Breaking News

ఒంటరితనం వేధిస్తుందా? మానసిక ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి?

Published on Sat, 10/14/2023 - 15:14

రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్‌) జోడెద్దులా పల్లెల్లో సవారీ చేస్తుండగా.. ఇప్పుడు మానసిక రుగ్మతలూ వెంటాడుతున్నాయి. నిన్నా మొన్నటిదాకా పట్టణాలు, నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ పోకడ తాజాగా గ్రామీణ ప్రాంతాలకూ తాకడం ప్రమాదకర సంకేతాలు ఇస్తున్నట్టే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇటీవలి కాలంలో మానసిక ఇబ్బందులతో వస్తున్న వారు ఎక్కువయ్యారని వైద్యులు తెలియజేస్తున్నారు. మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రాం స్క్రీనింగ్‌ పరీక్షల్లో తేలిందని వారు పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో రకరకాల మానసిక రుగ్మతలతో ఇబ్బంది పడుతున్న వారు వేలాదిమంది ఉన్నట్టు బయటపడింది. స్క్రిజోఫ్రీనియా, డిప్రెషన్‌, మూడ్‌ డిజార్డర్స్‌ వంటి మానసిక జబ్బులతో సతమతమవుతున్నారు. సగటున చూస్తే పురుషుల్లోనే ఎక్కువ మంది బాధితులున్నట్టు వెల్లడైంది.
 

స్కిజోఫ్రీనియా..యాంగ్జైటీలే ఎక్కువగా..

స్కిజోఫ్రీనియా (మనో వైకల్యం), యాంగ్జైటీ (ఆందోళన) ఎక్కువ మందిలో ఉన్నాయి. ప్రతి దానికీ డీలా పడిపోవడం, ఏమవుతుందోనని భయం, ఆందోళన వంటి జబ్బులతో సతమతమవుతున్నారు. వైద్యుల వద్దకు చికిత్సకు వెళ్లాలంటే కూడా ఆత్మన్యూనతగా భావిస్తున్నారు. ఇలాంటి మానసిక వ్యాధులు దీర్ఘకాలికంగా ఉండటంతో వృత్తిపరంగానూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇండోనేషియలో స్కిజోఫ్రెనియా కేసులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇక మనదేశంలో సుమారు 3 మిలియన్ల కంటే ఎక్కువమంది స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నారు. పనిఒత్తిడి, చిన్నచిన్న విషయాలకే ఆందోళన చెందడం వంటివన్నీ మానిసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. 

మానసిక రుగ్మతలకు ప్రధాన కారణాలు

► ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్నకుటుంబాలు రావడంతో వేధిస్తున్న ఒంటరితనం.
► ఆరు సంవత్సరాల వయసు నుంచే సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువగా ఉండటం.
► మద్యం, ఇతర మత్తుపదార్థాల వినియోగంతో యువకుల్లో మానసిక రుగ్మతలు పెరగడం.
► ప్రైవేటు లేదా కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విపరీతమైన ఒత్తిడి.
► సాఫ్ట్‌వేర్‌, బ్యాంకింగ్‌ వంటి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరగడం.
► వ్యాయామం లేకపోవడం వల్ల చిన్న వయసులోనే జీవనశైలి జబ్బులకు గురవడం.
► ఇటీవలి కాలంలో స్మార్ట్‌ ఫోన్‌ల ప్రభావంతో చిన్నారుల్లో మానసిక ఎదుగుదల సరిగా లేకపోవడం.

ఒత్తిడిని అధిగమిద్దాం ఇలా..

మనుషులు పలు కారణాలతో అనేక రకాల ఒత్తిడులకు గురవుతుంటారు. అవి శారీరక, మానసిక ఒత్తిడి అని రెండు రకాలుంటాయి. ఆరోగ్యం కాపాడుకుంటే శారీరక ఒత్తిడిని జయించవచ్చు. మిత ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం, నిత్యం యోగా చేయడం, వృత్తిపరమైన శిక్షణతో మానసిక ఒత్తిడిని అధిగమించొచ్చు.

వ్యాపారంలో సరైన లాభాలు రాకపోవడం, అధిక పని, పదోన్నతి లేని ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. చేసే పనిని ప్రేమించాలి. వృత్తిపరంగా గెలుపు, ఓటములు ఉంటాయి. ఓటమిని సవాల్‌గా స్వీకరించి విశ్లేశించుకుని ముందుకెళ్లాలి. స్ఫూర్తిదాయక వ్యక్తుల మధ్య గడపడం, మంచి పుస్తకాలు చదవడం, అనవసర ఆలోచనలు, చికాకులను దూరం పెట్టడం ద్వారా సంతోషమైన జీవితాన్ని గడపాలి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)