Breaking News

నువ్వే నా ఫస్ట్‌ లవ్‌ అని చెబితే అస్సలు నమ్మకండి.. అంతా అబద్దమట

Published on Sat, 07/15/2023 - 16:56

అబద్దం..ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అబద్దాలు చెబుతూనే ఉంటారు. ఎంత నిజాయితీగా ఉందామనుకున్నా అవసరం కొద్దీ కొన్నిసార్లు అబద్దాలు చెప్పాల్సి వస్తుంది. కొంతమంది సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి అబద్దాలు చెబితే, మరికొందరు ప్రతి చిన్న విషయానికి కూడా అబద్దాలు చెబుతూ ఉంటారు.

వీళ్లలో మగవాళ్లే, ఆడవాళ్ల కంటే ఎక్కువగా అబద్దాలు చెబుతున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది.మహిళలు రెండింతలు అబద్దాలు చేపితే పురుషులు వారికన్నా ఆరు రెట్లు ఎక్కువగా అబద్దాలు చెబుతున్నట్లు పరిశోధకులు తేల్చేశారు. మన దేశంలో ఎక్కువగా ఎవరు ఏఏ సందర్భాల్లో అబద్దాలు చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..


►ఎక్కువగా జీవిత భాగస్వామితో అబద్దాలు చెబుతున్నారని సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా మహిళలతో షాపింగ్‌ చేసేందుకు తప్పించుకోవడానికి రకరకాల కారణాలు చెబుతుంటారని తేలింది.
► సారీ.. పనిలో ఉన్నాను,ఫోన్‌ చూసుకోలేదు. అందుకే లిఫ్ట్‌ చేయలేదు అని ఎక్కువగా అబద్దాలు చెబుతుంటారు.
► నువ్వే నా ఫస్ట్‌ లవ్‌ అని ఎవరైనా చెబితే అస్సలు నమ్మకండి. చాలామంది మగవాళ్లు ఈ అబద్దాన్ని తమ గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్‌ చేయడానికి ఎక్కువగా ఈ అబద్దం చెబుతారట.



► కొంతమంది మగవాళ్లు రేపట్నుంచి సిగరెట్‌ మానేస్తాను అని చెప్పి ప్రతిరోజు అదే రిపీట్‌ చేస్తారట. 
► ఏదైనా ఒక ప్లేస్‌కి వెళ్దామని అడిగితే, ఇష్టం లేకపోతే పని ఉందని అబద్దం చెబుతారట.
► చాలామంది తమ దగ్గర చేతులో డబ్బులు ఉన్నా ఇవ్వడానికి ఇష్టపడరట. అప్పు అడిగితే ఇప్పుడు లేవు అని అబద్దాలు చెబుతున్నారట.
► కొంతమంది నోరు తెరిస్తే అబద్దాలు చెబుతుంటారు. అలా దొరికిపోతారు కూడా..అయినా సరే, ఇప్పుట్నుంచి అబద్దాలు చెప్పను అని మళ్లీమళ్లీ చెబుతుంటారు.



► అనుకున్నా టైం కంటే ఆలస్యమైతే, సారీ ట్రాఫిక్‌లో చిక్కుకున్నాను అని ఈజీగా అబద్దాలు ఆడేస్తారట.
► ఆడవాళ్లలో చాలామందికి పొసెసివ్‌ ఫీలింగ్‌ ఎక్కువ. తమకు అటెష్టన్‌ ఉండాలని ఆరాటపడతారట.వేరే అమ్మాయిలు అందంగా రెడీ అయినా జస్ట్‌ ఓకే, పర్లేదు, ఈ డ్రెస్‌ నీకంత నప్పలేదు అని అబద్దాలు చెబుతారట. 
► నా బైక్‌ పంక్చర్‌ అయ్యింది, లేదా పెట్రోల్‌ అయిపోయింది అని చెబుతుంటారట ఒకవేళ బైక్‌ ఇవ్వడం ఇష్టం లేకపోతే
► అమ్మాయిలను ఇంప్రెస్‌ చేయడానికి రకరకాల ఫీట్లు చేసి అబద్దాలు చెబుతుంటారట.

ఇందులో 58% మంది తమకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే అబద్దాలు చెబుతారని, 42% మంది తమ సీక్రెట్‌ను రహస్యంగా ఉంచేందుకు అబద్దాలు చెబుతారని తేలింది.  40శాతం మంది తాము నలుగురిలో చులకన అవ్వకుండా ఉండేందుకు అబద్దాలు చెబుతారని పరిశోధనలో వెల్లడైంది. మొత్తంగా చూసుకున్నా ఆడవాళ్లకంటే మగవాళ్లే ఎక్కువగా అబద్దాలు చెబుతారని తేలిపోయింది. రోజుకు కనీసం ఒక్కసారైనా అబద్ధం చెప్పే వారి సంఖ్య మగవారిలోనే అధికంగా ఉంటుందట.కొందరి బాడీ లాంగ్వేజీని బట్టి కూడా అబద్దాలు చెబుతున్నారా లేదో తెలుసుకోవచ్చట. మూడేళ్ల వయసు నుంచే అబద్దాలు చెప్పడం ప్రారంభమవుందని చెబుతున్నారు నిపుణులు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)