Breaking News

Tip of the day కాన్సంట్రేషన్ కుదరడం లేదా? ఇవిగో చిట్కాలు!

Published on Wed, 06/18/2025 - 17:32

 

ఒక పనిలో  విజయం సాధించాలంటే పట్టుదల అవసరం. సాధించాలనే  కసితో  పనిపై దృష్టి పెడితే ఎలాంటి కష్టాన్నైనా అధిగమించవచ్చు.  ఇవాల్టి టిప్‌ ఆఫ్‌ ది డేలో భాగంగా  కాన్‌సెంట్రేషన్‌  పెంచుకోవడం   ఎలాగో చూద్దాం.

 

  • ఒత్తిడికి  ఆందోళనకు దూరంగా ఉండాలి.
  • ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.
  • పని, ప్రాజెక్ట్, లేదా కొత్తగా నేర్చుకోవాలనుకున్నపుడు పనికి ప్రణాళిక అవసరం.  పనిని చిన్న భాగాలుగా విభజించి, ఒక్కొక్కటిగా దృష్టి పెట్టాలి.
  • ప్రతి రోజు ఒక నిర్దిష్ట సమయాన్ని పని చేయడానికి కేటాయించండి.ఆ సమయంలో ఇతర విషయాలను పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి. 
  • ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, గాడ్జెట్లకు దూరంగా ఉండండి. కనీసం ఫోన్‌ను, నోటిఫికేషన్లను మ్యూట్‌లో పెట్టేయండి. బాగా అలసిపోయినప్పుడు, చిన్న విరామాలు తీసుకోండి.   మెడిటేషన్‌ చేయండి.
  • సందేహాలు, అనుమానాల నివృత్తి కోసం నిపుణుల సలహాలను తీసుకోండి. అడగడానికి  ఏ మాత్రం సంకోచించకండి.
  • మీరు పనిపై దృష్టి పెట్టలేకపోతున్నారంటే, దాని వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. వాటిలో కొన్ని:
  • అధిక ఒత్తిడి లేదా ఆందోళన మీ మెదడును గందరగోళంగా మార్చేస్తాయి. కాన్‌ సంట్రేషన్‌ కుదరదు.
    ఎక్కువ అలిసిపోయినా మెదడు  చురుకుగా పనిచేయదు
  • చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా, ఏకాగ్రతకు అనుకూలంగా ఉండేలా చూసుకోండి. చుట్టూ ఉన్న శబ్దాలు లేదా ఇతర విషయాలు మిమ్మల్ని సులభంగా పరధ్యానంలోకి నెట్టేయవచ్చు.  పట్టుదలతో ప్రయత్నిస్తే అనుకున్న విజయం సాధించడం తధ్యం. 

కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఏకాగ్రత నిలపలేక పోవడానికి కారణం కావచ్చు. ఉదాహరణకు, దృష్టి లోపం, లేదా ADHD వంటివి.ఇలాంటి పరిస్థితుల్లో వైద్య సలహాలు తీసుకోవడం ఉత్తమం.
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)