Breaking News

బౌన్స్‌ బ్యాక్‌..ఈ విషయాలు అందరికీ తెలియాలి : టాలీవుడ్‌‘చందమామ’

Published on Wed, 01/01/2025 - 14:43

మహిళలకు  పెళ్లి, మాతృత్వం, పిల్లల పెంపకం అనేది కరియర్‌లో పెద్ద అడ్డంకిమాత్రమే కాదు. శారీరకంగా,మానసికంగా, భావోద్వేగ పరంగా చాలా క్లిష్టమైంది  కూడా. ఈ విషయాన్నే టాలీవుడ్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌ ద్వారా  చెప్పుకొచ్చింది. పట్టుదలగా,  ఓర్పుగా సాధన చేస్తే  పెళ్లీ, పిల్లల బాధ్యతలతో పాటు, కరియర్‌ను సాగించడం, అలాగే శారీరకంగా ఫిట్‌గా ఉండటం సాధ్యమే అంటూ  తన  అనుభవాలను షేర్‌ చేసింది.

బ్యాలెన్స్ అనేది చెప్పుకోడానికి బానే ఉంటుంది, కానీ వాస్తవం చాలా క్లిష్టంగా ఉంటుందంటూ 2024లో తన జర్నీ గురించి వివరించింది కాజల్‌.  2024  ఏడాది అంతా భావోద్వేగాలు, శారీరక మార్పులు వీటన్నిటికీ మించిన బాధ్యతల వలయంలో గడిచిపోయింది.  పసిబిడ్డకు తల్లిగా మాత్రమే కాకుండా, ఒక నటిగా తన బాడీనీ, శక్తిని నిరంతరం దృష్టిలో ఉంచుకోవాల్సిన పయనమిది అని పేర్కొంది.

బిడ్డ పుట్టిన తరువాత  బాగా బరువు పెరిగాను,  తల్లిగా పెరిగిన బరువును తగ్గించుకోవడంతోపాటు,  మాతృత్వపు బాధ్యతలు, నటిగా కరియర్‌, రెండింటినీ చాలా బలంగా నిర్వర్తించారు. ఆందోళనను అధిగమించాను.  కానీ అదంతా సులభంగా సాగలేదు. ఎన్నో సందేహాలు, ఆశలు, నిరాశలు, అలసట ఇలాంటివెన్నో ఉన్నాయి. ‘‘మనలో చాలా మందిలాగే, నేనూ అద్దంలో చూసుకున్నాను.. మళ్లీ మునుపటిలా మారతానా అని ఆలోచించేదాన్ని’’ అంటూ ఇన్‌స్టాలో తెలిపింది కాజల్‌.

 "బౌన్స్ బ్యాక్"  అసాధ్యం  కాదని  గ్రహించడమే  కీలక మలుపు.  దృఢ సంకల్పంతో కొత్త అధ్యాయం కోసం  ముందుగా సాగా అని చెప్పుకొచ్చింది.  అలాగే పోషకాహార నిపుణుడి సాయంతో ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకున్నాను. తృప్తినిచ్చే భోజనంతోపాటు క్రమశిక్షణగా, సమతుల్య ఆహారంపై దృష్టి కేంద్రీకరించాను అంటూ వివరించింది  కాజల్‌.   

ఈ ప్రయాణంలో ఫిట్‌నెస్ మరో మూలస్తంభం. చాలా ఓర్పుగా, ధైర్యం, సంకల్పంతో  ముందుకెళ్లాను. శ్రద్ధగా తీసుకున్న పోషకాహారం బిజీ షెడ్యూల్‌లో మరింత శక్తినిచ్చింది. ఈ నా జర్నీ  మరింత మందికి ధైర్యంతో ముందుకు సాగాలే ప్రేరణనిస్తుందని ఆశిస్తున్నాను. ప్రపంచం కోసంమాత్రమే కాకుండా, మనకోసం మన ఆనందం కోసం కలిసి సాగుదాం అంటూ ముగించింది.   అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు  తెలిపింది.

కాగా చందమామ, మగధీర లాంటి సినిమాలతో  టాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజల్‌,  2020లో  తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను వివాహం  చేసుకుంది. వీరికి ఒక కుమారుడు.  ఈ బాధ్యతల  విరామం తరువాత మళ్లీ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)