Breaking News

Beauty Tips: బ్లాక్‌ హెడ్స్‌కు చెక్‌, ముఖాన్ని మెరిపించే స్క్రబ్స్‌

Published on Tue, 06/10/2025 - 11:41

ఎన్ని జాగ్రత్తలు   పాటిస్తున్నప్పటికీ బ్లాక్‌ హెడ్స్‌ వస్తూనే ఉంటాయి. వీటివల్ల ముఖం కళావిహీనంగా కనిపిస్తుంది. వీటిని తీయించుకోవడం ఖర్చుతో కూడుకున్నదేగాక, సమయం కూడా వెచ్చించాలి. అయితే ఇంట్లో ఉండే దాల్చినచెక్క, నిమ్మ, పప్పు,  పాలు, పంచదార, కొబ్బరి నూనె, ఉప్పుతో సులభంగా తొలగించుకోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం...

చర్మంలో అతిముఖ్యమైన ప్రొటిన్‌ కొల్లాజెన్‌ విడుదలను మెరుగుపరచడంలో దాల్చినచెక్క ప్రముఖ పాత్ర  పోషిస్తుంది. చర్మం మీద ఏర్పడే రంధ్రాలను దాల్చిని తగ్గిస్తుంది. నిమ్మరసంలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మంమీద రంధ్రాలను లోతుగా శుభ్రం చేస్తాయి. అందువల్ల అరచెక్క నిమ్మరసంలో టీస్పూను దాల్చిన చెక్క పొడి వేసి  కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్‌ ఉన్న ప్రాంతంలో పూతలా వేసి పదిహేను నిమిషాల పాటు మర్దనా చేయాలి. తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే బ్లాక్‌హెడ్స్‌ తగ్గుముఖం పడతాయి.

స్పూను పంచదారలో రెండు టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నూనెవేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు మర్దన చేసి తరువాత కడిగేయాలి. పంచదార చర్మాన్ని లోతుగా శుభ్రంచేసి మూసుకు పోయిన రంధ్రాలను తెరవడంతో పాటు, మృతకణాలను తొలగిస్తుంది. కొబ్బరి నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు, మృదువుగా మారుస్తాయి.

అరచెక్క నిమ్మరసంలో అరటీస్పూను సాల్ట్‌వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదినిమిషాల΄ాటు మర్దన చేసి చల్లని నీటితో కడిగేయాలి. ఈ స్క్రబ్‌ వదులుగా ఉన్న చర్మాన్ని బిగుతుగా మార్చడంతోపాటు, బ్లాక్‌హెడ్స్‌ను తొలగించి చర్మం కాంతిమంతం గా మెరిసేలా చేస్తుంది. 

ఇదీ చదవండి: Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే..

డార్క్‌ సర్కిల్స్‌
టీ స్పూన్‌ టొమాటో గుజ్జు, సెనగపిండి, చిటికెడు పసుపు, అర టీస్పూన్‌ నిమ్మరసం కలిపి పేస్ట్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, కళ్ల మీద గుండ్రంగా తరిగిన కీరా ముక్కలు ఉంచి ఇరవై నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తుంటే కళ్ల కింద నల్లని వలయాలు తగ్గుముఖం పట్టి, ముఖం కాంతిమంతం అవుతుంది.
 

నోట్‌: ఆరోగ్యాన్ని మించిన అందంలేదు.  సమతులం ఆహారం,   క్రమం తప్పని వ్యాయామం,   సరిపడినన్ని నీళ్లు తాగడం, చక్కటి నిద్ర, ఒత్తిడి లేని జీవితం, నలుగురితో హాయిగా, సంతోషంగా నవ్వుతూ గడిపే జీవన శైలి,ఏదైనా అనారోగ్యసమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం   ఇవి చాలు  ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)