Breaking News

చాయ్‌ వ్యాపారంతో అన్ని కోట్లా..!ఆ ముగ్గురు కుర్రాళ్ల ఐడియా..

Published on Mon, 10/05/2026 - 15:53

ముగ్గురు స్నేహితులు సివిల్స్‌కి సన్నద్ధమవ్వడమో, ప్రైవేట్‌ ఉద్యోగం చేయడమో ఎంచుకోకుండా..వ్యాపారానికి సై అన్నారు. ఆ ముగ్గురు ఎంచుకుంది చాయ్‌ వ్యాపారాన్ని. అందరికి తెలిసిన సాధారణ వ్యాపారాన్ని ఎంత క్రేజీ వ్యాపారంగా మార్చారంటే..జస్ట్‌ పేరుతోనే వైబ్స్‌ తెప్పించి క్రేజ్‌ వచ్చేలా చేశారు. దాంతో అది ప్రస్తుతం పెద్ద వ్యాపార సామ్రాజ్యంలా విస్తరించి ఎన్ని కోట్లు ఆర్జిస్తుందో తెలిస్తే విస్తుపోవడం ఖాయం. 

వాళ్లే ఇండోర్‌కి చెందిన స్నేహితులు అనుభవ్‌ దుబే, ఆనంద్‌ నాయక్‌, రాహుల్‌ పాటిదార్‌లు. భారత్‌లో టీకి ఉన్న క్రేజ్‌ ఏంటో తెలిసిందే. ఆ నేపథ్యంలోనే భీ ముగ్గురు టీకొట్టుతోనే వ్యాపారం చేయడం ప్రారంభించారు. అందరిలా చిన్న కొట్టు పెట్టేసుకుంటే ఏం క్రేజ్‌ ఉంటుంది. అందుకని చాలా వినూత్నంగా ఆలోచించి 2016లో చాయ్‌ సుట్టా బార్‌ని స్థాపించారు. జస్ట్‌ రూ. 3 లక్షలతో ప్రారంభించారు. అయితే ఆ చాయ్‌ని సరసమైన ధరల్లో అందించారు. 

దీంతోపాటు బర్గర్లు, నూడుల్స్‌, పాస్త వంటి ఆహారాలను కూడా సర్వ్‌ చేశారు. ఆ చౌక ధరల కారణంగానే అనతికాలంలోఏ అతి పెద్ద వ్యాపార బ్రాండ్‌ అవతరించి బ్రాంచ్‌లుగా విస్తరించింది. అలా ఈ బ్రాండ్‌కి సుమారు 650కి పైగా ఔట్‌లెట్‌లు ఉండటం విశేషం. ఇక్కడ చాయ్‌ ధర రూ. 15 రూలు. కాఫీ ధర రూ. 20లు, కోల్డ్‌ కాఫీ, షేక్‌ల ధర కేవలం రూ. 70లే. ఈ చాయ్‌ బ్రాండ్‌ అందించే వాటిలో అత్యంత విశేషమైనది కుల్హడ్ చాయ్. దీన్ని మట్టి కప్పుల్లో అందిస్తారు. 

అంతేగాదు ఇక్కడ అందించే చాయ్‌​ మెనూలో అల్లం టీ, తులసీ, కేసర్‌ వంటి ప్లేవర్‌లు అందుబాటు ధరల్లో ఉంటాయి. ఈ బాండ్‌ ఫ్రాంచైజీ పద్ధతిలో పనిచేస్తుంటుంది. అందుకే తన ప్రాంచైంజీని ప్రారంభించే ముందు 15 రోజుల శిక్షణ కూడా ఇస్తారట. ప్రస్తుతం ఇది సుమారు రూ. 100 కోట్ల పైనే ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఈ బ్రాండ్‌ ఇటీవలే నేపాల్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వంటి దేశాల్లో తన బ్రాండ్‌ కార్యకలాపాలను ప్రారంభించింది కూడా.

ఇదీ చదవండి: కొడుకుని మార్చబోయి.. ఆమెనే గేమింగ్‌ క్వీన్‌గా! వైరల్‌గా 60 ఏళ్ల ఆంటీ స్టోరీ

 

 

Videos

నిన్నే అడుగుతున్న... పెనుకొండలో ఉషశ్రీ చరణ్ భారీ ధర్నా

రజినీతో క్లాష్ మిస్... దుల్కర్ తో క్లాష్ ఫిక్స్..

జూలైలోనే విమానం కూల్చేందుకు కుట్ర... సంచలన విషయాలు

రాయలసీమ ద్రోహి చంద్రబాబు

YSRCP నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి కుట్ర

బాల్కనీ నుంచి జారిన చిన్నారి.. చివరి క్షణంలో ఎలా కాపాడాడంటే!

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో డెలివరీ బాయ్‌పై భార్యాభర్తల దాడి

ఫ్యాన్ కోసం సెక్యూరిటీని లెక్కచేయని ధావన్

తాట తీస్తాం చుట్టమల్లే డీప్ ఫేక్ పై నాగవంశీ వార్నింగ్

రాజకీయ ప్రయాణం బుక్ స్థితప్రజ్ఞుడు YS జగన్..

Photos

+5

మూవీ రిలీజ్ తర్వాత మళ్లీ ట్రెండింగ్‌లో నక్షత్ర (ఫొటోలు)

+5

ఎం.ఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్.. రష్మిక ఎమోషనల్ పోస్ట్ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్ కళ్యాణ్’మూవీ హీరోయిన్ మహిమ నంబియార్ (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ 'దేశీ గర్ల్' లుక్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్ : ఏపీలో ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలు...(ఫొటోలు)

+5

టెన్నిస్‌ కోర్టులో నటి వర్ష డిసౌజా.. (ఫొటోలు)

+5

రష్మిక రణబాలి లుక్‌.. అదిరిపోయిన స్టిల్స్(ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ భారత క్రికెటర్‌ శిఖర్ ధావన్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : దుర్గామాతకు జైకొడదాం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : సందడిగా దక్కన్‌ డెర్బీ మీట్‌ (ఫొటోలు)