Breaking News

ఎలాన్‌ మస్క్‌ తల్లి మాయే హెల్త్‌ టిప్స్‌: 14 మంది పిల్లలకు నానమ్మగా..!

Published on Wed, 11/13/2024 - 17:20

ఎలన్ మస్క్ పేరు చెప్పగానే అందరికి టెక్నాలజీని శాసిస్తున్న వ్యక్తి గుర్తుకొస్తాడు. ఎంత అత్యున్నత స్థాయిలో ఉన్నా కూడా.. ఓ కొడుకుగా తల్లి మాట వినాల్సిందే. ఇక్కడ మస్క్‌ కూడా తన తల్లి మాయే ఆహార నియమాలకు కట్టుబడి ఉంటాడట. అంతేకాదు ఆమె తన 14 మంది మనవళ్లు, మనవరాళ్లు కోసం కూడా కొన్ని ఆహార నియమాలను కూడా రూపొందించిందట. అవి వాళ్లంతా తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందేనట. ఇక మస్క్‌ తల్లి మాయే ఏడు పదుల వయసులో కూడా ఎంతో ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంటారు. 

మాయే మాజీ మోడల్‌, డైటీషయన్‌ కూడా. ఆమె ఆహారం విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా నోటిలో పెట్టుకునే వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని నొక్కి చెబుతున్నారు. అంతేగాదు యువతరం చక్కటి ఆరోగ్య కోసం ఎలాంటి పోషకాహార నియామాలు పాటించాలో కూడా వివరించారు. అవేంటో చూద్దామా..!.

76 ఏళ్ల మాయే మస్క్‌ ఈ వయసులో కూడా ఎంతో అందంగా, చురుకుగా ఉంటారు. ఆమె గత 40 ఏళ్లుగా డైటీషియన్‌కి సంబంధించి ఓ ప్రైవేట్‌ సంస్థను కూడా నడుపుతోంది. ఆమె తరుచుగా ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు చెబుతుంటారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్యూలో తన హెల్త్‌ సీక్రెట్‌ని వివరిస్తూ.. ఈనాటి యువతరం ఎలాంటి ఫుడ్‌ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సవివరంగా చెప్పుకొచ్చారు. 

ముఖ్యంగా స్థూలకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు తప్పనిసరిగా డైట్‌ని మార్చి ఆరోగ్యకరమైన వాటిని తీసుకునేలా ప్రయత్నించాలని అంటారు మాయే. అప్పుడు బ్లడ్‌లో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలో మెరుగైన మార్పులు కనిపించడమే గాక చికిత్స ఖర్చులు కూడా ఆదా అవుతాయని అంటారామె. 

అలాగే తాను 14 మంది పిల్లలకు నానమ్మగా ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో ఎలాంటి రాజీకి తావివ్వనని అన్నారు. ముఖ్యంగా చిప్స్‌, కుక్కీలకు తన ఇంట్లో స్థానం ఉండదంటారు. చక్కెర, సోడియంతో కూడిన ప్రాసెస్‌ చేసిన ఆహారాలు ప్రమాదకరమైన దుష్ప్రభావాలను కలుగజేస్తాయని నొక్కిచెప్పారు. 

తన మనవళ్లు, మనవరాళ్లను అవి తినే విషయంలో తాను చాలా స్ట్రిక్‌గా ఉంటానన్నారు. జంక్‌ఫుడ్‌కి ఎడిక్ట్‌ అయ్యేలా చేసేవే అవేనని అంటారు మాయే. చిన్నారులు ఒక్కసారి తినే ప్రయత్నం చేస్తే దాన్ని కంట్రోల్‌ చేసుకోలేరు అందువల్లే ముందే వాళ్ల దరిదాపుల్లోకి వాటిని రానీయకూడదంటారామె. వాటికి బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఇవ్వమని సూచిస్తున్నారు మాయే. అవేంటంటే..

  • పండ్లు

  • కూరగాయలు

  • పెరుగు

  • పాలు

  • తృణధాన్యాలు

  •  గోధుమ రొట్టె తదితరాలు..

ఇక అమెరికన్‌ హార్ట్ అసోసియేషన్ ప్రకారం..చిప్స్‌, కుక్కీలు విపరీతమైన ఉప్పు, చక్కెరతో ఉంటాయి. వీటిని తినడం వల్ల దంత క్షయం, చెడు కొలెస్ట్రాల్‌,  టైప్‌2 డయాబెటిస్‌, కేన్సర్‌, నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ వ్యాధి, ఒబెసిటీ తదితర అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. 

వీటిని సరదాగా ఒక్కసారి చిన్నారులకు అలవాటు చేస్తే వాటి రుచికి ఆటోమెటిక్‌ మళ్లీ తినాలను కోరిక వారిలో బలంగా పెరుగుతుందని అన్నారు. ఒకరకంగా వారి మెదడు కూడా తెలియకుండా వాటికి బానిసయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఆదిలోనే వాటిని దరిచేరనీయకుండా చూస్తే ఆరోగ్యవంతంగా పెరుగుతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

(చదవండి:

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)