీవితానికి ఈ ప్రదేశం ఒక స్పీడ్ బ్రేకర్‌లా పని చేస్తుంది.
ప్రకృతితో సహజీవనం
ఎలక్ట్రిక్ లైట్స్ కన్నా సహజమైన సూర్యోదయానికి ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. గాలి శబ్దం, నీటి ప్రవాహం ఇవన్నీ కలిసి ఒక నేచురల్ రిథమ్‌ను క్రియేట్ చేస్తాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఈ వ్యూస్‌ను ఆస్వాదిస్తూ, నిశ్శబ్దంలో ప్రకృతి పలికే మాటలను వినడానికి ప్రయత్నిస్తారు.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు ఫ్లైట్ లేదా ట్రెయిన్‌లో వెళ్లాలి. అక్కడి నుంచి లేహ్‌కి ఫ్లైట్ తీసుకుని, లేహ్ నుంచి జాన్సా్కర్ ప్రాంతానికి రోడ్డు ప్రయాణం చేయాలి. చివరిగా ఒక చిన్న ట్రెక్ చేసి ఫుగ్తాల్ మొనాస్టరీకి చేరుకోవచ్చు. అయితే ఈ ప్రయాణాన్ని ఒక చెక్‌లిస్టుగా కాకుండా మనశ్శాంతికి మార్గంగా భావించి ΄్లాన్ చేసుకోవాలి.ఈ ప్రాంతంలో ప్రతి అడుగు ఒక డిస్కవరీలా అనిపిస్తుంది. ఈ రహస్య నిలయం ఈ బౌద్ధ ఆలయం మనసులో చాలా లోతుగా నిలిచి΄ోతుంది.
మేఘాలలో దాగిన హరిత స్వర్గం(ఆగుంబే)
ప్రకృతిలో కొన్ని ప్రదేశాలు మన మనసులను మెల్లిగా మార్చేస్తాయి. ఆగుంబే కూడా అలాంటి ఒక ప్రదేశమే. ఫస్ట్ టైమ్ వెస్టర్న్ ఘాట్స్ ఎక్స్‌పీరియెన్స్ అవ్వాలి అనుకునే వారి కోసం ఇది ఒక సాఫ్ట్ ఎంట్రీ ఫీల్ ఇస్తుంది. ఈ ప్రదేశం పచ్చదనానికి కేరాఫ్ అడ్రెస్‌గా అనిపిస్తుంది. రోడ్ జర్నీలోనే మార్పు మొదలవుతుంది. సిటీ సౌండ్స్ తగ్గి, చుట్టూ లష్ ఫారెస్ట్, మిస్ట్‌తో కప్పబడిన కొండలు కనిపిస్తాయి. ఆగుంబేలో వాక్ చేస్తుంటే ప్రతి కార్నర్‌లో తడిసిన ఆకుల సువాసన, తాజా గాలి టచ్ క్లియర్‌గా తెలుస్తుంది.
సందర్శనీయ స్థలాలు
సన్‌సెట్ పాయింట్ దగ్గర మెల్లిగా ఆకాశం రంగులు మారడం చూస్తే కాలం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఆగుంబే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ వద్ద చిక్కటి అడవులను పర్యాటకులు బాగా ఇష్టపడుతుంటారు. బర్కానా ఫాల్స్ చుట్టుపక్కల నేచర్ చాలా రా అండ్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. చిన్న ఫారెస్ట్ ట్రైల్స్‌లో నడిస్తే సైలెన్స్ కూడా ఒక ఎక్స్‌పీరియెన్స్‌లా అనిపిస్తుంది.
ట్రై చేయాల్సిన ఫుడ్
ఇక్కడ ఫుడ్ చాలా సింపుల్‌గా ఉంటుంది. లోకల్ స్టైల్ మీల్స్ ఫ్రెష్‌గా సర్వ్ చేస్తారు. హాట్ రైస్, లైట్ కర్రీలు ఇంటి భోజనం ఫీల్ ఇస్తాయి. వర్షాకాలంలో చాయ్‌తో స్నాక్స్ ఎంజాయ్ చేయడం ఒక మెమరీలా ఉంటుంది.
ఎప్పుడు వెళ్లాలి?
జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాల్లో ఆగుంబే ఒక ఆకు పచ్చ ప్రపంచంలా మారిపోతుంది. చలికాలంలో కూడా ఇక్కడి అందాలు అలరిస్తాయి.
ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుండి మంగళూరు లేదా ఉడుపి వరకు ఫ్లైట్ లేదా ట్రైన్‌లో చేరి, అక్కడి నుండి రోడ్ జర్నీ ద్వారా ఆగుంబే చేరుకోవచ్చు. మొత్తం ట్రావెల్ టైమ్ సుమారు 10–12 గంటలు వరకు ఉంటుంది. ఆగుంబేలో లైఫ్ స్లోగా, నేచర్‌తో సింక్ అయిన ఫ్లోగా ఉంటుంది. ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా సమయాన్ని గడపవచ్చు. ఈ గ్రీనరీ జర్నీలో మీరు ఒక రీల్‌లో ఉన్నట్టే రియల్ అనుభూతిని పొందుతారు.
– ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు
(చదవండి: తొలి చారిత్రక రవాణా సాధనాల ప్రదర్శనశాల..!)
Tags : 1